For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలో ఈ లాయ‌ర్లు సంపాదించే డ‌బ్బు చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే...

మ‌న దేశంలో ఎంతో శ‌క్తిమంత‌మైన న్యాయ‌వాదులు(లాయ‌ర్లు) ఉన్నారు. వారు ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల త‌ర‌పున వాదించేందుకు తీసుకునే డ‌బ్బు చూస్తే మ‌రే వృత్తిలోనూ ఇంత సంపాదించ‌లేం అనిపిస్తుంది.ఈ విధ‌మైన 10 ఉత్త‌మ ఖ

|

మ‌న దేశంలో ఎంతో శ‌క్తిమంత‌మైన న్యాయ‌వాదులు(లాయ‌ర్లు) ఉన్నారు. వారు ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల త‌ర‌పున వాదించేందుకు తీసుకునే డ‌బ్బు చూస్తే మ‌రే వృత్తిలోనూ ఇంత సంపాదించ‌లేం అనిపిస్తుంది. అది న్యూఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్. ఎలైట్ క్లాస్‌కు చెందిన సీనియర్ అడ్వకేట్లు ఇక్కడే నివసిస్తుంటారు. ఒక్కో హియరింగ్ కు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలు తీసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే అడ్వకేట్లు నివసించే రోడ్డు ఇదే.ఈ విధ‌మైన 10 ఉత్త‌మ ఖ‌రీదైన లాయ‌ర్ల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

1. సొలి సొరాబ్జి

1. సొలి సొరాబ్జి

కొంచెం కోర్టులు, లాయ‌ర్ల గురించి తెలిసిన వారెవ‌రైనా ఈయ‌న పేరు వినే ఉంటారు. దేశంలో అత్యుత్త‌మ లాయ‌ర్‌గా ఈయ‌న పేరు చెబుతుంటారు. భార‌త‌దేశ మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్‌గా సైతం ప‌నిచేశారు. ఈయ‌న‌కు భార‌త రాజ్యాంగం, అంత‌ర్జాతీయ విష‌యాల్లో మంచి ప‌ట్టు ఉంది.

సొలి సొరాబ్జి ఒక్క వాద‌న‌కు రూ.1.25 నుంచి 2 లక్ష‌ల వ‌ర‌కూ ఫీజు రూపంలో తీసుకుంటారు.

2. ఫాలి నారిమ‌న్‌

2. ఫాలి నారిమ‌న్‌

పాలి నారిమ‌న్ సుప్రీంకోర్డు స్థాయి వాటికి ఒక్కో కేసుకు క‌నీసం రూ. 8-15 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తారు. దాదాపుగా హైకోర్టు స్థాయి కేసుల‌ను ఈయ‌న వాదించ‌రు.

దేశంలో ఎంతో ప్రాముఖ్యం సంత‌రించుకున్న గోల‌క్ నాథ్‌, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేష‌న్ వంటి కేసుల‌ను ఈయ‌న వాదించారు. ఒక్కో హియ‌రింగ్‌కు రూ.25 లక్ష‌లు తీసుకునే ఈయ‌న కొన్నింటిలో ఉచితంగా కూడా వాదిస్తారు.

ఈ న్యాయ‌వాద వృత్తిలో 1951 నుంచి ఉన్నారు. ఇండియ‌న్ లా అండ్ జుడిషియ‌రీలో చాలా పేరున్న వ్య‌క్తి ఈయ‌న‌.

3.హ‌రీష్ సాల్వే

3.హ‌రీష్ సాల్వే

దేశంలో ఈ మ‌ధ్య వార్త‌ల్లో మెరిసిన ప్ర‌ముఖ లాయ‌ర్ హ‌రీష్ సాల్వే. క్రికెట్; రాజకీయాలు, ఆర్థిక అంశాలు వంటి అంశాలు ఏవైనా త‌న‌దైన వాద‌నా ప‌టిమ‌ను చూపుతారు.

బేర‌ర్ బాండ్స్ కేసే ఈయ‌న కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. దీని కోసం 1981లో 5 జ‌డ్ఝ్ బెంచ్ ముందు ఈయ‌న వాదించారు. దూర‌ద‌ర్శ‌న్ టెలికాస్ట్ వివాదంలో సైతం ఈయ‌న సుదీర్ఘ కాలం వాద‌న‌లు వినిపించారు. ఎంతో మంది ప్రైవేటు చాన‌ళ్ల త‌ర‌పున వాదించ‌గా ఈయ‌న ఒక్క‌రే దూర‌ద‌ర్శ‌న్ వైపు వాదించి క్రికెట్ టెలికాస్టింగ్ హ‌క్కులు డీడీకి ద‌క్కేలా చేశారు.

ఇంకా వోడాఫోన్ ప‌న్ను వివాదం కేసులో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా, అంబానీ సోద‌రుల గ్యాస్ వివాదం విష‌యంలో సైతం ఈయ‌న ఇంకా వాద‌న‌లు కొన‌సాగిస్తున్నారు.

ఒక్క‌సారి కోర్టులో అడుగు పెడితే రూ.4.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తార‌ని వినికిడి.

4. రాం జెఠ్మలాని

4. రాం జెఠ్మలాని

రాజ‌కీయ వ‌ర్గాల‌కు సంబంధించి ప్ర‌ముఖ లాయ‌ర్ రాం జెఠ్మ‌లాని. ఎప్పుడూ నిర్మ‌లంగా క‌నిపించే ఈయ‌న వ‌య‌సులో చాలా పెద్ద‌వారు. కోర్టులో వాద‌న‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు న‌వ్వుతూ నిదానంగా న‌డుస్తూ వ‌స్తారు. ప్ర‌స్తుతం ప్రాక్టీస్ చేస్తున్న లాయ‌ర్ల‌లో వ‌య‌సులో అతి పెద్ద‌వాడు ఈయనే.

హ‌వాలా స్కాం విష‌యంలో భాజ‌పా నేత ఎల్ కే అద్వానీ వైపు ఈయ‌న వాదించి గెలిచారు.

ఇంకా హ‌ర్ష‌ద్ మెహ‌తా స్టాక్ మార్కెట్ కుంభ‌కోణం, పీవీ న‌రసింహా రావు లంచం కేసులు ఈయ‌న వాదించిన వాటిలో ముఖ్య‌మైన‌వి. ఒక‌సారి కోర్టులో వాదించినందుకు రూ.10 నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కూ చార్జీ చేస్తారు.

ఢిల్లీ హైకోర్టు స్థాయి, సుప్రీంకోర్టు స్థాయి కేసుల‌కు ఈయ‌న తీసుకునే డ‌బ్బు రూ.25 ల‌క్ష‌ల‌కు పై మాటే.

దీంతో దేశంలో అత్య‌ధిక ఖ‌రీదైన లాయ‌ర్‌గా ఈయ‌న‌కు పేరుంది.

5. కేటీఎస్ తుల్సి

5. కేటీఎస్ తుల్సి

టాప్ 10 లాయ‌ర్ల‌లో వినిపించే మ‌రో పేరు కేటీఎస్ తుల్సి.

ఈయ‌న సుప్రీంకోర్టు స్థాయి కేసులు, హైకోర్టు ప్ర‌ధాన కేసులు మాత్ర‌మే వాదిస్తారు.

సుప్రీం స్థాయి కేసులకు రూ.5-7 ల‌క్ష‌లు, ఢిల్లీ హైకోర్టు స్థాయి కేసుల్లో రూ. 8-9 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తారు.

చాలా సార్లు భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున సుప్రీంకోర్టులో వాదించిన అనుభ‌వం ఉంది.

ఒక్కోసారి కోర్టులో అడుగుపెట్టి కేసు వాదించినందుకు గ‌రిష్టంగా వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రూ.5 లక్ష‌లు స‌మర్పించాలి.

6. ముకుల్ రోహ‌త్గి

6. ముకుల్ రోహ‌త్గి

ముకుల్ రోహ‌త్గి దేశ 14వ అటార్నీ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా ప‌నిచేశారు.

సుప్రీంకోర్టులో సీనియ‌ర్ న్యాయ‌వాది ఆయ‌న ముకుల్ ఇంత‌కుముందు దేశ అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా సైతం ప‌నిచేశారు. ముంబ‌యి లా కాలేజీ నుంచి న్యాయ‌వాద విద్య‌ను అభ్య‌సించారు.

గుజ‌రాత్ 2002 అల్ల‌ర్ల కేసులో గుజ‌రాత్ ప్ర‌భుత్వం త‌ర‌పున సుప్రీంకోర్టులో వాదించారు.

అంబానీ సోద‌రుల గ్యాస్ వివాదం కేసులో అనిల్ అంబానీ త‌ర‌పున వాద‌న‌ను వినిపించారు.

ఒక్క‌సారి కోర్టుకు వ‌చ్చి కేసు వాదించినందుకు రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకుంటార‌ని వినికిడి.

 7. అభిషేక్ ఎం సింఘ్వీ

7. అభిషేక్ ఎం సింఘ్వీ

అభిషేక్ సింఘ్వీ వాళ్ల నాన్న ల‌క్ష్మీ మాల్ సింఘ్వీ. అప్ప‌ట్లో దేశంలో పేరున్న లాయ‌ర్‌. భార‌త త‌ర‌పున యూకేలో ఇండియ‌న్ మాజీ హైక‌మీష‌న‌ర్‌గా ప‌నిచేశారు. 1998-2004 మ‌ధ్య భాజ‌పా త‌ర‌పున రాజ్య‌సభ స‌భ్యుడిగా ఉన్నారు.

దానికి భిన్నంగా అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ రాజ్య స‌భ స‌భ్యుడిగా సింఘ్వీ ప‌నిచేశారు. త‌న కార్యాల‌యం సంబంధించిన ఖ‌ర్చుల‌ను చూప‌లేని కార‌ణంగా 2014లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ రూ. 57 కోట్ల ఫైన్ విధించింది.

అభిషేక్ సింఘ్వీ దేశంలో అత్యంత చిన్న వ‌య‌సులోనే అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ప‌ద‌విని చేప‌ట్టారు.

ఢిల్లీ హైకోర్టు స్థాయి కేసుల్లో రూ.9నుంచి 16ల‌క్ష‌లు తీసుకునే ఈయ‌న, సుప్రీంకోర్టు స్థాయి కేసుల్లో 7 నుంచి 12 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఫీజు తీసుకుంటారు.

 8. ఉజ్వ‌ల్ నిక‌మ్‌

8. ఉజ్వ‌ల్ నిక‌మ్‌

దేశ ప్ర‌సిద్ద లాయ‌ర్ల‌లో ఈ రెండు, మూడేళ్ల నుంచి త‌ర‌చూ వినిపిస్తున్న పేరు ఉజ్వ‌ల్ నిక‌మ్‌.

ముంబ‌యి సీరియ‌ల్ బ్లాస్ట్‌ల కేసులో ప్ర‌భుత్వం త‌ర‌పున వాదించి నేరస్థుల‌కు శిక్ష ప‌డేలా చేశారు.

ఈయ‌న వాదించిన కొన్ని ముఖ్య కేసులు ప్ర‌మోద్ మ‌హ‌జ‌న్ మ‌ర్డ‌ర్ కేసు, 2013 ముంబ‌యి సామూహిక అత్యాచార కేసు, గుల్షాన్ కుమార్ మ‌ర్డ‌ర్ కేసు, ఇంకా ఉగ్ర‌వాది అజ్మ‌ల్ క‌స‌బ్ ఉరితీత కేసు.

ఎంతో పేరున్న‌ప్ప‌టికీ ఈయ‌న ఒక‌సారి వాద‌న‌కు వ‌సూలు చేసే ఫీజు రూ.40 వేలు.

9. కే ప‌రాశ‌ర‌న్

9. కే ప‌రాశ‌ర‌న్

ఒక‌ప్పుడు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి అడ్వ‌కేట్ జ‌న‌రల్‌గా ప‌నిచేసిన ఈయ‌న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయంల‌లో భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్గా సైతం చేశారు.

భార‌త ప్ర‌భుత్వం ఈయ‌న కృషికి గాను 2003లో ప‌ద్మ భూష‌ణ్‌; 2011లో ప‌ద్మ విభూష‌ణ్ బిరుదుల‌తో ఆయ‌న్ను స‌త్క‌రించింది. కాంగ్రెస్ త‌ర‌పున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేశారు.

10. కే కే వేణుగోపాల్

10. కే కే వేణుగోపాల్

దేశంలోని 10 అత్యుత్త‌మ లాయ‌ర్ల‌లో వేణుగోపాల్ మ‌రొక‌రు. 1990 మండ‌ల్ క‌మీష‌న్ కేసులో ఈయ‌న వాద‌న‌ల త‌ర్వాత కెరీర్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పు వ‌చ్చింది. మ‌ద్రాస్ క్రిస్టియ‌న్ కాలేజీ నందు న్యాయ‌వాద విద్య‌న‌భ్య‌సించారు. ఈయ‌న తండ్రి ఎమ్‌కే నంబియార్ సైతం అప్ప‌ట్లో పేరెన్నిక‌గ‌న్న లాయ‌ర్ కావ‌డం విశేషం.

ఒక్క‌సారి కోర్టులో అడుగు పెడితే రూ.5 నుంచి రూ.15 లక్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తార‌ని ప్ర‌చారం ఉంది.

Read more about: richest lawyers
English summary

దేశంలో ఈ లాయ‌ర్లు సంపాదించే డ‌బ్బు చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే... | top 10 best lawyers in India who earns lakhs per day

India has some powerful lawyers, who can retrieve seemingly impossible situations in court with their great argumentative skills and persuade a judge to appreciate a point of view that is diametrically opposite his initial understanding.
Story first published: Tuesday, October 24, 2017, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X