For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోనీకి టెన్ స్పోర్ట్స్ అమ్మ‌కాన్ని పూర్తిచేసిన జీ గ్రూప్

రెండు ద‌శ‌ల్లో త‌న స్పోర్ట్స్ బిజినెస్‌, టెన్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌ను సోని పిక్చ‌ర్స్‌కు అమ్మే ప్ర‌క్రియను జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పూర్తిచేసింది. ఈ విధంగా రెండో దశలో 36.32 మిలియ‌న్ యూఎస్ డాలర్ల‌ను ఇటీవ

|

రెండు ద‌శ‌ల్లో త‌న స్పోర్ట్స్ బిజినెస్‌, టెన్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌ను సోని పిక్చ‌ర్స్‌కు అమ్మే ప్ర‌క్రియను జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పూర్తిచేసింది. ఈ విధంగా రెండో దశలో 36.32 మిలియ‌న్ యూఎస్ డాలర్ల‌ను ఇటీవ‌లే అందుకుంది. గ‌తేడాది ఆగ‌స్టు నెల‌లో టెన్‌స్పోర్ట్స్ చాన‌ల్‌ను సోనీ పిక్చ‌ర్స్‌కు విక్రయించ‌నున్న‌ట్లు జీ గ్రూప్ ప్ర‌క‌టించింది. ఈ విలీనం దాదాపు 385 మిలియ‌న్ డాల‌ర్ల న‌గ‌దు ఒప్పందం మేర‌కు జ‌రిగింది.

 సోనీ చేతికి టెన్ స్పోర్ట్స్‌-ప్ర‌క్రియ పూర్తి

36.32 మిలియ‌న్ డాల‌ర్ల‌ను అందుకున్న త‌ర్వాత త‌న టెన్ స్పోర్ట్స్ చాన‌ల్ విక్ర‌యం సోనీతో ముగిసింద‌ని బీఎస్ఈ ఫైలింగ్‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వెల్ల‌డించింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 330 మిలియ‌న్ డాల‌ర్ల‌కు సంబంధించిన న‌గ‌దును జీ గ్రూప్ అందుకుంది. దుబాయికి చెందిన అబ్దుల్ ర‌హ్మ‌న్ తాజ్ గ్రూప్ నుంచి 2006లో టెన్ స్పోర్ట్స్‌ను జీ గ్రూప్ కొన్నది. ఇప్పుడు సోనీ టెన్ స్పోర్ట్స్‌ను కొన‌డంతో టెన్ స్పోర్ట్స్‌కు సంబంధించిన వివిధ చాన‌ళ్లు సోనీ పిక్చ‌ర్స్ సొంతం అయ్యాయి. టెన్ స్పోర్ట్స్ కింద సోనీ టెన్‌1, సోనీ టెన్‌2, సోనీ టెన్‌3,సోనీ టెన్ 1 హెచ్‌డీ, సోనీ టెన్‌2 హెచ్‌డీ, సోనీ టెన్‌3 హెచ్‌డీ, సోనీ టెన్ గోల్ఫ్ హెచ్‌డీ వంటివి వ‌స్తాయి.

English summary

సోనీకి టెన్ స్పోర్ట్స్ అమ్మ‌కాన్ని పూర్తిచేసిన జీ గ్రూప్ | Zee Entertainment completes sale of TEN Sports to Sony

Zee Entertainment Enterprise (ZEEL) today said it has completed two-step sale of its sport business, TEN Sports Network, to Sony Pictures and received USD 36.32 million (about Rs. 232 crore) in the second phase.
Story first published: Monday, September 18, 2017, 15:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X