For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖతార్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు

80 దేశాలకు చెందిన వారు ఖతార్‌లో పర్యటించాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆ దేశ‌ ఉన్నతాధికారులు తెలిపారు.

|

సరిహ‌ద్దు అరబ్‌ దేశాలన్నీ ప‌లు ఆంక్ష‌లు విధించ‌డంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన ఖతార్ విదేశీయులకు గుడ్‌ న్యూస్‌ అందించింది. 80 దేశాలకు చెందిన వారు ఖతార్‌లో పర్యటించాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆ దేశ‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 80 దేశాల్లో భారత్‌తో పాటూ యూకే, అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు కూడా ఉన్నాయి.

 ఆ దేశానికి వీసా లేకుండా భార‌తీయులు

ఖతార్‌లో ప్రవేశించే సమయంలో ఎలాంటి రుసుము తీసుకోకుండానే మల్టీ ఎంట్రీ వేవియర్ ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీనికి గానూ ఆరునెలలకు తక్కువగా లేకుండా వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టుతో పాటూ ప్రయాణానికి సంబంధించి టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. 80 దేశాలకు చెందిన పౌరులు ఫ్రీ వీసా వేవియర్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఖతార్ టూరిజం అథారిటీ చైర్మన్‌ హసన్‌ అల్‌ ఇబ్రహిం తెలిపారు. విమాన ప్ర‌యాణికుల సంఖ్య‌ను, టూరిజం ప‌రిశ్ర‌మ‌ను పెంచేందుకు ఆ దేశం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.
2022లో ఖ‌తార్ సాక‌ర్ ప్ర‌పంచ క‌ప్‌ను నిర్వ‌హించ‌నుంది.

Read more about: visa qatar
English summary

ఖతార్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు | Qatar waives visas for India and other countries in Europe and asia

Qatar announced on Wednesday a programme to allow visa-free entry for citizens of 80 countries to encourage air transport and tourism amid a two-month boycott imposed on the Gulf state by its neighbors.
Story first published: Friday, August 11, 2017, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X