English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

వీడియోల ద్వారా ల‌క్ష‌ల నుంచి కోట్లు గ‌డిస్తున్న యూట్యూబ్ చాన‌ళ్లు

Written By:
Subscribe to GoodReturns Telugu

తెలుగులో కాస్త టెక్నాల‌జీ తెలిసిన వారు, యూట్యూబ్ త‌రచూ చూసేవారికి యూట్యూబ్ హ‌ర్ష(శ‌బ‌రీష్‌) గురించి తప్ప‌క తెలిసే ఉంటుంది. చేస్తున్న ప‌నిని ఆస్వాదిస్తూ, ఎంద‌రికో కామెడినీ పంచుతూ, ఆఫీసు అల‌స‌ట తీరేలా వీడియోలు రూపొందిస్తున్న తీరు ఎవ‌రినైనా ఆక‌ట్టుకుంటుంది. వీడియోలు స‌ర‌దాగా ఆడుతూ, పాడుతూ తీసినా దాని వెన‌కాల అంకిత భావం, క‌ఠోర శ్ర‌మ ఉంటుంది. అయితే ఇది ఊరికే పోదు. ఈ వైవా హ‌ర్ష యూట్యూబ్ చాన‌ల్‌కు ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. వారు రూపొందించిన వీడియోల‌కు కోట్ల వీక్ష‌ణ‌లు(వ్యూస్‌) వ‌స్తున్నాయి. దానితో పాటే యూట్యూబ్ చాన‌ల్‌కు ఆదాయం వ‌స్తూ ఉంటుంది. అలా ద‌క్షిణ భార‌త‌దేశంలో యూట‌బ్యూబ్ ద్వారా యువ‌తీయువ‌కులు ఆదాయం బాగానే ఆర్జిస్తున్నారు. ఈ కోవ‌లో ఎన్నో యూట్యూబ్ చాన‌ళ్ల గురించి చెప్పుకోవ‌చ్చు. అయితే దక్షిణ భార‌త‌దేశంలో http://www.voxspace.in వారు 2016లో సేక‌రించిన టాప్ యూట్యూబ్ చాన‌ళ్ల జాబితాను ఇక్క‌డ చూద్దాం.

 

 1. మ‌హాత‌ల్లి

1. మ‌హాత‌ల్లి

నిత్య‌జీవితంలో స‌గ‌టు మ‌నిషికి ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌ల ఆధారంగా కొన్ని ఫ‌న్నీ సంద‌ర్భాల‌ను తీసుకుని మ‌హాత‌ల్లి వీడియోల‌ను రూపొందిస్తుంది.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 3,60,360

వీక్ష‌ణ‌లు: 5,37,41,093

చాన‌ల్ ప్రారంభం: మార్చి 11,2016

అంచ‌నా ఆదాయం: రూ.76,58,740

2. చాయ్ బిస్కెట్

2. చాయ్ బిస్కెట్

తెలుగులో ఇప్పుడు బాగా ఆద‌ర‌ణ పొందుతున్న యూట్యూబ్ చాన‌ళ్ల‌లో ఇదీ ఒక‌టి. ప్రారంభ‌మై రెండేళ్ల‌లోనే 1 కోటి వ్యూస్‌ను సంపాదించింది.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 1,69,259

వీక్ష‌ణ‌లు: 1,50,24,199

చాన‌ల్ ప్రారంభం: మార్చి 17,2016

అంచ‌నా ఆదాయం: రూ. 23,48,324

3. ర‌న్‌వే రీల్ (RunWay Reel)

3. ర‌న్‌వే రీల్ (RunWay Reel)

వేర్ టాలెంట్ టేక్స్ ఆఫ్ (where taletn takes off) అనే ట్యాగ్ లైన్ పేరుతో రన్‌వేరీల్ యూట్యూబ్ చాన‌ల్ న‌డుస్తోంది. మీ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించడానికి ఇది ఒక వేదిక‌లాగా ప‌నిచేస్తుంది. ఎక్కువ‌గా షార్ట్ ఫిల్మ్‌తో దీన్ని నిర్వ‌హిస్తున్నారు.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 1,50,245

వీక్ష‌ణ‌లు: 5,49,37,624

చాన‌ల్ ప్రారంభం: ఆగ‌స్టు 26,2011

అంచ‌నా ఆదాయం:రూ. 29,83,054

4. పుట్ చ‌ట్నీ (put chutney)

4. పుట్ చ‌ట్నీ (put chutney)

2015లో ప్రారంభ‌మైన పుట్ చ‌ట్నీ చాన‌ల్ చెన్నై కేంద్రంగా ప‌నిచేస్తుంది. మొద‌ట స్ఫూఫ్ వీడియోల మీద ఎక్కువ‌గా ఆధార‌ప‌డిన ఈ చాన‌ల్ త‌ర్వాత సినిమాలు, మ్యూజిక్‌, ట్రెండింగ్ అంశాల మీద వీడియోల‌ను చేస్తూ ఉంది.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 4,44,401

వీక్ష‌ణ‌లు: 5,09,89,163

చాన‌ల్ ప్రారంభం: ఫిబ్ర‌వ‌రి 19,2015

అంచ‌నా ఆదాయం:రూ. 57,85,924

5. వైవా

5. వైవా

తెలుగులో చాలా మందికి సుప‌రిచిత‌మైన ఇంట‌ర్వూ ఫ‌న్నీ వీడియోలు వైవా యూట్యూబ్ చాన‌ల్ నుంచి వ‌చ్చాయి. వైవా శ‌బ‌రీష్‌ అంటే ఆన్‌లైన్ ప్ర‌పంచంలో తెలియ‌లేనంత‌గా పాపుల‌ర్ అయ్యాడు. షార్ట్ మూవీస్ విష‌యంలో శ‌బ‌రీష్‌ అద‌ర‌గొడ‌తాడు. గ‌తేడాది వైవాతో తెలుగులో బాగా ఫేమ‌స్ అయిపోయాడు. ప్ర‌స్తుతం దానికి సీక్వెల్‌గా ది క‌రెక్ష‌న్ అనే మూవీ వ‌చ్చింది. రిలీజైన ఒక్క రోజులోనే దీనికి 10 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయ‌ట‌.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 4,69,931

వీక్ష‌ణ‌లు: 5,94,36,956

చాన‌ల్ ప్రారంభం: ఏప్రిల్ 7,2010

అంచ‌నా ఆదాయం:రూ. 74,14,258

6. తెలుగువ‌న్‌

6. తెలుగువ‌న్‌

ఏడాది కాలంగా తెలుగువ‌న్ అనే చాన‌ల్ తెలుగు సినిమా కంటెంట్‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో లీడ‌ర్గా ఎదిగింది. అంతే కాకుండా ఫ‌న్ బ‌కెట్ అనే కామెడీ సిరీస్ వీడియోల‌ను సైతం వీరు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇది వినోద ప్ర‌ధాన‌మైన వీడియో సిరీస్‌. దేశంలోనే ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబ్ చాన‌ల్‌గా తెలుగువ‌న్‌కు పేరుంది.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 26,21,063

వీక్ష‌ణ‌లు: 1,59,11,76,143

చాన‌ల్ ప్రారంభం: సెప్టెంబ‌ర్ 9,2006

అంచ‌నా ఆదాయం:రూ. 11,34,49,500

7. తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్

7. తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్

అన్ని ఫిల్మ్ సంబంధిత చాన‌ల్ల‌లానే ఈ యూట్యూబ్ చాన‌ల్ ప్రారంభ‌మై ప్ర‌స్తుతం దాదాపు అన్ని తెలుగు సినిమాలు, ట్ర‌య‌ల‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. వివిధ భాగ‌స్వామ్యాల‌తో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌, ఈవెంట్ క‌వ‌రేజీల‌ను ఇస్తోంది. మిలియ‌న్ డాల‌ర్లు సంపాదిస్తున్న అరుదైన యూట్యూబ్ చాన‌ళ్ల‌లో ఇది ఒక‌టిగా పేరుతెచ్చుకుంది. వార్షిక‌ ఆదాయం 2.4 మిలియ‌న్లు ఉంటుంద‌ని అంచ‌నా.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 25,91,624

వీక్ష‌ణ‌లు: 141,46,82,838

చాన‌ల్ ప్రారంభం: ఫిబ్ర‌వ‌రి 11,2011

అంచ‌నా ఆదాయం:రూ. 16,01,64,000

8. ఐడ్రీమ్‌

8. ఐడ్రీమ్‌

హైద‌రాబాద్ కేంద్రంగా సినిమాల‌ను ఆధారంగా చేసుకుని నిర్వ‌హిస్తున్న మ‌రో యూట్యూబ్ చాన‌ల్ ఐడ్రీమ్‌. ఈ చాన‌ల్‌కు నెల‌కు 4 కోట్ల‌కు పైగా వ్యూస్ వ‌స్తున్నాయి. అంతే కాకుండా త‌న‌దైన శైలిలో సెల‌బ్రిటీల ఇంట‌ర్వూల‌ను ఐడ్రీమ్ నిర్వ‌హిస్తున్న‌ది. ఐడ్రీమ్ పేరిట ఐడ్రీమ్ న్యూస్‌, ఐడ్రీమ్ ఇంట‌ర్వూస్‌, ఐడ్రీమ్ ఫిల్మ్ న‌గ‌ర్ వంటి వివిధ చాన‌ళ్ల‌ను న‌డుపుతున్నారు. ఐడ్రీమ్ తెలుగు మూవీస్ అనే చాన‌ల్‌లో దాదాపు 68 వేల వీడియోలున్నాయి.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 11,54,242(ఐడ్రీమ్ తెలుగు మూవీస్‌)

వీక్ష‌ణ‌లు: 103,07,48,928

చాన‌ల్ ప్రారంభం: జ‌న‌వ‌రి 25,2013

అంచ‌నా ఆదాయం:రూ. 10కోట్ల‌కు పైనే

9. కెన్నీ సెబాస్టియ‌న్

9. కెన్నీ సెబాస్టియ‌న్

బెంగుళూరు, ముంబ‌యి న‌గ‌రాల మ‌ధ్య త‌ర‌చూ తిరుగుతూ ఉండే స్టేజ్ పెర్‌ఫార్మ‌ర్ కెన్నీ సెబాస్టియ‌న్‌. త‌న ప్ర‌తిభ‌తో సొంతంగా వీడియోలో ఆయ‌న క‌నిపిస్తూ డిజిట‌ల్ కంటెంట్‌ను క్రియేట్ చేస్తారు. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌, మ్యూజిసియ‌న్‌, ఫిల్మ్‌మేక‌ర్‌గాను బెంగుళూరు ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా కామెడీని పండించ‌డ‌లో త‌న‌దైన పేరు తెచ్చుకున్నాడు

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 9,31,347

వీక్ష‌ణ‌లు: 8,96,09,193

చాన‌ల్ ప్రారంభం: జూన్ 14,2007

అంచ‌నా ఆదాయం:రూ. 67,80,276

 10. గీకీ రంజిత్‌(geeky ranjit)

10. గీకీ రంజిత్‌(geeky ranjit)

వివిధ సాంకేతిక ఉత్ప‌త్తులు, గాడ్జెట్లు, స్మార్ట్‌ఫోన్లు వంటి వాటికి సంబంధించిన రివ్యూలు ఇచ్చే టెక్నాల‌జీ ఎక్స్‌ప‌ర్ట్ రంజిత్ కుమార్‌. ఆన్‌లైన్ ప్రపంచంలో గీకి రంజిత్‌గా పేరు తెచ్చుకున్నాడు. హైద‌రాబాద్ కేంద్ర‌గా ఇత‌డు ప‌నిచేస్తున్నాడు. బేసిగ్గా ఆయ‌న వృత్తి ప్రొగ్రామ‌ర్ కాగా, త‌ర్వాత‌ర్వాత నెమ్మ‌దిగా టెక్‌రివ్యూవ‌ర్‌, యూట్యూబ‌ర్గా విప‌రీత‌మైన పేరు సంపాదించాడు. టెక్నాల‌జీ ఆధారిత యూట్యూబ్ చాన‌ళ్ల‌లో దేశంలోనే అత్య‌ధిక వీక్ష‌ణ‌లు సాధించిన వాటిలో ఇది ఉంది.

చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు: 5,31,062

వీక్ష‌ణ‌లు: 22,27,67,118

చాన‌ల్ ప్రారంభం: జ‌న‌వ‌రి 6,2011

అంచ‌నా ఆదాయం:రూ. 2,29,16,799

11. యూట్యూబ్ ఆదాయాలు-అంచ‌నాలు-గ‌మ‌నిక‌

11. యూట్యూబ్ ఆదాయాలు-అంచ‌నాలు-గ‌మ‌నిక‌

ఇక్క‌డ ఇచ్చిన యూట్యూబ్ అంచ‌నా ఆదాయాలు బ్రాండ్ వాల్యూ ఆధారంగా ఇచ్చిన‌వి. ఇవి వాస్త‌వం కావాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డ టాప్ చాన‌ళ్ల‌ను ఎంచుకునేట‌ప్పుడు కొన్ని ప్రామాణికాల‌ను తీసుకున్నారు. కొన్ని కార‌ణాల రీత్యా వాటిని ఇక్క‌డ వెల్ల‌డించ‌డం లేదు. అంతే కాకుండా ఈటీవీ, టీవీ9, మాటీవీ, ఆడియో జూక్ బాక్స్ త‌ర‌హా చాన‌ళ్ల‌ను ప్ర‌త్యేక యూట్యూబ్ చాన‌ళ్ల జాబితాలో ప‌రిగ‌ణించ‌లేదు. అంతేకాకుండా అక్టోబ‌ర్ 19,2016 నాటికి ఉన్న బ్రాండ్ విలువ ఆధారంగా రెవెన్యూల‌ను అంచనా వేశారు. ఎస్ఈఎమ్‌ర‌ష్‌, గూగుల్ అన‌లిటిక్స్ సీపీసీ,యూట్యూబ్ అన‌లిటిక్ష్‌, ఎక్స్‌క్లూజివ్ వోక్స్‌స్పేస్ అన‌లిట‌క్స్ ఇంజిన్ ఆధారంగా గ‌ణించిన విలువ‌ల ఆధారంగా వోక్స్‌స్పేస్‌.ఇన్ ఇచ్చిన క‌థనానికి ఇది తెలుగు అనువాదం. అయితే సబ్‌స్క్రైబ‌ర్లు, వీక్ష‌ణ‌ల ప‌రంగా తాజా గణాంకాల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఈ ఆదాయ లెక్క‌ల‌తో కానీ, ఇక్క‌డ ఇచ్చిన గ‌ణాంకాల‌తో కానీ గుడ్‌రిట‌ర్న్స్‌, వ‌న్ ఇండియా వెబ్‌సైట్ల‌కు, ర‌చ‌యిత‌ల‌కు సంబంధం లేదు. దీని ఆధారంగా యూట్యూబ్ చాన‌ళ్ల‌ను ప్రారంభించ‌డం కానీ, వీడియోల‌ను రూపొందించ‌డం కానీ చేసి న‌ష్ట‌పోయినా ఎవ‌రూ బాధ్య‌త వ‌హించ‌రు.

Read more about: youtube, income
English summary

Top South Indian you tube channels earning laksh to crores

with immense talent and potential These toutubers brilliantly changed the way we see youtube. viewers changed their perception towards digital content. Here we are giving some top youtube stars/channels from southindia
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns