For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియోకు స‌వాల్ విసురుతున్న బెంగుళూరు స్టార్ట‌ప్

జియో 4జీ రాక‌తో టెలికాం రంగంలో ఒక విప్ల‌వాన్నే సృష్టించింది. ఇత‌ర టెలికాం సంస్థ‌లు న‌ష్ట‌పోయేలా జియో దూకుడు ప్ర‌ణాళిక‌తో ముందుకెళుతోంది. అయితే జియో స‌హా ప్ర‌స్తుత టెలికాం సంస్థ‌ల‌కు పోటీగా బెంగుళూర

|

జియో 4జీ రాక‌తో టెలికాం రంగంలో ఒక విప్ల‌వాన్నే సృష్టించింది. ఇత‌ర టెలికాం సంస్థ‌లు న‌ష్ట‌పోయేలా జియో దూకుడు ప్ర‌ణాళిక‌తో ముందుకెళుతోంది. అయితే జియో స‌హా ప్ర‌స్తుత టెలికాం సంస్థ‌ల‌కు పోటీగా బెంగుళూరు స్టార్ట‌ప్ వైఫై డ‌బ్బా త‌క్కువ ధ‌ర‌కే ఇంటర్నెట్ అందిస్తోంది. రూ.4 వేల ఖ‌ర్చుతో ఒక వైఫై రూట‌ర్ పెట్టి దాంతో 100-200 మీట‌ర్ల ప‌రిధిలో నెట్ సౌక‌ర్యాన్ని తీసుకొచ్చింది. ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ లైసెన్సుతో ఫైబ‌ర్ ఆప్టిక్స్ ద్వారా ప్ర‌స్తుతం కేబుల్ ఆప‌రేట‌ర్ల‌తో సేవ‌లందిస్తోంది. బెంగుళూరులో మొద‌లై త్వ‌ర‌లో ఇత‌ర న‌గ‌రాల‌కు విస్త‌రించ‌నున్న వైఫై డ‌బ్బా విశేషాలు మీ కోసం...

 1. వైఫై డ‌బ్బా కంపెనీ వివ‌రాలు

1. వైఫై డ‌బ్బా కంపెనీ వివ‌రాలు

కంపెనీ పేరు: వైఫై డ‌బ్బా

వ్య‌వ‌స్థాప‌కులు : శుభేందు శ‌ర్మ‌, కారం ల‌క్ష్మ‌ణ్‌

ఎక్క‌డ‌: బెంగుళూరు

రెవెన్యూ: ఈ వివ‌రాలు లేవు

సిబ్బంది: 32 మంది

ఇన్వెస్ట‌ర్ వివ‌రాలు, సేక‌రించిన నిధులు: తెలియ‌దు

2. 13 నెల‌ల స్టార్ట‌ప్‌

2. 13 నెల‌ల స్టార్ట‌ప్‌

రిల‌య‌న్స్ జియో మొత్తం టెలికాం రంగంలో డేటా టారిఫ్‌ల విష‌యంలో ధ‌ర‌ల యుద్ధానికి తెర‌తీసింది. అయితే ఈ 13 నెల‌ల స్టార్ట‌ప్ డేటా ధ‌ర‌ల విష‌యంలో మ‌రింత పోటీని ఇస్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న‌వారు డేటా వాడే తీరే మార్చ‌డంలో ఇది కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది.

3. ఇప్ప‌టికీ ఇండియాలో డేటా ఖ‌రీదే

3. ఇప్ప‌టికీ ఇండియాలో డేటా ఖ‌రీదే

''ప్ర‌స్తుతం ఇండియాలో డేటా ఎక్కువ ఖ‌రీదుగా ఉంది. జియో రాక త‌ర్వాత కూడా పెద్ద‌గా డేటా ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లు లేదు. ఇంకా డేటా ధ‌ర‌లు త‌గ్గ‌డానికి పోటీకి అవ‌కాశం ఉంది. ఇంకా డేటా ధ‌ర‌లు త‌గ్గుతాయని మేము న‌మ్ముతున్నాం'' అని వైఫై డ‌బ్బా స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు శుభేంధు శ‌ర్మ అన్నారు.

 4. జియో కంటే త‌క్కువ ధ‌ర‌కే డేటా

4. జియో కంటే త‌క్కువ ధ‌ర‌కే డేటా

వై కాంబినేట‌ర్ ద్వారా నిధులు పొందుతున్న ఈ స్టార్ట‌ప్ డేటాను చాలా త‌క్కువ ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు అందిస్తున్న‌ది. డేటా ప్యాకేజీలు: 100 ఎంబీ 2 రూపాయలు, 500 ఎంబీ 10 రూపాయ‌లు, 1జీబీ 20 రూపాయలు ఇలా ఉన్నాయి. వీట‌న్నింటి వాలిడిటీ ఒక రోజు లేదా 24 గంట‌లు. ఇత‌ర వాటితో పోలిస్తే ఈ డేటా రేట్లు త‌క్కువే. జియోకు సంబంధించి 150ఎంబీ రూ.19, 1.05జీబీ డేటా రూ.52 ఉండ‌గా, జియోతో పోల్చినా వైఫై డ‌బ్బా త‌క్కువ ధ‌ర‌కే డేటాను అందుబాటులోకి తెచ్చింది.

5. యాప్ అవ‌స‌రం లేకుండా, కూప‌న్ ద్వారానే డేటా

5. యాప్ అవ‌స‌రం లేకుండా, కూప‌న్ ద్వారానే డేటా

మామూలుగా మొబైల్ రీచార్జీల‌కు కూప‌న్లు ఉన్న‌ట్లే డేటాను కూప‌న్ల ద్వారా ఈ సంస్థ అందిస్తోంది. ఈ కూప‌న్ల‌ను బెంగుళూరులోని టీ స్టాళ్లు, స్థానిక బేక‌రీల ద్వారా అంద‌రికీ అందుబాటులో ఉంచుతున్నారు. దీని కోసం ప్ర‌త్యేకంగా ఎటువంటి యాప్ డౌన్‌లోడ్ అక్క‌ర్లేదు. మొబైల్ నంబ‌ర్ ఓటీపీ వెరిఫికేష‌న్ ద్వారా డేటా యూజ‌ర్ మొబైల్లోకి వ‌స్తుంది. అంతే ఇంట‌ర్నెట్ క‌నెక్ట్ చేసుకుని ప‌రిమితి వర‌కూ వాడుకోవ‌చ్చు. ఏదైనా హోట‌ళ్లో డేటా వాడుకోవాలన్నా ఇదే విధాన‌మే. అక్క‌డ వైఫై డ‌బ్బా నెట్‌వ‌ర్క్ అనుసంధాన‌త ఉండాలి, బ్రౌజ‌ర్ తెర‌వ‌గ‌లిగితే చాలంతే.

6. వైఫై డ‌బ్బా సాంకేతిక ల‌క్ష్యం

6. వైఫై డ‌బ్బా సాంకేతిక ల‌క్ష్యం

ఇది ఒక ఇంట‌ర్నెట్ స‌ర్వీసె ప్రొవైడ‌ర్ లైసెన్స్ క‌లిగి ఉంది. ఫైబర్ ఆప్టిక్స్ సాంకేతిక‌త క‌లిగిన రూట‌ర్ల ద్వారా ఇది డేటాను అందిస్తోంది. షాప్‌ల దగ్గ‌ర వర‌కూ కేబుల్ ఏర్పాటు ఉండి, అక్కడ నుంచి రూట‌ర్ ద్వారా యూజ‌ర్‌కు డేటాను చేర‌వేయ‌డం జ‌రుగుతుంది. మంచి వేగ‌వంత‌మైన డేటాను త‌క్కువ ధ‌ర‌ల‌కు అందించ‌డం ఈ స్టార్ట‌ప్ ధ్యేయంగా చెబుతున్నారు. ట‌వ‌ర్ల నుంచి వ‌చ్చే త‌రంగాల మీద ఆధార‌ప‌డే బ‌దులు ఫైబ‌ర్ ఆప్టిక్స్ ద్వారా డేటాను అందించ‌డం వ‌ల్ల వేగ‌వంత‌మైన డేటా సాధ్య‌ప‌డుతుంది.

 7. ఆన్లైన్లో డ‌బ్బు చెల్లించొచ్చు

7. ఆన్లైన్లో డ‌బ్బు చెల్లించొచ్చు

కేవ‌లం నిర్ణీత ప్ర‌దేశాల్లో ఉన్న డ‌బ్బాల ద్వారా కాకుండా వేరే విధంగా కూడా వీరు డేటాను అందిస్తున్నారు. ఆ వెబ్సైట్లో ఉన్న స‌దుపాయం ద్వారా ఆన్‌లైన్ మార్గంలో డ‌బ్బు చెల్లించి మీకు కావాల్సిన డేటా ప‌రిమితిని, వాలిడిటీని ఎంచుకోవ‌చ్చు. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లే. సాధార‌ణంగా యూజ‌ర్లు నెల‌కు రూ.300 కంటే డేటా వాడే ఎక్కువ అవ‌స‌రం రాదు క‌నుక త‌మ‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు డేటా కొనుగోలు చేయొచ్చ‌ని శ‌ర్మ వివ‌రించారు.

 8. త‌క్కువ దూరంలో కేబుల్ డేటా బెట‌ర్

8. త‌క్కువ దూరంలో కేబుల్ డేటా బెట‌ర్

ఫైబ‌ర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా డేటా వేగంగా ప్ర‌సార‌మ‌వుతుంది. మామూలుగా ట‌వ‌ర్ల నుంచి అయితే డేటా వేగంలో మార్పులుండొచ్చు. సెల్ ట‌వ‌ర్ల‌తో పోలిస్తే క‌చ్చిత‌మైన వేగం ఈ మార్గంలో సాధ్య‌మ‌వుతుంది. అయితే దూరాన్ని బ‌ట్టి డేటా వేగం మారుతుంది. 100 నుంచి 200 మీట‌ర్ల దూరంలో మేము 50 ఎంబీపీఎస్ డేటా వేగాన్ని అందించ‌గ‌లుగుతామ‌ని శ‌ర్మ చెప్పారు.

 9. బెంగుళూరు న‌గ‌రంలో ఇలా...

9. బెంగుళూరు న‌గ‌రంలో ఇలా...

''మా కంపెనీ బెంగుళూరు న‌గ‌ర వ్యాప్తంగా దాదాపు 350 రూట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఇంకా 1800 క‌నెక్ష‌న్ల‌ను అందించాల్సిందిగా అభ్య‌ర్థ‌న‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఫైబ‌ర్ నిర్వ‌హ‌ణ చాలా ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. స్థానిక అవ‌స‌రాల‌ను బ‌ట్టి మార్పులు చేయాలి. అయిన‌ప్ప‌టికీ గాలి త‌రంగాల‌తో పోలిస్తే కేబుల్ ద్వారా అందించే డేటా కాస్త ఎక్కువ నాణ్య‌త‌తో కూడుకుని వేగంగా ఉంటుంది. ప్ర‌స్తుతానికి క‌నెక్ష‌న్ ఇచ్చేందుకు 6 నుంచి 7 రోజులు ప‌డుతోంది. దీన్ని 3 నుంచి 4 రోజుల‌కు త‌గ్గించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.'' అని వైఫై డ‌బ్బా స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు శ‌ర్మ ప్ర‌ణాళిక‌, త‌మ అప్రోచ్ గురించి చెప్పారు.

 10. కంపెనీ ల‌క్ష్యం

10. కంపెనీ ల‌క్ష్యం

డేటా అందించ‌డం అంటే తామే ముందుండేలా కంపెనీ ప్ర‌ణాళిక సాగుతోంది. అయితే త‌మ విస్త‌ర‌ణ ప్రణాళిక‌లో ఎక్క‌డ ఎదురు లేకుండా సాగుతార‌న్న విశ్వాసం కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుల మాట‌ల్లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం బెంగుళూరులో మొద‌ట ప్రారంభించారు. నిజానికి దేశ‌మంతా విస్త‌రించాల‌నేది ప్ర‌ణాళిక‌. అంతిమంగా వినియోగ‌దారుకు స‌రైన ధ‌ర‌కు మంచి డేటా క‌నెక్ష‌న్ అందించాల‌ని ముందుకు సాగుతున్నారు. ఒక్కో వైఫై డ‌బ్బా ఏర్పాటుకు రూ.4000 ఖ‌ర్చు అవుతుంది. 20 డ‌బ్బాలు పెద్ద కంపెనీల‌కు సంబంధించిన ఒక సెల్ ట‌వ‌ర్తో స‌మాన‌మైన సేవ‌ల‌ను అందిస్తుంది. అయితే పెద్ద కంపెనీలు ఒక టవ‌ర్ ఏర్పాటు, నిర్వ‌హ‌ణ‌కు చేసే ఖ‌ర్చులో కొంత శాతంతోనే మా ప‌ని పూర్త‌వుతోందని శ‌ర్మ చెప్పుకొచ్చారు.

 11. తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ అభిప్రాయం

11. తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ అభిప్రాయం

కంపెనీల మ‌ధ్య పోటీ నెల‌కొన్న‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికీ అన్ని క‌లిసి డేటా ధ‌ర‌ను త‌గ్గ‌కుండా చేశాయి. చాలా దేశాల‌తో పోలిస్తే మ‌న‌కు ఉన్న జ‌నాభా, అందుబాటులో ఉన్న స్పెక్ట్రం ఆధారంగా చౌక ధ‌ర‌కు ల‌భించాల్సిన డేటాను చేతిలో పెట్టుకుని అధిక ధ‌ర‌ల‌తో టెలికాం కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైఫై డ‌బ్బాలు ల‌క్ష వ‌ర‌కూ ఏర్పాటు చేసే ల‌క్ష్యంతో కొత్త స్టార్ట‌ప్ ముందుకు వెళుతోంది. వాడిన డేటాకే డ‌బ్బు చెల్లించ‌డం ఇక్క‌డ దీని ప్ర‌త్యేక‌త‌. మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడే డ‌బ్బు చెల్లించి డేటా వాడుకోవ‌డం దీని ద్వారా సాధ్య‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం వై కాంబినేట‌ర్, మ‌రికొంత మంది ఇన్వెస్ట‌ర్లు ఇందులో పెట్టుబ‌డులు పెట్టారు. దేశ‌మంతా వినియోగ‌దారుల‌కు చౌక ధ‌ర‌ల్లో నాణ్య‌మైన డేటాను అందించాల‌నే త‌ప‌న‌తో ముందుకు వెళుతున్న వైఫై డ‌బ్బా క‌ల‌లు సాకారం కావాల‌ని కోరుకుందాం.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

Read more about: wifi data internet jio reliance jio
English summary

జియోకు స‌వాల్ విసురుతున్న బెంగుళూరు స్టార్ట‌ప్ | WiFi Dabba sells Internet Data in India at 1gb at Rs20 at a Chai wala near you

WiFi Dabba, a Bangalore-based company, appears to be solving a major issue by providing Wi-Fi Hotspots in local areas. The company is setting up Wi-Fi Dabbas across various tea stalls and bakeries to provide a hotspot for the users who come for a quick snack or cutting chai. The company sells Data vouchers starting from Rs. 2 for 100MB data. These vouchers are also available for Rs 10 (500MB), and Rs 20 (1GB) and each of these vouchers are valid for 24 hours.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X