For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ ఉద్యోగులు: డేటా అన‌లిటిక్స్ గురించి తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

వ్యాపారాల్లో స‌వివ‌ర‌ణ విశ్లేష‌ణ కోసం అన‌లిటిక్స్‌పై ఆధార‌ప‌డ‌టం అనేది ఈ పరిశ్ర‌మ‌కు లాభించే అంశ‌మ‌ని అన‌లిటిక్స్‌ల్యాబ్స్ సీఈవో సుమిత్ బ‌న్స‌ల్ అన్నారు. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ అన‌లిటిక్స్ ఇండ‌స్ట్రీ స

|

అన‌లిటిక్స్ ఇండియా మ్యాగ‌జైన్‌, అన‌లిటిక్స్‌ల్యాబ్స్ సౌజ‌న్యంతో ఒక అధ్య‌య‌నం చేసింది. దీని ప్ర‌కారం 2020 క‌ల్లా దేశ అన‌లిటిక్స్ ప‌రిశ్ర‌మ 2020 నాటికి రెండింత‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికి 2.03 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ద్ద ఉన్న ఈ ప‌రిశ్ర‌మ వార్షిక వృద్ది రేటు 23.8% చొప్పున ఉండ‌గ‌ల‌ద‌ని అంచ‌నా. ప్ర‌తి వ్యాపారంలో అన‌లిటిక్స్ వాడాల్సిన అవ‌స‌రం పెరుగుతోంద‌ని మ్యాగ‌జైన్ సీఈవో భాస్క‌ర్ గుప్తా వెల్ల‌డించారు. వ్యాపారాల్లో స‌వివ‌ర‌ణ విశ్లేష‌ణ కోసం అన‌లిటిక్స్‌పై ఆధార‌ప‌డ‌టం అనేది ఈ పరిశ్ర‌మ‌కు లాభించే అంశ‌మ‌ని అన‌లిటిక్స్‌ల్యాబ్స్ సీఈవో సుమిత్ బ‌న్స‌ల్ అన్నారు. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ అన‌లిటిక్స్ ఇండ‌స్ట్రీ స్టడీ-2017లో ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.

అన‌లిటిక్స్ రెవెన్యూ అంచ‌నా 2.03 బిలియ‌న్ డాల‌ర్లు

అన‌లిటిక్స్ రెవెన్యూ అంచ‌నా 2.03 బిలియ‌న్ డాల‌ర్లు

1. అన‌లిటిక్స్‌, డేటా సైన్స్‌, బిగ్ డేటా ప‌రిశ్ర‌మ విలువ ప్ర‌స్తుతం మ‌న దేశంలో 2.03 బిలియ‌న్ డాల‌ర్ల రెవెన్యూ స్థాయిలో ఉంద‌ని అంచ‌నా. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు సైతం డేటా అన‌లిటిక్స్‌, బిగ్ డేటా వంటివి వాడేందుకు ఆస‌క్తి చూపుతున్న కార‌ణంగా ఈ రంగంలో సుస్థిర వృద్దికి అవ‌కాశం ఉంద‌ని ల‌న‌లిటిక్స్‌ల్యాబ్స్ సీఈవో బ‌న్స‌ల్ అన్నారు.

2020 నాటికి రెండింత‌ల వ్యాపారం

2020 నాటికి రెండింత‌ల వ్యాపారం

2. మూడు అంశాల్లో బిగ్ డేటాకు అత్య‌ధిక ప్రాధాన్యం ఉంటూ 24% దాన్నుంచే వ్యాపారం సాగుతుంది. మొత్తానికి ఈ అన‌లిటిక్స్ ప‌రిశ్ర‌మ 2020 క‌ల్లా క‌చ్చితంగా రెండింత‌ల ఆదాయాన్ని స‌మ‌కూరుస్తుంద‌ని విశ్లేషించారు. ఇందులో 12% అడ్వాన్స్‌డ్ అన‌లిటిక్స్, ప్రిడిక్టివ్ మోడ‌లింగ్‌, డేటా సైన్స్ విష‌యాల్లో దాగి ఉంటుంది.

దేశాల రెవెన్యూ వాటా

దేశాల రెవెన్యూ వాటా

3. అమెరికాకు చేసే అన‌లిటిక్స్ ప్రాజెక్టుల కారణంగా మ‌న దేశానికి 60% ఆదాయం వ‌స్తోంది. మిగిలిన దేశాల్లో యూకే వ‌ల్ల 8.4%, ఆస్ట్రేలియా, కెన‌డా వంటివి ఉన్నాయి. కేవ‌లం భార‌త‌దేశంలో ఉండే సంస్థ‌ల వ‌ల్ల అన‌లిటిక్స్ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చే ఆదాయాన్ని చూస్తే 4% వ‌ర‌కూ ఉంటుంది.

రంగాల వారీగా

రంగాల వారీగా

4. అన‌లిటిక్స్‌కు ప‌రిశ్ర‌మ‌ల రంగంలోని చాలా కంపెనీలు ఆదాయాన్ని స‌మ‌కూర్చ‌వు. కేవ‌లం రెండు, మూడు రంగాలు మాత్ర‌మే దీనికి ప‌ట్టుకొమ్మ‌లు. ముఖ్యంగా ఫైనాన్స్‌, బ్యాంకింగ్ రంగాలు అత్య‌ధికంగా అన‌లిటిక్స్ రెవెన్యూను స‌మ‌కూరుస్తున్నాయి. 756 మిలియ‌న్ డాల‌ర్ల‌లో 37% ఈ రెండు రంగాల నుంచే వ‌స్తోంది. గ‌తేడాదితో పోల్చి చూస్తే ఇది 31% ఎక్కువ‌.

 అన‌లిటిక్స్ హ‌బ్‌-ఇండియా

అన‌లిటిక్స్ హ‌బ్‌-ఇండియా

5. అన‌లిటిక్స్ ఇండియా మ్యాగ‌జైన్ సీఈవో మాట్లాడుతూ భార‌తదేశం క‌చ్చితంగా అన‌లిటిక్స్‌కు హ‌బ్‌గా త‌యార‌వుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

దేశంలో ఏయే నగ‌రాల్లో ప్రాముఖ్య‌త‌

దేశంలో ఏయే నగ‌రాల్లో ప్రాముఖ్య‌త‌

6. దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో అన‌లిటిక్స్ ప్రాముఖ్య‌త పెరుగుతున్న‌ది. మొత్తం అన్ని న‌గ‌రాల్లో పోల్చి చూస్తే ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఎక్కువ రెవెన్యూ వ‌స్తుంది. మొత్తం మార్కెట్ వ్యాపారం 565 మిలియ‌న్ డాల‌ర్ల‌లో ఢిల్లీ రాజ‌ధాని ప్రాంతం 28% వ‌ర‌కూ, బెంగుళూరు 27% వాటాల‌ను స‌మ‌కూరుస్తున్నాయి.

 ఫ్రెష‌ర్ల సంగ‌తేంటి?

ఫ్రెష‌ర్ల సంగ‌తేంటి?

7. గ‌తేడాది దేశంలో 8500 మంది ఈ రంగంలో ఉద్యోగాలు తెచ్చుకోగా, ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 12వేల మంది అన‌లిటిక్స్ త‌దిత‌ర రంగాల్లో కొత్త‌గా వ‌చ్చి చేరారు.

పెద్ద కంపెనీల్లోనే ఎక్కువ మంది

పెద్ద కంపెనీల్లోనే ఎక్కువ మంది

8. చిన్న కంపెనీల్లో ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించినా జీతాలు ఎక్కువ ఇవ్వ‌లేరు. కంపెనీ ఆదాయానికి త‌గ్గ‌ట్లుగా అన‌లిటిక్స్‌ను పెద్దఎత్తున కొన‌సాగించ‌లేరు. దీని కార‌ణంగా మొత్తం అన‌లిటిక్స్ వృత్తి నిపుణుల్లో 40 శాతం మందికి పెద్ద కంపెనీల్లోనే ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. దాదాపు ఈ సంఖ్య 10 వేల‌కు పైగా ఉంటుంది.

 మ‌ధ్య స్థాయి కంపెనీలు

మ‌ధ్య స్థాయి కంపెనీలు

9. మ‌ధ్య స్థాయి కంపెనీలు ఇప్పుడిప్పుడే అన‌లిటిక్స్ ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాయి. రెవెన్యూ గురించి ప‌ట్టించుకోకుండా దీర్ఘ‌కాల దృష్టితో అన‌లిటిక్స్ కోసం ఖ‌ర్చు పెడుతున్నాయి. దీంతో మ‌ధ్య స్థాయి కంపెనీలు దాదాపు 33% మందికి ఉద్యోగాలిస్తున్నాయి

 చిన్న కంపెనీలు, స్టార్ట‌ప్‌లు

చిన్న కంపెనీలు, స్టార్ట‌ప్‌లు

10. చిన్న కంపెనీల్లో దీర్ఘ‌కాల దృష్టితో ఆలోచించే నైపుణ్యం క‌లిగిన యాజ‌మాన్యం లేక అన‌లిటిక్స్‌ను ప‌క్క‌న పెడుతున్నారు. అయితే స్టార్ట‌ప్‌లు మాత్రం అలా చేయ‌డం లేదు. కేవ‌లం స్టార్ట‌ప్‌లే 27% మంది అన‌లిటిక్స్ వృత్తి నిపుణుల‌కు మార్గం చూపుతున్నాయి.

Read more about: big data data analytics software
English summary

ఐటీ ఉద్యోగులు: డేటా అన‌లిటిక్స్ గురించి తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు | 10 important points about Data analytics in India by 2020

Big Data has matured differently than most technologies, however. First, no one leader has emerged after nearly a decade. The analytics industry is still in growth mode, and leaders emerge when an industry consolidates.Here are 10 highlights from Analytics India Industry Study 2017
Story first published: Tuesday, August 1, 2017, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X