For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు కొత్త కార్ల‌ను లాంచ్ చేసిన ఆడి ఇండియా

కొత్త మోడ‌ళ్ల ఏ5 స్పోర్ట్ బ్యాక్‌, ఏ5 క్యాబ్రియోలెట్,ఎస్‌5 స్పోర్ట్ బ్యాక్ ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.54.02 ల‌క్ష‌లు, రూ.67.15 ల‌క్ష‌లు, రూ.70.60 ల‌క్ష‌లుగా ఉన్నాయి

|

జ‌ర్మ‌న్ ఆటో దిగ్గ‌జం ఆడి గురువారం రోజు మూడు కొత్త కార్లను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్టింది. కొత్త మోడ‌ళ్ల ఏ5 స్పోర్ట్ బ్యాక్‌, ఏ5 క్యాబ్రియోలెట్,ఎస్‌5 స్పోర్ట్ బ్యాక్ ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.54.02 ల‌క్ష‌లు, రూ.67.15 ల‌క్ష‌లు, రూ.70.60 ల‌క్ష‌లుగా ఉన్నాయి. ఏ5 స్పోర్ట్ బ్యాక్, ఏ5 క్యాబ్రియోలెట్ మోడ‌ళ్లు రెండూ 2 లీట‌ర్ డీజిల్ ఇంజిన్ క‌లిగి ఉండ‌గా, ఎస్‌5 స్పోర్ట్ బ్యాక్ మాత్రం 3 లీట‌ర్ పెట్రోల్ ఇంజిన్‌తో వ‌చ్చింది. కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన మూడు మోడ‌ళ్ల‌తో ఆడి ఇండియా ఈ ఏడాదికి నిర్ణ‌యించుకున్న 10 కొత్త మోడ‌ళ్ల ల‌క్ష్యాన్ని చేరుకున్న‌ట్ల‌యింద‌ని ఆడి ఇండియా అధిప‌తి రాహిల్ అన్సారి వెల్ల‌డించారు.
" ఆడి ఏ5 రేంజ్ కార్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో త‌మ ఉత్ప‌త్తుల్లో వైవిధ్య‌త బ‌ల‌ప‌డింద‌న్నారు. దేశంలో కొత్త ర‌కాల కార్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ ల‌గ్జ‌రీ కార్ల విష‌యంలో ఉత్త‌మ‌మైన వాటిని అందిస్తుంటాం." అని కార్ల లాంచ్ సంద‌ర్భంగా అన్సారి చెప్పారు.

 కొత్త మోడ‌ళ్ల కార్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆడి

కొత్త ఆడి ఏ5 యువ‌త‌ను ఆక‌ట్టుకునే విధంగా త‌యారు చేశార‌ని ఆయన వివ‌రించారు. ఆడి గ‌త రెండేళ్ల‌గా అమ్మ‌కాల విష‌యంలో వెనుక‌ప‌డుతూ, అంత‌కుముదు నం.1 స్థానంలో ఉన్న ఆ సంస్థ గ‌తేడాది 3వ స్థానానికి ప‌డిపోయింది.
ఈ విలాస‌వంత‌మైన కార్ల త‌యారీ సంస్థ 2012 నుంచి 2014 మ‌ధ్య సేల్స్ విష‌యంలో ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. అయితే 2015లో మెర్సిడెస్ మొద‌టి స్థానానికి దూసుకెళ్ల‌డంతో ఆడి ప్ర‌భ త‌గ్గింది. మ‌రో వైపు జ‌ర్మ‌నీ కార్ల త‌యారీ సంస్థ బీఎండ‌బ్ల్యూ ఆడిని మూడో స్థానానికి నెట్టి రెండో స్థానాన్ని ఆక్ర‌మించింది.

Read more about: audi cars
English summary

మూడు కొత్త కార్ల‌ను లాంచ్ చేసిన ఆడి ఇండియా | Audi India launched three new models to attract youth

Audi, which has stopped reporting its annual sales numbers since 2015 when it had sold 11,192 units, has not yet shared the same for 2016 and 2017.
Story first published: Thursday, October 5, 2017, 17:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X