For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏమిటి?

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కంపెనీని చ‌క్క‌దిద్ద‌గ‌లిగేది ఆయ‌నేన‌ని చాలా మంది బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం.

|

ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థ‌పాకుల్లో ఒక‌రైన నందన్ నీలేక‌ని తిరిగి కంపెనీ బోర్డులోకి వ‌చ్చే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. సంస్థ మాజీ సీఎఫ్‌వో బాల‌క్రిష్ణ‌న్‌తో పాటు, సంస్థాగ‌త మ‌దుప‌ర్లు ఆయ‌న పున‌రాగ‌మ‌నాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కంపెనీని చ‌క్క‌దిద్ద‌గ‌లిగేది ఆయ‌నేన‌ని చాలా మంది బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం.

1. గ‌తంలో సీఈఓగా ప‌నిచేసి

1. గ‌తంలో సీఈఓగా ప‌నిచేసి

నీలేకని 2002 నుంచి 2007 వ‌ర‌కూ ఇన్ఫోసిస్ సీఈవోగా ప‌నిచేశారు. సంస్థ వ్య‌వ‌స్థాకుల్లో ఒక‌రైన ఈయ‌న హ‌యాంలో కంపెనీ రెవెన్యూ పోటీ సంస్థ టీసీఎస్‌కు దీటుగా పెరిగింది. అయితే సీఈవో ఎవ‌ర‌నే విష‌య‌మై నీలేక‌ని గానీ కంపెనీ యాజ‌మాన్యం కానీ స్పందించ‌లేదు. విశాల్ సిక్కా రాజీనామా చేసినప్ప‌టి నుంచి త‌దుప‌రి సీఈవో ఎవ‌రనే దానిపై ఐటీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

2. సంస్థ వాటాదార్ల స‌మావేశం వాయిదా...

2. సంస్థ వాటాదార్ల స‌మావేశం వాయిదా...

నిజానికి ఆగ‌స్టు 23(బుధ‌వారం) వాటాదారుల స‌మావేశం జ‌రిగింది. అయితే తుది నిమిషంలో అది ర‌ద్ద‌యింది. పైకి మాజీ సీఈవో,వ్య‌వ‌స్థ‌పాకులు నారాయ‌ణ మూర్తి ఆరోగ్యం బాగోలేద‌ని స‌మావేశం ర‌ద్దు చేసినప్ప‌టికీ సీఈవో విష‌య‌మై చ‌ర్చోప‌ర్చ‌ల కార‌ణంగానే స‌మావేశాన్ని ఆగ‌స్టు 29తేదీ నాటికి వాయిదా వేశార‌ని తెలియ‌వ‌స్తోంది.

3. వాటాదారుల అనుమ‌తి

3. వాటాదారుల అనుమ‌తి

కంపెనీలో ముఖ్య అధికారుల నుంచి నందన్ నీలేక‌ని కోసం వాటాదారుల మ‌ద్ద‌తు కోరుతూ అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయ‌ని ఒక బ్రోక‌రేజీ సంస్థ తెలిపింది. ప్ర‌స్తుత బోర్డులో నుంచి కొంత మందిని తొల‌గించేందుకై ఈజీఎం జ‌ర‌పాల‌ని వ్య‌వస్థాప‌కులు కోరుకుంటున్నార‌న్న వాద‌న సైతం చెలరేగుతోంది. ఇప్ప‌టికే కార్పొరేట్ ప‌ద్ద‌తులు స‌రిగా పాటించ‌లేద‌ని స‌హ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన నారాయ‌ణ మూర్తి మొద‌టి నుంచి కంపెనీ న‌డుస్తున్న తీరుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు.

4. మాజీ సీఎఫ్‌వో బాల‌క్రిష్ణ‌న్, వ్య‌వ‌స్థాప‌క వాటాదార్లు

4. మాజీ సీఎఫ్‌వో బాల‌క్రిష్ణ‌న్, వ్య‌వ‌స్థాప‌క వాటాదార్లు

కంపెనీ సీఎఫ్‌వో బాల‌క్రిష్ణ‌న్ పీటీఐతో మాట్లాడుతూ "షేర్ హోల్డ‌ర్ల ద‌గ్గ‌ర విశ్వాసం కోల్పోయినందుకు ఛైర్మ‌న్ శేష‌సాయి, కో-ఛైర్మ‌న్ వెంక‌టేశ‌న్ బ‌య‌ట‌కు వెళ్లాల్సిందిగా కోర‌వ‌చ్చు. అదే విధంగా నీల‌కేనిని త‌దుప‌రి చైర్మ‌న్‌గా నియ‌మించ‌వ‌చ్చు. క్లైంట్లు, వాటాదారులు, ఉద్యోగుల విశ్వాసం చూర‌గొనే వ్య‌క్తిగా నీలేక‌నిని తిరిగి స్వాగ‌తించ‌వ‌చ్చ‌ని వ్య‌వస్థాప‌క వాటాదారులు ఇంకా హెచ్డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ అసెట్ మేనేజ్‌మెంట్‌, బిర్లా స‌న్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖ రాశారు.

 5. కంపెనీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత‌

5. కంపెనీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత‌

నంద‌న్ నీలేక‌ని సీఈవోగా పనిచేసిన స‌మ‌యంలో సంస్థ వార్షిక వృద్దిరేటు 42%గా ఉంది. ప్ర‌స్తుతం స్వ‌ల్ప స‌మ‌స్య‌ల‌తో ఉన్న కంపెనీని అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతూ గాడిలో పెట్ట‌గ‌లిగేది ఆయ‌నే అని కొంత మంది న‌మ్ముతున్నారు. 2014లో బెంగుళూరు లోక్‌స‌భ స్థానానికి నంద‌న్ నీలేక‌ని పోటీ చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన పరిణామాల్లో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానికి ఆయ‌న్ను స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత త‌క్కువ న‌గ‌దు ఉప‌యోగించుకునే విధంగా స‌ల‌హాలు ఇవ్వ‌డంలో నీలేక‌ని కీల‌క‌పాత్ర పోషించారు.

6. హెడ్‌హంట‌ర్స్ సీఈవో మాట‌

6. హెడ్‌హంట‌ర్స్ సీఈవో మాట‌

హెడ్ హంట‌ర్స్ సీఈవో ల‌క్ష్మికాంత్ మాట్లాడుతూ నీలేక‌ని చాలా స‌రైన వ్య‌క్తి. క్ల‌యింట్ల‌తో మంచి సంబంధాలు క‌లిగి ఉన్నారు. దీంతో అంద‌రి వాటాదారుల ఆస‌క్తిని, వ్యాపారాన్ని నిల‌ప‌డంలో కృషి చేయ‌గ‌ల‌రు అని అన్నారు. సీఏ సంస్థ కేపీ రావు అనే దానిల భాగ‌స్వామి అయిన మోహ‌న్ ల‌వీ సైతం బోర్డులోని నీలేక‌నిని తీసుకురావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

Read more about: infosys companies
English summary

ఇన్ఫోసిస్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏమిటి? | some investors want Nandan Nilekani to be on Infy Board again

The dozen investors, who together own roughly 10 per cent of the Infosys shares, in their letter to the board said, "Given his (Nilekani's) credentials, we feel, that his joining the board at this stage, will restore confidence of stakeholders in the company and also facilitate resolution of the contentious issues that Infosys is facing presently.
Story first published: Thursday, August 24, 2017, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X