English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఉద్యోగులు ఒక దేశంలో ఆఫీసులో నిద్ర‌, మ‌రో దేశంలో బుక్ రీడింగ్‌

Written By:
Subscribe to GoodReturns Telugu

ఉత్ప‌త్తి ప్ర‌ధాన దేశాల్లో ఉద్యోగులు ప‌నిచేయాలంటే కంపెనీలు ఉద్యోగుల మ‌ధ్య సంబంధాలు మంచిగా ఉండాలి. ఏదో ఆఫీసుకు వ‌చ్చామా, ప‌నిచేసుకుని పోయామా అంటే అక్క‌డ స‌రైన ఉత్పాద‌క‌త‌ను ఆశించ‌లేం. అందుకే భార‌త్ లాంటి వ‌ర్త‌మాన దేశాలు సైతం ప‌ని గంట‌లో వెసులుబాటు క‌ల్పిస్తూ వ‌స్తున్నాయి. అయితే ప‌లు దేశాల‌తో పోలిస్తే ఉద్యోగుల‌కు ఉత్సాహంగా ప‌నిచేసే వాతావ‌ర‌ణాన్ని మ‌న దేశంలో చాలా కంపెనీలు క‌ల్పించే దిశ‌లో వేగంగా ముందుకు సాగడం లేదు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌ను ప‌ని విష‌యంలో ఊరించేలా వివిధ దేశాల చ‌ట్టాలు ఏ విధంగా సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నాయో చూద్దాం.

జపాన్‌లో ఆఫీసులో కొద్ది సేపు నిద్ర‌కు స‌మ‌యం

జపాన్‌లో ఆఫీసులో కొద్ది సేపు నిద్ర‌కు స‌మ‌యం

ప‌ని సామ‌ర్థ్యం మెరుగుప‌రిచేందుకు చాలా కంపెనీలు ఉద్యోగుల‌కు ప‌ని స‌మ‌యంలో కాస్త సాంత్వ‌న కోసం నిద్ర పోయేందుకు అనుమ‌తిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు శ్ర‌మ అనిపిస్తే కాస్త కునుకు తీయొచ్చు. ప‌ని స‌మ‌యంలో నిద్ర‌పోవ‌డాన్ని చాలా దేశాలు ప్ర‌తికూలంగా ప‌రిగ‌ణిస్తుంటే జ‌పాన్ మాత్రం బాగా క‌ష్ట‌ప‌డ్డ వారు కాస్త నిద్ర‌పోతే ఇంకా బాగా ప‌నిచేస్తార‌ని న‌మ్ముతున్న‌ది.

 పోర్చుగ‌ల్ దేశంలో మీ ఉద్యోగం పోదు

పోర్చుగ‌ల్ దేశంలో మీ ఉద్యోగం పోదు

మిన్ను విరిగి మీద ప‌డినా ఆ దేశంలో ఉద్యోగుల‌ను ప‌నిలో నుంచి తీసేయ‌లేరు. ఆ దేశంలో ఉన్న కార్మిక చ‌ట్టాల ప్ర‌కారం, ఉద్యోగిని తొల‌గించే కాలం, నిబంధ‌న‌ల గురించి ఎక్క‌డా పొందుప‌ర‌చ‌లేదు. ఒక‌వేళ ఉద్యోగిని తొల‌గించాలంటే కంపెనీ ఇచ్చే ప‌రిహారంతో సంతృప్తిచెందిన సంద‌ర్భంలో మాత్ర‌మే యాజ‌మాన్యం ఉద్యోగిని సాగ‌నంప‌గ‌లుగుతుంద‌ని స‌మాచారం.

 అక్క‌డ ప్ర‌యాణ స‌మ‌యం సైతం ప‌ని స‌మ‌యంలో భాగ‌మే

అక్క‌డ ప్ర‌యాణ స‌మ‌యం సైతం ప‌ని స‌మ‌యంలో భాగ‌మే

యూరోపియన్ కోర్టు ప్ర‌కారం మీరు రోజులో ఉద్యోగం కోసం చాలా స‌మ‌యం ప్ర‌యాణించినా బాధ‌ప‌డ‌క్క‌ర్లేదు. ఎందుకంటే మీరు ప్ర‌యాణం మొద‌లుపెట్టి ఆఫీసుకు వ‌చ్చు కాలం, త‌ర్వాత ఇంటికెళ్లే కాలం రెండింటినీ రోజు మొత్తంలో ప‌నిగంట‌ల్లో భాగంగానే ప‌రిగ‌ణించాలి. ఉద్యోగుల ఆరోగ్యం, భ‌ద్ర‌త దృష్టిలో పెట్టుకుని యూరోపియ‌న్ వ‌ర్కింగ్ యూనియ‌న్ ఈ విధంగా కృషిచేసింది.

ప‌ని అయిపోయిందా? ఇంటి ద‌గ్గ‌ర ఉంటే కంపెనీ ఈ మెయిల్స్‌తో బాధ ఉండ‌దు

ప‌ని అయిపోయిందా? ఇంటి ద‌గ్గ‌ర ఉంటే కంపెనీ ఈ మెయిల్స్‌తో బాధ ఉండ‌దు

ఆఫీసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డారా? ఇక అంతే ఆ మెయిల్స్తో మీకు సంబంధం లేకుండా ఫ్రెంచి చ‌ట్టాలు ఉన్నాయి. ఉద్యోగి ప్రైవేటు స‌మ‌యం వాటి కోసం వెచ్చించ‌డం అక్క‌డ ఒప్పుకోరు. ఎందుకంటే ప‌ని ప్ర‌దేశానికి(కార్యాల‌యానికి) చెందిన మెయిల్స్ వ‌ల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసు వేళ‌ల త‌ర్వాత మెయిల్స్‌ను క‌ట్ట‌డి చేస్తే ఉద్యోగులు ఒత్తిడి లేకుండా స‌మ‌ర్థంగా ప‌నిచేస్తార‌ని ఇలా చేశారు.

 వేత‌నంతో కూడిన సెల‌వులు- విహార యాత్ర‌ కోసం

వేత‌నంతో కూడిన సెల‌వులు- విహార యాత్ర‌ కోసం

ఆస్ట్రియా దేశంలో విహార యాత్ర కోసం వేత‌నంతో కూడిన సెల‌వుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఉద్యోగుల కోసం మంచి స‌మ‌యాన్ని కేటాయించ‌డంలో ఆస్ట్రియా చాలా ఉదారంగా ఉన్న‌ట్లుంది. దాదాపు సంవ‌త్స‌రానికి 22 రోజులు వేత‌నంతో కూడిన సెల‌వుల‌ను ఉద్యోగులు తీసుకోవ‌చ్చు. 25 ఏళ్ల అనుభ‌వం క‌లిగిన వారు అద‌న‌పు స‌మ‌యం కూడా కోర‌వ‌చ్చు. ఒక‌వేళ అలా కేటాయించిన రోజుల్లో ఉద్యోగి ప‌నిచేస్తే రెండింత‌ల వేత‌నాన్ని కంపెనీలు చెల్లించాలి.

 నెద‌ర్లాండ్స్లో 4 రోజుల ప‌ని, 3 రోజుల సెల‌వులు

నెద‌ర్లాండ్స్లో 4 రోజుల ప‌ని, 3 రోజుల సెల‌వులు

నెద‌ర్లాండ్స్‌లో వీకెండ్ ట్రిప్లు బాగా వేసుకోవ‌చ్చు. ఎందుకంటే అక్క‌డ వారానికి 4 రోజులు ప‌నిచేస్తే వీకెండ్ మూడు రోజుల‌ట‌. ముఖ్యంగా ప‌నిచేసే మ‌హిళా మాతృమూర్తుల‌కు ఇది ప్ర‌త్యేకం. వ‌ర్క్‌-లైఫ్ బ్యాలెన్స్ విష‌యానికి వ‌స్తే డ‌చ్ చ‌ట్టాలు క‌ఠినంగా ఉంటాయి. అందుకే సెల‌వు రోజులు, మెట‌ర్నిటీ, పేట‌ర్నిటీ(తండ్రి) సెల‌వుల‌కు అక్క‌డ ఉద్యోగులు క‌చ్చితంగా స‌రైన విధంగా వాడుకునేలా ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేస్తుంది.

ప‌ని స‌మ‌యంలో చ‌దివేందుకు యూఏఈ చ‌ట్టాలు అనుమ‌తిస్తాయ్

ప‌ని స‌మ‌యంలో చ‌దివేందుకు యూఏఈ చ‌ట్టాలు అనుమ‌తిస్తాయ్

యూఏఈ ''నేష‌న‌ల్ లా ఆఫ్ రీడింగ్'' కొత్త చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌భుత్వోద్యోగులు ప‌ని స‌మ‌యంలో చ‌దివేందుకు ప్రాధాన్య‌త ఇస్తారు. దీంతో వారంలో కొన్ని గంట‌లు ఉద్యోగులు చ‌దివేందుకు ఉప‌యోగించుకుంటార‌ని న‌మ్మిక‌. నిజంగా పుస్త‌కాల ప్రియుల‌కు ఇది వ‌ర‌మే క‌దూ!

Read more about: work, labour laws, working hours, employees
English summary

These work laws from around the world will surprise you

Getting fired from your job is the worst thing that can happen to anyone but not to workers in Portugal as the employers here cannot fire the employees. According to the labor laws in the country, termination period is not defined.
Story first published: Monday, September 11, 2017, 15:33 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns