For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెలికాం పోటీలో భాగంగా మార్కెట్లో 2,500/- కన్నా తక్కువలో లభించే 4G ఫీచర్ ఫోన్లు

జియో ఫోన్ లక్ష్యంగా, ఎయిర్టెల్ "కార్బన్ A40", వొడాఫోన్ - మైక్రోమ్యాక్స్ "భారత్ 2 అల్ట్రా", మరియు బిఎస్ఎన్ఎల్ (BSNL) - మైక్రోమ్యాక్స్ "భారత్ 1" ద్వారా ఇంటర్నెట్ ప్రపంచానికి ఇప్పుడున్న ప్రజలను అనుసంధాన

|

రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటివి, భారత్లో చవకైన 4G ఫోన్ల బంధంతో ఉన్నాయి. ఈ అంశంలో భాగంగా - జియో ఫోన్ లక్ష్యంగా, ఎయిర్టెల్ "కార్బన్ A40", వొడాఫోన్ - మైక్రోమ్యాక్స్ "భారత్ 2 అల్ట్రా", మరియు బిఎస్ఎన్ఎల్ (BSNL) - మైక్రోమ్యాక్స్ "భారత్ 1" ద్వారా ఇంటర్నెట్ ప్రపంచానికి ఇప్పుడున్న ప్రజలను అనుసంధానం చేసేందుకు, ఎరవేసి మ‌రీ ప్రయత్నిస్తున్నారు. అలాంటి కొన్ని ఫోన్ల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ నుంచి

బీఎస్ఎన్ఎల్ నుంచి

జియో ఫోన్ మరియు బిఎస్ఎన్ఎల్ (BSNL) మొబైల్ 4G ఎనేబుల్ ఫీచర్లతో ఫోన్లు కాగా, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ మొబైల్స్ మాత్రం స్మార్ట్ఫోన్లు. బిఎస్ఎన్ఎల్ (BSNL) - మైక్రోమ్యాక్స్ పరికరం చౌక అయిన డేటా ఆఫర్లను, జియో ఫోన్ మరియు వొడాఫోన్ మొబైల్స్ పై కొంత మొత్తాన్ని వాపసు ఇస్తామని ప్రామిస్ను కలిగి ఉంది మరియు ఎయిర్టెల్ దాని మొబైల్లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఇటీవలే ఎయిర్టెల్ సెల్కాన్‌తో కలిసి మరో స్మార్ట్‌ఫోన్ త‌యారీ గురించి ప్రకటించింది.

జియో ఫోన్ ధ‌ర రూ.1500, మ‌ళ్లీ రీఫండ్‌

జియో ఫోన్ ధ‌ర రూ.1500, మ‌ళ్లీ రీఫండ్‌

బిఎస్ఎన్ఎల్ "భారత్ 1" ధర - రూ.2200/- గా ఉంది. రిలయన్స్ జియో ఫోన్ ధర రూ. 0 గా ఉంది. జియో మొబైల్ కొనుగోలుదారులు 1,500 రూపాయలు చెల్లించాల్సి ఉంది మరియు 3 సంవత్సరాల కాలంలో వారు పూర్తి మొత్తాన్ని వాపసును పొందుతారు. బుకింగ్ సమయంలో మొత్తం రూ.500/- మరియు డెలివరీ సమయంలో రూపాయలు 1,000/- గా విభజించబడింది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ఎయిర్టెల్ యొక్క "కార్బన్ A40" ఫోన్ 1,399/- రూపాయల సమర్థవంతమైన ధరను కలిగి ఉంది. అయితే వినియోగదారులు ప్రారంభంలో 2,899/- రూపాయలు చెల్లించాలి. రానున్న మూడు సంవత్సరాలలో వినియోగదారులకు రూ .1,500/- వరకు కాష్‌బ్యాక్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

సెల్ కాన్-వోడాఫోన్ ఒప్పందం

సెల్ కాన్-వోడాఫోన్ ఒప్పందం

సెల్‌కాన్‌ ఫోన్ విషయంలో, మీరు ప్రారంభంలో 2,849 రూపాయలు చెల్లించాలి మరియు 3 సంవత్సరాల తరువాత 1,500 రూపాయలను తిరిగి మీరు రీఫండ్ ను పొందుతారు. వోడాఫోన్ "భారత్ 2 ఆల్ట్రా"ను కొనుగోలు చేయడానికి, దాని ధర రూ .999/- గా ఉంది. మొదట్లో మీరు 2,899/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మీరు 18 నెలల తర్వాత రు .900/- మొత్తాన్ని మరియు 3 సంవత్సరాల తర్వాత రూ .1,000/- ల వాపసును పొందుతారు.

 భార‌త్1 పేరుతో మార్కెట్లోకి

భార‌త్1 పేరుతో మార్కెట్లోకి

ప్రస్తుత మార్కెట్లో "ఎయిర్టెల్, జియో ఫోన్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్" మొబైళ్ళ లభ్యత: బిఎస్ఎన్ఎల్ - మైక్రోమ్యాక్స్ "భారత్ 1" ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఇంతలో, రిలయన్స్ జియో అప్పటికే ఒక రౌండ్ బుకింగ్లను పూర్తి చేసింది, దాని కోసం దేశవ్యాప్తంగా మొబైళ్ళను, పంపిణీ చేయబడింది. దాని రెండవ రౌండ్ డెలివరీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సంస్థ వెల్లడించలేదు. అయితే, నివేదికలు మాత్రం కొన్ని వారాలలోనే ప్రారంభమవుతుంది సూచించాయి. ఇక ఎయిర్టెల్ మొబైల్కు వచ్చినప్పుడు, "కార్బన్ A40" ఫోన్లు మరియు సెల్కాన్ స్మార్ట్ఫోన్లు దేశంలో అత్యధిక రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి.

భార‌త్1 ఫోన్ ప్ర‌యోజ‌నాలు

భార‌త్1 ఫోన్ ప్ర‌యోజ‌నాలు

ఎయిర్టెల్, జియో ఫోన్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఫోన్ల - రీఛార్జ్ & డేటా ప్లాన్స్: బిఎస్ఎన్ఎల్ - మైక్రోమ్యాక్స్ "భారత్ 1" ఫోన్ కోసం మీరు అపరిమితంగా వాయిస్ కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలను పొందడానికి నెలకు రూ. 97/- తో రీఛార్జి చేయాలి. వినియోగదారులు ఇతర నెట్వర్క్ల నుండి కూడా సిమ్ కార్డులను ఉపయోగించవచ్చు.

జియో ఫోన్ సంబంధిత వివ‌రాలు

జియో ఫోన్ సంబంధిత వివ‌రాలు

జియో ఫోన్ వినియోగదారులకు రూ. 153/- నెలవారీ ప్యాకేజీతో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. వినియోగదారులకు రోజుకు 500MB డేటాను, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ఎస్ఎమ్ఎస్ ఫీచర్లు అందిస్తుంది. రూ. 54 మరియు రూ. 24 సాకేట్ ప్యాక్ లు ఉన్నాయి.

ఎయిర్టెల్ - కార్బ‌న్

ఎయిర్టెల్ - కార్బ‌న్

కార్బన్ A40 భారతీయ వినియోగదారులకు రూ .169/- ప్లాన్ లభిస్తుంది. ఎయిర్టెల్ దాని నెట్వర్క్ వినియోగంలో ఉన్నవారికి 500MB డేటాను అందిస్తుంది. మీరు ఈ ఫోన్లో ఇతర సిమ్ కార్డులను ఉపయోగించినప్పుడు, మీకు రూ. 1,500/- క్యాష్బ్యాక్ను గాని పొందాలనుకుంటే ఎయిర్టెల్ నెట్వర్క్ని పొందాలి. రీఛార్జ్ ప్యాక్ మరియు వాపసు కోసం అవసరాలు ఎయిర్టెల్ సెల్కాన్ స్మార్ట్ఫోన్లో ఒకే విధంగా ఉన్నాయి.

ఎయిర్టెల్ సెల్కాన్ మొబైల్ స్పెసిఫికేషన్స్ :

ఎయిర్టెల్ సెల్కాన్ మొబైల్ స్పెసిఫికేషన్స్ :

ఈ ఫోన్లో 4 అంగుళాల డిస్ప్లే WVGA (480x800 పిక్సల్స్), డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్లు మరియు 8GB ఇంటర్నల్ మెమొరీ ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లౌ స్మార్ట్ఫోన్, గూగుల్ ప్లే స్టోర్లోని అందుబాటులో ఉండే అన్ని యాప్స్ తో పాటు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు వాట్స్అప్ వంటి వాటి సపోర్ట్ను కూడా కలిగి ఉంది. ఇది ఒక 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్, ఫ్లాష్ తో 3.2MP వెనక కెమెరా, 2MP తో ముందు కెమెరాను కలిగి ఉంది.

బిఎస్ఎన్ఎల్ భారత్ 1 స్పెసిఫికేషన్స్:

బిఎస్ఎన్ఎల్ భారత్ 1 స్పెసిఫికేషన్స్:

బిఎస్ఎన్ఎల్ - మైక్రోమ్యాక్స్ "భారత్ 1" 4G ఫీచర్ ఫోన్ 2.4-అంగుళాల డిస్ప్లేతో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను కలిగి ఉంది అలాగే 512MB ర్యామ్, 4GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. భారత్-1 ఫోన్ డబల్ సిమ్ స్లాట్లను కలిగి ఉంది మరియు 2,000 mAh బ్యాటరీ కెపాసిటీ ని కలిగి ఉంది. కెమెరా పరంగా, 2 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను మరియు ముందు వైపు ఒక VGA కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్కు 22 రకాల వివిధ భారతీయ భాషలకు సపోర్ట్ను కలిగి ఉంది. భారత్-1 పరికరంలో, వినియోగదారులు ముందే లోడ్ చేయబడిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) మొబైల్ యాప్ ను పొందుగలరు.

వోడాఫోన్

వోడాఫోన్ "భారత్-2 అల్ట్రా" స్పెసిఫికేషన్స్ :

మైక్రోమ్యాక్స్ "భారత్ -2 అల్ట్రా" 4-అంగుళాల WVGA డిస్ప్లే (480x800 పిక్సెల్స్) మరియు ఆండ్రాయిడ్ మార్ష్మల్లౌ ఆపరేటింగ్ సిస్టమ్ను కలిగి ఉంది. హ్యాండ్సెట్ను 512MB ర్యామ్తో, 1.3GHz క్వాడ్-కోర్ స్ప్రెడ్ట్రమ్ SC9832 ప్రాసెసర్తో పాటు, 4GB ఇంటర్నల్ మెమరీను కలిగి ఉంది. వెనుక 2 మెగాపిక్సెల్ కెమెరా మరియు ఫ్రంట్ VGA కెమెరా, మరియు సీన్, ఫ్రేం, బరస్ట్ వంటి కెమెరా మోడ్లను కలిగి ఉంటుంది. మైక్రోమ్యాక్స్ భారత్ -2 అల్ట్రా 1300mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది.

ఎయిర్టెల్

ఎయిర్టెల్ "కార్బన్ A40" స్పెసిఫికేషన్స్ :

"కార్బన్ A40" మొబైల్, డ్యూయల్ సిమ్ స్లాట్కు మద్దతు ఇచ్చే 4G స్మార్ట్ఫోన్. ఇది ఎయిర్టెల్ యొక్క మై ఎయిర్టెల్ (MyAirtel), ఎయిర్టెల్ టీవీ, మరియు Wynk సంగీతం వంటి యాప్లను ముందుగానే లోడ్ చేయబడి ఉంది. ఇది 1GB ర్యామ్ మరియు 8GB ROM తో 1.3 GHz ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉండి, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 32 జీబి వరకూ పొడిగించుకోవచ్చు. ఇది ఒక 1,400 mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది. ఇది 2MP వెనుక కెమెరాను మరియు 0.3MP ముందు కెమెరా షూటర్ తో ఉంది.

జియో ఫోన్ స్పెసిఫికేషన్స్ :

జియో ఫోన్ స్పెసిఫికేషన్స్ :

జియో ఫోన్ ఒక 2.4-అంగుళాల QVGA ప్రదర్శన (320 x 240 పిక్సెల్స్) కలిగి ఉంది. ఇది ఒక డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఇది స్పైడ్రిట్ 9820A లేదా క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 210. ఇది ఫోన్లో 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ మెమరీను కలిగి ఉంది.

మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 128GB వరకూ పొడిగించుకోవడం కోసం ఒక ప్రత్యేక స్లాట్ ఉంది. ఈ ఫోన్కు ముందు VGA కెమెరా ఉంది.

Read more about: jio phone bsnl airtel micromax carbon
English summary

టెలికాం పోటీలో భాగంగా మార్కెట్లో 2,500/- కన్నా తక్కువలో లభించే 4G ఫీచర్ ఫోన్లు | 4g network competition in the market best 4g phones under 2500 rupees

Reliance Jio, Airtel, Vodafone, and BSNL have jumped on the bandwagon of cheap 4G phones in India. Targetting this segment Jio Phone, Airtel Karbonn A40, Vodafone Micromax Bharat 2 Ultra, and BSNL Micromax Bharat 1 are trying to lure in the people who are still not connected to the world of internet.
Story first published: Saturday, November 4, 2017, 12:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X