For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ మేట్ సంస్థ‌లో పేటీఎమ్ పెట్టుబ‌డులు

ద్విచ‌క్ర‌వాహ‌న దారుల రుణ అర్హ‌త‌ను నిర్ధారించే సంస్థ వుర్జా మ‌నీ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటా ద‌క్కించుకున్న‌ట్లు ఈ-కామ‌ర్స్స్ సంస్థ పేటీఎమ్ వెల్ల‌డించింది. అయితే వాటా ఎంత‌నేది తెలియ‌రాలేదు

|

ద్విచ‌క్ర‌వాహ‌న దారుల రుణ అర్హ‌త‌ను నిర్ధారించే సంస్థ వుర్జా మ‌నీ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటా ద‌క్కించుకున్న‌ట్లు ఈ-కామ‌ర్స్స్ సంస్థ పేటీఎమ్ వెల్ల‌డించింది. అయితే వాటా ఎంత‌నేది తెలియ‌రాలేదు. రుణ దాత‌ల‌తో క‌లిసి సాంకేతికత ఆధారంగా వుర్జా మ‌నీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన క్రెడిట్ మేట్ ఆధారంగా వ్య‌క్తుల రుణ అర్హ‌త‌ను తెలుసుకునేందుకు పేటీఎమ్ ప్ర‌య‌త్నిస్తోంది.
ముంబ‌యికి చెందిన వుర్జా ప్రైవేట్ లిమిటెడ్ జులై 2016లో ప్రారంభ‌మైంది. ఈ సంస్థ‌కు ప‌లు ఆటో డీల‌ర్ల‌తోనూ, వివిధ బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌తోనూ భాగ‌స్వామ్యాలు ఉన్నాయి. ఈ సంస్థ గ‌తేడాది న‌వంబ‌రులో 5లక్ష‌ల డాల‌ర్ల నిధుల‌ను సేక‌రించింది. ఇప్పుడు పేటీఎమ్ ఈ సంస్థ‌లోకి తెచ్చే నిధుల‌ను వ్య‌క్తుల‌కు సంబంధించి ఎలాంటి రుణాలు ఇవ్వాలి, దీర్ఘ‌కాల రుణాల పెంపు వ్యూహాల వంటి నిర్ణ‌యాల‌కు ఉప‌యోగిస్తారు.

 క్రెడిట్ మేట్ సంస్థ‌లో పేటీఎమ్ పెట్టుబ‌డులు

గ‌త వారం పేటీఎమ్, ఐసీఐసీఐతో జ‌ట్టు క‌ట్టి రూ.20 వేల వ‌ర‌కూ 45 రోజుల పాటు వ‌డ్డీ ర‌హిత రుణాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. పేటీఎమ్ ఇదివ‌ర‌కే వ్యాపారుల‌కు త‌మ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా మూల‌ధ‌నాన్ని స‌మ‌కూర్చే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇక‌పై వ‌స్తువుల‌కు సంబంధించి వినియోగ‌దారులు తీసుకునే రుణాల ఆధారంగా ఆయా రుణ‌గ్ర‌హీత‌ల స‌మాచారాన్ని క్రోడీక‌రిస్తారు. ఇక‌పై భ‌విష్య‌త్తులో ఏవైనా ఆర్థిక సంస్థ‌లు రుణాలు ఇవ్వాలంటే స‌మాచార సేక‌రిణిని ఏర్ప‌రిచి అందరికీ అందుబాటులో ఉంచుతారు. త‌ద్వారా వినియోగ‌దారుల‌కు రుణాలివ్వ‌డం క‌న్సూమ‌ర్ సంస్థ‌ల‌కు, బ్యాంకుల‌కు సులువవుతుంది.

Read more about: paytm ecommerce
English summary

క్రెడిట్ మేట్ సంస్థ‌లో పేటీఎమ్ పెట్టుబ‌డులు | Paytm acquires stake in online loans firm CreditMate

Paytm on Tuesday said it has bought an undisclosed stake in Urja Money Pvt. Ltd, which evaluates creditworthiness of people seeking loans to buy two-wheelers. Paytm will use Urja’s proprietary CreditMate technology to create a loan management system in collaboration with lending partners.
Story first published: Wednesday, November 22, 2017, 15:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X