For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా 50 నుంచి 70 ల‌క్ష‌ల ఉద్యోగాలు

దేశీయంగా డిజిటల్‌ ఎకానమీ ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దీనితో యువతకు 2020 నాటికి 50-70 లక్షల పైచిలుకు ఉద్యోగావకాశాలు లభించగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

|

దేశీయంగా డిజిటల్‌ ఎకానమీ ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దీనితో యువతకు 2020 నాటికి 50-70 లక్షల పైచిలుకు ఉద్యోగావకాశాలు లభించగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. దేశ ప్రజల అభివృద్ధికి టెక్నాలజీ కీలకమని, సాంకేతికత అందని ద్రాక్షలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

 డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ల‌క్ష‌ల ఉద్యోగాలు

ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌తో సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్‌ హర్యానా సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైబర్‌ సెక్యూరిటీ పాలసీని ఆయన స్వాగతించారు. పలు భారతీయ, అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలకు కేంద్రంగా ఉన్న హర్యానాకు.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ తయారీ హబ్‌గా కూడా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.హ‌ర్యానాలో వ‌చ్చే డిజిట‌ల్ విప్ల‌వం ప‌ల్లెల్లో ఆన్‌లైన్ సేవ‌ల‌ను సృష్టిస్తుంద‌ని అన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం చిన్న ప‌ట్ట‌ణాల్లో ఏర్పాటు చేస్తున్న బీపీవోల గురించి చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో చిన్న న‌గ‌రాలు రోహ్‌త‌క్‌, జ‌జ్ఘ‌ర్ వంటి చోట్ల బీపీవో యూనిట్లు నెల‌కొల్ప‌గ‌ల‌మ‌ని భ‌రోసా ఇచ్చారు.

Read more about: digital jobs
English summary

డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా 50 నుంచి 70 ల‌క్ష‌ల ఉద్యోగాలు | digital economy to provide 50-70 lakh jobs by 2020

India's burgeoning digital economy is expected to provide job opportunities to about 50-70 lakh youth in the country by 2020, Electronics and IT Minister Ravi Shankar Prasad said today.
Story first published: Saturday, September 16, 2017, 15:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X