For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆచార్య బాల‌కృష్ణ దేశ ధ‌న‌వంతుల జాబితాలోకి ఎలా వెళ్లారు?

ఆదివారం, ఇత‌ర సెల‌వు రోజుల్లో సైతం విశ్రాంతి తీసుకోకుండా ప‌నిచేస్తారు. నేను ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా ప‌నిచేస్తాన‌ని చెబుతారాయ‌న‌. ప్ర‌తి రోజూ పొద్దున 7 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌రకూ ప‌నిచ

|

దేశ ధ‌న‌వంతుల జాబితాలోకి కొత్త‌గా బిలియ‌నీర్ బాల‌కృష్ణ వ‌చ్చారు. ఈయ‌న ఎవ‌రంటే ప‌తంజ‌లి ఆయుర్వేద్ సంస్థ‌కు సీఈవో. హురూన్ ఇండియా 2017 ధ‌న‌వంతుల జాబితాలో ఈయ‌న 8వ స్థానం సంపాదించాడు. గ‌తేడాది 94% ప‌తంజ‌లి వాటాను క‌లిగి ఉన్న ఈయ‌న గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకుందాం.

1. రూ.70 వేల కోట్ల సంప‌ద‌

1. రూ.70 వేల కోట్ల సంప‌ద‌

44 ఏళ్ల బాల‌కృష్ణ గ‌తేడాది ఉన్న 25వ స్థానం నుంచి ఈ ఏడాది 8వ స్థానానికి ఎగ‌బాకారు. ఆయ‌న సంప‌ద ఒక్క సంవ‌త్స‌రంలోనే 173% పెరిగి రూ.70 వేల కోట్ల‌కు చేరింది.

 2. ఫోర్బ్స్ మ్యాగ‌జెన్‌కు ఎక్కారు

2. ఫోర్బ్స్ మ్యాగ‌జెన్‌కు ఎక్కారు

మార్చి నెల‌లో సైతం ఫోర్బ్స్ జాబితాలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 814 వ స్థానం ద‌క్కించుకున్నారు. ఈ నివేదిక‌లో మ్యాగ‌జైన్ మొత్తం 2043 మంది వివ‌రాల‌ను తీసుకుంది. గ‌తేడాది ఫోర్బ్స్ స్థానం సాధించిన ఈయన ఫోర్బ్స్ 100 ధ‌న‌వంతుల జాబితాలో 48వ స్థానంలో నిలిచారు. అప్ప‌టికి ఆయ‌న సంప‌ద 2.5 బిలియ‌న్ డాల‌ర్లు.

3. ఎఫ్ఎంసీజీ కంపెనీల‌కు పోటీగా

3. ఎఫ్ఎంసీజీ కంపెనీల‌కు పోటీగా

ప‌తంజ‌లి ట‌ర్నోవ‌ర్ 2017లో రూ. 10,561 కోట్లు. ప్ర‌పంచంలో పేరెన్నిక‌గ‌న్న ఎఫ్ఎంసీజీ కంపెనీల‌కు ప‌తంజ‌లి గ‌ట్టి పోటీనిస్తోంది. ప్ర‌స్తుతం భార‌త్‌లో రెండో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ‌గా ఉంటూ దిగ్గ‌జాల‌కు వ‌ణుకు పుట్టిస్తోంది. 2016లో హెచ్‌యూఎల్ ట‌ర్నోవ‌ర్ రూ.30,783 కోట్ల వ‌ర‌కూ ఉంది. మొత్తానికి దేశీయ వ‌స్తు సేవ‌ల సంస్థ ఏడాది కాలంలో రెవెన్యూను రెండింత‌లు చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

4. రెండింత‌ల రెవెన్యూ దిశ‌గా

4. రెండింత‌ల రెవెన్యూ దిశ‌గా

ప‌తంజ‌లి రెవెన్యూ రెండింత‌లు అయితే హెచ్‌యూఎల్ ట‌ర్నోవ‌ర్‌కు అతి స‌మీపానికి వెళ్లే అవ‌కాశం ఉంది. ఇదంతా ఎలా సాధ్య‌మంటే ప‌తంజ‌లి ఉద్యోగులు చెప్పే మాట ఏంటంటే అదంతా బాల‌కృష్ణ వ‌ల్లే. స్వ‌ల్ప కాలంలో అంత సులువుగా బిలియ‌నీరేం కాలేదు ఆయ‌న‌. ఒక‌సారి ఆయ‌న జీవ‌న శైలి, క‌ష్ట‌ప‌డే త‌త్వం గురించి తెలిసిన వారెవ‌రైనా ఆయ‌న విజయాన్ని ఒప్పుకుంటారు.

5.ప‌ని చేసే స‌ర‌ళి

5.ప‌ని చేసే స‌ర‌ళి

బాగా రాందేవ్‌కు న‌మ్మిన బంటుగా ఉన్న బాల‌కృష్ణ ప‌తంజ‌లి ఆయువ‌ర్వేద్‌లో దాదాపు 94% వాటా క‌లిగి ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎటువంటి వేత‌నం తీసుకోరు. రోజుకు 15 గంట‌ల పాటు ప‌నిచేస్తారు. ఆదివారం, ఇత‌ర సెల‌వు రోజుల్లో సైతం విశ్రాంతి తీసుకోకుండా ప‌నిచేస్తారు. 'నేను ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా ప‌నిచేస్తాన‌ని చెబుతారాయ‌న‌. ప్ర‌తి రోజూ పొద్దున 7 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌రకూ ప‌నిచేయ‌డం నా విధిగా భావిస్తాను. సాధార‌ణ వ్య‌క్తి రోజుకు 8 గంట‌లు ప‌నిచేస్తే నేనే వారం అంతా ప్ర‌తి రోజూ 15 గంట‌లు ప‌నిచేస్తా. నేనే 5 మంది ప‌నిచేస్తా.' అని బాల‌కృష్ణ చెప్పారు.

6. రుణంతో స్థాపించి రెండో అతిపెద్ద సంస్థ‌గా ఎదిగి

6. రుణంతో స్థాపించి రెండో అతిపెద్ద సంస్థ‌గా ఎదిగి

'10 ఏళ్ల క్రితం వ్య‌క్తిగత రుణం తీసుకుని సంస్థ‌ను ప్రారంభించిన‌ప్పుడు ఇది ఇంత స్థాయికి వ‌స్తుంద‌ని బాల‌కృష్ణ సైతం ఊహించి ఉండ‌రు. నేను మొద‌ట రూ.50-60 కోట్ల వ్య‌క్తిగ‌త రుణం తీసుకున్నా. దానికి ముందు నాకు బ్యాంకు ఖాత సైతం ఉండేది కాద‌'ని బాల‌కృష్ణ చెప్పారు. నేపాల్‌లో జ‌న్మించిన బాల‌కృష్ణ రామ్‌దేవ్ గురుకులంలో చ‌దువుకున్నారు. 1995లో మొద‌టిసారి దివ్యా ఫార్మ‌సీని ప్రారంభించారు. త‌ర్వాత 2006లో బాబాతో క‌లిసి ప‌తంజ‌లికి అంకురార్ప‌ణ చేశారు.

7. ఎన్నో ఆరోప‌ణలు, కేసులు

7. ఎన్నో ఆరోప‌ణలు, కేసులు

2011లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు సీబీఐ బాల‌కృష్ణ పై చీటింగ్ కేసు న‌మ‌దు చేసింది. దాన్నుంచి సులువుగానే బ‌య‌ట‌కు వ‌చ్చారు. రెండేళ్ల క్రితం సీబీఐ కేసులో క్లీన్ చిట్ రావ‌డంతో అప్ప‌టి నుంచి మ‌రింత బ‌లంగా త‌యార‌య్యారు.

8. డిస్ట్రిబ్యూట‌ర్ల సంఖ్య‌ను రెట్టింపు చేసే దిశ‌గా

8. డిస్ట్రిబ్యూట‌ర్ల సంఖ్య‌ను రెట్టింపు చేసే దిశ‌గా

దేశంలోనే ప‌తంజ‌లిని ఎఫ్ఎంసీజీ దిగ్గ‌జంగా చేయాల‌ని బాల‌కృష్ణ నిశ్చ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూట‌ర్ సంఖ్య‌ను రెండింత‌లు చేసి 12 వేల‌కు పెంచుకునేందుకు చూస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.5000 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టేందుకు సైతం సిద్ద‌మవుతున్నారు. త‌ద్వారా కొత్త ప్లాంట్ల‌ను నెల‌కొల్పి ఏడాది కాలంలో ఉత్ప‌త్తిని 5 ఇంత‌లు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేశారు. ఇంతే కాకుండా రెస్టారెంట్ చైన్‌, వ‌స్త్ర త‌యారీలోకి సైతం దూకుడుగా ముందుకెళుతున్నారు.

English summary

ఆచార్య బాల‌కృష్ణ దేశ ధ‌న‌వంతుల జాబితాలోకి ఎలా వెళ్లారు? | Balarkrishna the man behind patanjali became 8th richest in India

: No one had ever thought one could become a billionaire business tycoon by telling people how to do yoga. Acharya Balkrishna, the CEO of yoga guru Baba Ramdev-run FMCG company Patanjali, is the eighth richest Indian, according to the Hurun India Rich List 2017. This year balakrishna rised to 8th position
Story first published: Tuesday, September 26, 2017, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X