For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బంగారు త‌ల్లి ప‌థ‌కం ద్వారా రూ.1 ల‌క్ష ఆర్థిక సాయం

ఆడ పిల్లలు 10 వ తరగతి వరకు చదివిన తరువాత చదువులను కొన‌సాగించేందుకు అంద‌రూ త‌ల్లిదండ్రులు సంసిద్దంగా లేరు. దీంతో ప్ర‌భుత్వం వారి విద్య‌, వివాహంలో తోడుగా ఉండేందుకు బంగారు త‌ల్లి ప‌థ‌కాన్ని ప్రారంభించింద

|

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్త్రీ పురుష నిష్ప‌త్తి ప్రతి 1000 మ‌గ పిల్ల‌ల‌కు 943గా ఉంది.(2011 జ‌నాభా లెక్క‌లు) ఆంధ్ర ప్రదేశ్ లో స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు వల్ల, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడింది. అయితే, ఇటువంటి ఆర్థిక అభివృద్ధి స్త్రీలకు మెరుగుపరచబడిన ఆరోగ్య , పోషణ , విద్య & ఉపాధి అవకాశాలు వంటి సామాజిక వికాసములలో అభివృద్ధి సరిపోయేట్టు చేయలేదు.

మహిళలు లింగ వివక్ష వ్యతిరేకంగా బాల్య వివాహాలు, కట్నం , హింస వంటి సాంఘిక దురాచారాలు, బాలిక కుటుంబానికి భారం అని ఒక భావన వ్యాపించింది. ఆడ పిల్లలు 10 వ తరగతి వరకు చదివిన తరువాత చదువులను కొన‌సాగించేందుకు అంద‌రూ త‌ల్లిదండ్రులు సంసిద్దంగా లేరు. దీంతో ప్ర‌భుత్వం వారి విద్య‌, వివాహంలో తోడుగా ఉండేందుకు బంగారు త‌ల్లి ప‌థ‌కాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్ర‌జ‌ల‌కు ఉండే ప‌లు సందేహాల‌ను తెలుసుకుందాం.

1. బంగారుతల్లి పధకంలో నమోదుకు కావల్సిన అర్హతలు ఏమిటి ?

1. బంగారుతల్లి పధకంలో నమోదుకు కావల్సిన అర్హతలు ఏమిటి ?

"ఇద్దరు జీవించియున్న పిల్లలు" నిభందన లోబడి మే 1, 2013 నాడు లేదా తర్వాత ఆర్ధికంగా వెనకబడిన లేదా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో జన్మించిన ఆడ పిల్ల/లు

ఏదేని తెల్ల రేషన్ కార్డు, అనగా WAP/RAP/TAP/YAP/AAP కార్డులు

ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు. (సమీకృత గిరిజనాభివృద్ది ఏజెన్సీలో ఇంటిలో జరిగే కాన్పులలో జన్మించిన ఆడ శిశువులు కూడ అర్హులు)

తప్పని సరిగా బంగారుతల్లి వెబ్సైటు లో అప్లోడ్ చేయవలసిన కాపీలు (Xerox కాపీలు మాత్రమే)

తెల్ల రేషన్ కార్డు ప్రతి

బంగారు తల్లి జనన ధ్రువ పత్రం ప్రతి

తల్లి/తండ్రి/సంరక్షకుని బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఉన్న పాస్ బుక్ పేజి ప్రతి (ఇదే వరసలో ముందు వారికి లేనపుడే తర్వాత వారిది ఇవ్వాలి)

తల్లి/తండ్రి/సంరక్షకుని (బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఎవరిది ఇస్తే వారి) ఆధార్ కార్డు ప్రతి

తల్లి/తండ్రి/సంరక్షకుని సంతంకంతో ఇచ్చిన "అండర్ టేకింగ్" ప్రతి

వైధ్యాదికారి, ఏ.యెన్.ఏం సంతకంతో ఉన్న "బంగారు తల్లి డేటా ఇన్పుట్ షీట్" ప్రతి

తల్లి బిడ్డ తో దిగిన ఫోటో

 2.

2. "ఇద్దరు జీవించియున్న పిల్లలు" నిబంధ‌న‌న అనగా ఏమిటి ?

కాన్పు సంఖ్యతో సంబంధం లేకుండా మే 1, 2013 తేదికి ముందు జన్మించి మరియు జీవించి ఉన్న ఆడ లేదా మగ శిశువుల సంఖ్య రెండు లేదా ఎక్కువ ఉన్న ఈ పధకానికి అర్హత లేదు.

అనగా మొదటి కాన్పులోనే ఇద్దరు కవలలు జన్మించి జీవించి ఉన్న అర్హత లేదు

అనగా ఎన్ని కాన్పుల సంఖ్యతో సంబంధం లేకండా జీవించి ఉన్న ఆడ లేదా మగ శిశువు ఒక్కరే ఉన్న, తదుపరి ఒకే కాన్పులో ఒక్కరు లేదా కవలలు లేదా అంతకన్నాఎక్కువ ఆడ బిడ్డలు జన్మించిన ఈ పధకానికి అర్హులు.

3. తెల్ల రేషన్ కార్డు ప్రతిని ఏ ప్రాధాన్యత క్రమంలో సమర్పించాలి ?

3. తెల్ల రేషన్ కార్డు ప్రతిని ఏ ప్రాధాన్యత క్రమంలో సమర్పించాలి ?

తల్లి పేరున ఉన్న ఏదైనా రేషన్ కార్డు. తన కుటుంబ తెల్ల రేషన్ కార్డు లేదా తన తల్లి గారి రేషన్ కార్డు లేదా ఉమ్మడిగా ఉన్న అత్తగారి కుటుంబ రేషన్ కార్డు.

తల్లి కి రేషన్ కార్డు లేనపుడు తండ్రి పేరున్న రేషన్ కార్డు

 4. రాష్ట్ర సరిహద్దుల అవతల ఉన్న ఆసుపత్రులలో తీసుకున్న జనన లేదా జన్మ దృవీకరణ పత్రాలకు చెల్లుబాటు ఉందా?

4. రాష్ట్ర సరిహద్దుల అవతల ఉన్న ఆసుపత్రులలో తీసుకున్న జనన లేదా జన్మ దృవీకరణ పత్రాలకు చెల్లుబాటు ఉందా?

ఉంది. వీటిని సంబందిత లేదా నివాస పరిధి మండలంలో తెలుగులోకి తర్జుమా చేసి, వివరాలు సరైనవిగా దృవీకరిస్తూ సంతకం చేసి అప్లోడ్ చేయాలి.

5. పెళ్లి తర్వాత వివిధ కారణాలతో తల్లి పేరు మార్చుకున్న లేదా వివిధ తప్పనిసరిగా జత పరచవలసిన డాకుమెంట్స్ నందు పేరు లేదా ఇంటి పేరు లేదా మొత్తం పేరు మారిన లేదా తప్పుగా నమోదు అయినా అర్హత ఉంటుందా ?

5. పెళ్లి తర్వాత వివిధ కారణాలతో తల్లి పేరు మార్చుకున్న లేదా వివిధ తప్పనిసరిగా జత పరచవలసిన డాకుమెంట్స్ నందు పేరు లేదా ఇంటి పేరు లేదా మొత్తం పేరు మారిన లేదా తప్పుగా నమోదు అయినా అర్హత ఉంటుందా ?

ఉంటుంది. అయితే సంబందిత ప్రతులపై ఆయా కారణాలను నమోదు చేస్తూ, వివరాలు సరైనవే అని ద్రువికరిస్తూ సంతంకం చేసి అప్లోడ్ చేయాలి.

6. బంగారుతల్లి పధకంలో నమోదు ఎప్ప‌టిలోగా చేయాలి?

6. బంగారుతల్లి పధకంలో నమోదు ఎప్ప‌టిలోగా చేయాలి?

ఉంది. బిడ్డ జన్మించిన తర్వాత 21 రోజులలోగా నమోదు చేసుకోవాలి.

ఇలా న‌మోదైన ఆడ పిల్ల‌ల‌కు 21 సంవ‌త్స‌రాలు నిండి జూనియ‌ర్ క‌ళాశాల లేదా స‌మాన‌మైన విద్య పూర్తిచేసిన వారికి రూ.50వేలు, 21 సంవ‌త్స‌రాలు నిండి క‌ళాశాల స్థాయి విద్య పూర్తిచేసిన వారికి రూ.1 ల‌క్ష చెల్లిస్తారు.

7. బంగారుతల్లి పధక నమోదుకు జన్మ దృవీకరణ పత్రాన్ని ఎలా పొందాలి?

7. బంగారుతల్లి పధక నమోదుకు జన్మ దృవీకరణ పత్రాన్ని ఎలా పొందాలి?

వైద్యాధికారి ఆసుపత్రిలో ఇచ్చిన పత్రం

బిడ్డ జననం నివాస ప్రాంత పరిధి దాటి, అమ్మ గారి ఊరిలో ప్రసవించిన లేదా ఏదైనా పట్టణ లేదా నగర ఆసుపత్రిలో ప్రసవించిన, నివాస ప్రాంతంలో ఉన్న పంచాయతి సెక్రటరీ లేదా మునిసిపల్ కమీషనర్ ఇచ్చిన జన్మ దృవీకరణ పత్రం

ప‌థ‌కం ద‌ర‌ఖాస్తు లింక్

8. బంగారు తల్లి పధకంలో నమోదు కొరకు ఎవరిని సంప్రదించాలి?

8. బంగారు తల్లి పధకంలో నమోదు కొరకు ఎవరిని సంప్రదించాలి?

గ్రామంలోని గ్రామ సమాఖ్య లేదా మండలం లోని మండల సమాఖ్య.

పట్టణ ప్రాంతాలలో వాడ సమాఖ్య లేదా పట్టణ సమాఖ్య

9. తల్లి రెండవ పెళ్లి చేసుకున్న, భర్తకు ఇదివరకే పిల్లలున్న ఆమెకు జన్మించిన బిడ్డలు అర్హులేనా?

9. తల్లి రెండవ పెళ్లి చేసుకున్న, భర్తకు ఇదివరకే పిల్లలున్న ఆమెకు జన్మించిన బిడ్డలు అర్హులేనా?

ఆమెకు "ఇద్దరు జీవించియున్న పిల్లలు" నిభందన లోబడి అర్హులే.

10. తల్లి మరణించిన ఆమె బిడ్డలకు అర్హత ఉంటుందా?

10. తల్లి మరణించిన ఆమె బిడ్డలకు అర్హత ఉంటుందా?

ఉంటుంది. తండ్రి లేదా సంరక్షకులు నమోదు చేయవచ్చును. ఏదైనా ట్రస్టులు లేదా స్టేట్ హోం లు సంరక్షకులుగా కూడ వ్యవహరించ వచ్చును.

11. అనర్హులకు వెళ్ళిన ప్రోత్సాహకాన్ని ఎలా తిరిగి చెల్లించాలి?

11. అనర్హులకు వెళ్ళిన ప్రోత్సాహకాన్ని ఎలా తిరిగి చెల్లించాలి?

చలాన ద్వారా దిగువ ఎకౌంటుకు జమ చేయాలి

ఎకౌంటు పేరు : సి.ఈ.వో. సెర్ప్-బంగారు తల్లి

ఎకౌంటు నెంబర్: 62300166260

IFSC కోడు: SBHY0020916

బ్యాంకు : ఎస్.బి.హెచ్., ట్రెజరి బ్రాంచ్, గన్ఫౌండ్రీ , హైదరాబాద్

12. మా ఇంటి మహాలక్ష్మి అనే పేరు మార్చిన ప్ర‌భుత్వం

12. మా ఇంటి మహాలక్ష్మి అనే పేరు మార్చిన ప్ర‌భుత్వం

పేద కుటుంబాల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం ఉద్దేశించిన ‘బంగారు తల్లి' పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈ పథకానికి ‘మా ఇంటి మహాలక్ష్మి' అనే పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఆంద్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడత చెల్లింపులు జరిగాయని, ఈ పథకాన్ని ప్రశంసనీయంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు.

క‌ళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ వంటి ప‌థ‌కాలు ఉన్నాయ‌ని తెలంగాణ‌లో ఈ ప‌థ‌కాన్ని ఆపేశారు.

Read more about: ap girl child welfare
English summary

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బంగారు త‌ల్లి ప‌థ‌కం ద్వారా రూ.1 ల‌క్ష ఆర్థిక సాయం | How to get benefit 1 lakh from Ap government scheme of Bangaru talli

Bangarutalli is meant to take care of the girl child in every household from her birth till she completes her graduation. If she gives birth to a baby girl, Rs 2,500 will be deposited into her account. Rs 1000 will be given for the first 2 years at the time of immunization.Rs 1,500 will be given every year to the family through Anganwadis till the baby attains the age of 5 years from 3rd year onwards.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X