For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 కంపెనీల‌కు ఒక్కో ఉద్యోగి మీద కోట్ల‌లో ఆదాయం వ‌స్తుంద‌ని మీకు తెలుసా?

ఈ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు కూడా భారీ మొత్తంలోనే జీతాలుంటాయి. అది అటుంచితే అస‌లు ఒక్కో ఉద్యోగి వ‌ల్ల కంపెనీకి ఎంత లాభ‌ముంటుంది. ఒక్కో ఉద్యోగి త‌ను ప‌నిచేసే సంస్థ‌కు ఎంత సంపాదించి పెడుతున్నారంటా

|

ఐటీ సంస్థ‌లు ఆదాయ‌ప‌రంగా మంచి వృద్దిని క‌న‌బ‌రుస్తున్నాయి. స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, ప‌రిశోధ‌నాభివృద్ధిలో పెట్టుబడులు, సంస్థ‌ల మ‌ధ్య పోటీత‌త్వం పెరిగిపోయింది. అందుకనుగుణంగానే సంస్థ‌ను లాభాల బాట ప‌ట్టించే విష‌యంలో సీరియ‌స్‌గా ఉంటున్నాయి. ఎక్కువ ఆదాయం వ‌చ్చేలా కృషి చేస్తున్నాయి. ఈ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు కూడా భారీ మొత్తంలోనే జీతాలుంటాయి. అది అటుంచితే అస‌లు ఒక్కో ఉద్యోగి వ‌ల్ల కంపెనీకి ఎంత లాభ‌ముంటుంది. ఒక్కో ఉద్యోగి త‌ను ప‌నిచేసే సంస్థ‌కు ఎంత సంపాదించి పెడుతున్నారంటారు. ఈ లెక్క‌లు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం మీ వంత‌వుతుంది. ఓ స్వ‌చ్ఛంద సంస్థ నిర్వ‌హించిన‌ స‌ర్వే ద్వారా ఈ విష‌యాల‌న్నీ తెలిశాయి.

1. యాపిల్ (రూ.12.3కోట్లు)

1. యాపిల్ (రూ.12.3కోట్లు)

ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన సంస్థ‌గా యాపిల్ పేరొందింది. అంతేకాదు ప్ర‌తి ఉద్యోగి ద్వారా ఎక్కువ‌గా సంపాదించ‌గ‌లిగే సంస్థల్లో నెంబ‌ర్ 1 గా ఉంది. యాపిల్ లో మొత్తం ల‌క్షా 16వేల మంది ప‌నిచేస్తున్నారు. ప్ర‌తి ఉద్యోగి సంస్థ ఆదాయానికి రూ.12.3కోట్లు(1.9 బిలియ‌న్ డాల‌ర్లు) సంపాదించి పెడుతున్నాడు.

2. ఫేస్‌బుక్ (రూ. 10.4కోట్లు)

2. ఫేస్‌బుక్ (రూ. 10.4కోట్లు)

ప్ర‌ఖ్యాత సామాజిక మాధ్య‌మం ఫేస్‌బుక్ యూజ‌ర్ల సంఖ్య 100 కోట్ల‌ను దాటేసింది. అయినా దీన్ని అతి కొద్ది మంది మాత్ర‌మే న‌డుపుతున్నారు. మొత్తం 20వేల మంది ఫేస్‌బుక్ చ‌క్క‌గా ప‌నిచేసేందుకు కోసం శ్ర‌మిస్తున్నారు. ఒక్కొక్క‌రు కంపెనీకి అక్ష‌రాలా రూ.10.4కోట్లు(1.6 బి.డాల‌ర్లు) సంపాదించి పెడుతున్నారు.

3. అల్ఫాబెట్‌(రూ.8.5కోట్లు)

3. అల్ఫాబెట్‌(రూ.8.5కోట్లు)

గ‌డ‌చిన అయిదేళ్ల కాలంలో అల్ఫాబెట్ ఉద్యోగుల సంఖ్య‌ను దాదాపు రెట్టింపు చేసింది. ప్ర‌తి ఉద్యోగి సంస్థ‌కు ఆదాయం సంపాదించే విష‌యంలో మూడో స్థానంలో ఉంది. మొత్తం 70వేల మంది ప‌నిచేస్తుండ‌గా ఒక్కొక్క‌రి వ‌ల్ల రూ.8.5కోట్లు (1.3 బి. డాల‌ర్లు) ఆదాయం స‌మ‌కూరుతుంది.

4. వెరిసైస్ (రూ. 7.82 కోట్లు)

4. వెరిసైస్ (రూ. 7.82 కోట్లు)

వెరిసైన్ కు ఉన్న ఉద్యోగుల సంఖ్య చెప్తే ఆశ్చ‌ర్య‌పోతారు. కేవ‌లం 1,019 ఉద్యోగుల‌తో సంస్థ బాగానే రెవెన్యూ సంపాదిస్తోంది. అయితే ఇదంతా త‌న డొమైన్ లెవ‌ల్ లో అందించే రిజిస్ట్రేష‌న్ స‌ర్వీసుల వ‌ల్లే సాధ్య‌మ‌వుతోంది. ఈ సంస్థ SSL స‌ర్టిఫికెట్లు సేవ‌లు, DNS,నిర్వ‌హ‌ణ‌, సైబ‌ర్ భ‌ద్ర‌త లాంటి ప‌లు అంశాల‌ల్లో సేవ‌ల‌నందిస్తు ఉంటుంది. ఒక్కో ఉద్యోగి సంస్థ‌కు రూ.7.82కోట్లు(1.2 మిలియ‌న్ డాల‌ర్లు) ఆదాయాన్ని స‌ముపార్జించి పెడుతున్నాడు.

5. వీసా (రూ. 7.17కోట్లు)

5. వీసా (రూ. 7.17కోట్లు)

ఆర్థిక సంస్థ‌లు చెల్లింపుల్లో ఉత్త‌మంగా ఉండేందుకు కార‌ణ‌ముంది. అదేమిటంటే అవి చాలా బాగా సంపాదిస్తాయి. అతి పెద్ద చెల్లింపుల సంస్థ అయిన వీసాలో ప‌నిచేసే ప్ర‌తి ఉద్యోగి రూ.7.17కోట్లు(1.1 మి.డా.) సంస్థ‌కు సంపాదించి పెడుతున్నాడు.

6. మాస్ట‌ర్ కార్డ్ (రూ.5.9కోట్లు)

6. మాస్ట‌ర్ కార్డ్ (రూ.5.9కోట్లు)

వీసా లాంటి సేవ‌ల‌ను అందిస్తోన్న మాస్ట‌ర్ కార్డ్ త‌ర్వాతి స్థానాన్ని ఆక్ర‌మించింది. ప్ర‌తి ఉద్యోగి వ‌ల్ల కంపెనీకి అక్ష‌రాలా రూ.5.9కోట్ల ($ 906,000) లాభం. సంస్థ‌లో మొత్తం 10,300 మంది ప‌నిచేస్తున్నారు.

7. బ్రాడ్‌కామ్ (రూ.5.39కోట్లు)

7. బ్రాడ్‌కామ్ (రూ.5.39కోట్లు)

నెట్‌వ‌ర్క్ సంస్థ అయిన బ్రాడ్‌కామ్ ఏడో స్థానంలో ఉంది. 1991లో ప్రారంభ‌మైన ఈ సంస్థ ప్ర‌తి ఉద్యోగి వ‌ల్ల రూ.5.39కోట్లు($843,000) సంపాదిస్తోంది.

8. లామ్ రీసెర్చ్‌( రూ.5.1కోట్లు)

8. లామ్ రీసెర్చ్‌( రూ.5.1కోట్లు)

జాబితాలో అంత‌గా ప్రాచుర్యం కాని సంస్థ‌లో ఇదే. లామ్ రీసెర్చ్ సెమీకండ‌క్ట‌ర్ వ‌స్తువుల ప్రాసెసింగ్‌ను చేప‌డుతుంది. వీటిని ఐసీ చిప్‌లలో వాడ‌తారు. సంస్థ‌కు 9,100 మంది ఉద్యోగులున్నారు. అయితే ప్ర‌తి ఉద్యోగి రూ.5.1కోట్లు($785,000) సంస్థ‌కు సంపాదించి పెడుతున్నాడు.

9. క్వాల్‌కామ్(రూ.5.03కోట్లు)

9. క్వాల్‌కామ్(రూ.5.03కోట్లు)

సెమీకండ‌క్ట‌ర్‌, టెలికాం సామాగ్రి త‌యారీ సేవ‌ల‌ను క్వాల్‌కామ్ అందిస్తుంటుంది. ఇక్క‌డ మొత్తం 33,500 మంది ప‌నిచేస్తుండ‌గా ఒక్కొక్క‌రి వ‌ల్ల రూ.5.03కోట్ల ($772,000) లాభం.

10. మైక్రోసాఫ్ట్‌(రూ. 4.87కోట్లు)

10. మైక్రోసాఫ్ట్‌(రూ. 4.87కోట్లు)

టాప్ 10లో ప‌దో స్థానంతో మైక్రోసాఫ్ట్ స‌రిపెట్టుకుంది. ఈ జాబితాలో అత్యంత ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న‌ది ఈ సంస్థ‌కే కావ‌డం విశేషం. మొత్తం 1,24,000 మంది ఇందులో ప‌నిచేస్తున్నారు. ఒక్కొక్క‌రు రూ. 4.87కోట్లు($748,000) సంస్థ‌కు సంపాదించి పెడుతున్నారు.

Read more about: companies apple microsoft
English summary

ఈ 10 కంపెనీల‌కు ఒక్కో ఉద్యోగి మీద కోట్ల‌లో ఆదాయం వ‌స్తుంద‌ని మీకు తెలుసా? | How Much Money These Top Companies Make Per Employee

Top tech companies are moneymaking machines — thanks to years of innovation, investments in R&D, and deep moats against the competition, they can earn some serious revenues. And while employees at these companies are well-paid, what’s staggering is how much money these companies can make her employee.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X