For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్‌1బీ వీసా ప్ర‌క్రియ‌ను పున‌రుద్ద‌రించిన అమెరికా

హెచ్‌1 బీ వీసాల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను అగ్ర‌రాజ్యం అమెరికా పున‌రుద్ద‌రించింది. అప్ప‌ట్లో ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌నే కార‌ణంతో తాత్కాలికంగా ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను నిలిపేశారు.

|

హెచ్‌1-బీ వీసాల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను అగ్ర‌రాజ్యం అమెరికా పున‌రుద్ద‌రించింది. అప్ప‌ట్లో ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌నే కార‌ణంతో తాత్కాలికంగా ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను నిలిపేశారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ సూచించిన ప‌రిమితి మేర‌కు అన్ని కేట‌గిరిల్లోనూ వీసాలు స్వీకరించ‌డాన్ని కొన‌సాగిస్తున్నారు. అమెరికాకు మ‌న దేశం నుంచి ఎక్కువగా వెళ్లే వీసా ద‌ర‌ఖాస్తుల్లో ఐటీ వృత్తి నిపుణులకు సంబంధించిన‌వే అత్య‌ధికంగా ఉంటాయి.

 హెచ్‌1బీ వీసా

హెచ్1బీ వీసా అంటే అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణుల‌ను అక్క‌డికి ర‌ప్పించుకునేందుకు అమెరికా ప్ర‌భుత్వం జారీ చేసే తాత్కాలిక వ‌ర్క్ వీసా. అగ్ర రాజ్యంలోని టెక్నాల‌జీ కంపెనీలు వేల మంది ఉద్యోగుల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఈ వీసాల సాయంతో ర‌ప్పించుకుంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో లెక్క‌కు మించిన డిమాండ్‌తో హెచ్‌1బీ వీసాల్లో ప్రీమియం ప్రాసెసింగ్‌ను ర‌ద్దుచేశారు. ప్ర‌స్తుతం సోమ‌వారం నుంచి అమెరికా పౌర‌స‌త్వాన్ని నిర్దారించే యూఎస్‌సీఐఎస్ హెచ్‌1బీ వీసాల‌ను ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను 2018 ఏడాదికి కొన‌సాగిస్తున్న‌ద‌ని ప్ర‌క‌టించింది. 2018 ఏడాదికి సంబంధించి 65 వేల హెచ్‌1బీ వీసాల ప‌రిమితిని నిర్దారించారు.

Read more about: h1b హెచ్‌1బీ
English summary

హెచ్‌1బీ వీసా ప్ర‌క్రియ‌ను పున‌రుద్ద‌రించిన అమెరికా | US resumes premium processing of H1B visas

US resumes fast processing of H1B work visas in all categories subject to Congress-mandated limit, five months after it was suspended temporarily to handle the huge rush of applications
Story first published: Tuesday, September 19, 2017, 15:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X