English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పారం-16 గురించి ఉద్యోగులు తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ఆదాయపు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించ‌డానికి అవ‌స‌ర‌మైన వాటిలో ముఖ్య‌మైన‌ది ఫారం-16. దీన్ని మీ కంపెనీ ఫైనాన్స్‌, అకౌంట్ డిపార్ట్‌మెంట్స్ నుంచి పొందాలి. ఈ ఫారం మీ ద‌గ్గ‌ర ఉంటే యాజమాన్యం మీ వేత‌నంలో నుంచి ఎంత టీడీఎస్ మిన‌హాయించిందో తెలుసుకోవ‌చ్చు. ఆదాయపు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం వేత‌నంలో టీడీఎస్ మిన‌హాయిస్తే త‌ప్ప‌నిస‌రిగా ఉద్యోగుల‌కు ఫారం-16 జారీ చేయాలి. దీన్ని ఏడాదికోసారి జారీ చేస్తారు. దీని గురించి మరిన్ని విష‌యాలు తెలుసుకుందాం.

 అందులో ఏముంటాయి?

అందులో ఏముంటాయి?

ఫారం-16లో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఏలో మీ యాజ‌మాన్యానికి సంబంధించిన వివ‌రాలు... మీ పేరు, పాన్ కార్డు నెంబ‌రు లాంటి వివ‌రాలు ఉంటాయి. ఇవ‌న్నీ స‌రిగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్య‌త ఉద్యోగిపైనే ఉంటుంది. వ్య‌త్యాసాలుంటే యాజ‌మాన్యం దృష్టికి తీసుకుపోవాలి. ఇక రెండోది పార్ట్‌-బీ. ఇందులో మీ వేత‌నానికి సంబంధించిన వివ‌రాలు స్ప‌ష్టంగా విడివిడిగా ఇస్తారు. మీ ఆదాయంతో పాటు, మిన‌హాయింపులు కూడా ఈ భాగంలోనే పేర్కొంటారు. ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపుల‌కు సంబంధించి మీరు అందించిన ప్ర‌తిదీ ఇందులో న‌మోద‌య్యిందా లేదా చూసుకోవాలి. మిన‌హాయింపుల‌న్నీ పూర్తిగా రాక‌పోతే, మీరు ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసే స‌మ‌యంలో సంబంధిత ఆధారాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకొని, వాటిని పేర్కొనాలి. ఆధారాల‌ను జాగ్ర‌త్త‌గా పెట్టుకోవ‌డం మ‌రిచిపోకూడ‌దు.

పార్ట్‌_ఏ

పార్ట్‌_ఏ

ఫారం16-పార్ట్ ఏ

యాజ‌మాన్యం పేరు, చిరునామా

యాజ‌మాన్యం ట్యాన్, పాన్‌

ఉద్యోగి పాన్ నంబ‌రు

కోత విధించిన పన్ను

మ‌దింపు సంవ‌త్స‌రం

సంస్థ‌లో ఉద్యోగం చేసిన కాలం

ట్రేసెస్ పోర్ట‌ల్ ద్వారా ఫారం 16ఏ ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

పారం-16 పార్ట్‌-బీ

పారం-16 పార్ట్‌-బీ

పార్ట్‌-బీ

వేత‌నంలో దేనికి ఎంత మిన‌హాయించారు

ఆదాయ‌పు ప‌న్నుచ‌ట్టం అనుమ‌తించిన మిన‌హాయింపులు

సెక్ష‌న్ 89 కింద ప‌న్ను ఆదా మార్గాలు

మీరు ఒక ఏడాదిలో ఒక‌టి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసి ఉంటే ఒక‌టి కంటే ఎక్కువ ఫారం-16లు

ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు ...

ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు ...

ఎవ‌రైనా ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసిన‌ప్పుడు ఈ వివ‌రాల‌ను స‌రిచూసుకోవాలి.

1. ట్యాక్స‌బుల్ శాల‌రీ- ప‌న్ను సంక్ర‌మించ‌గ‌ల ఆదాయం

2. 80సీ కింద ఉండే ప‌న్ను మిన‌హాయింపులు

3. 80సీ కింద మీరు సాధించే అర్హ‌త‌, మీరు ఉప‌యోగించుకున్న వెసులుబాట్లు

4. టీడీఎస్

5. రీఫండ్ డ్యూ లేదా ట్యాక్స్ ఎంత చెల్లించాలి...

ప‌న్ను రిట‌ర్నుల‌కు ముందు ఈ వివ‌రాల‌ను చూడాలి

ప‌న్ను రిట‌ర్నుల‌కు ముందు ఈ వివ‌రాల‌ను చూడాలి

1. యాజ‌మాన్యం ఎంత టీడీఎస్ మిన‌హాయించింది

2. ఉద్యోగం క‌ల్పించే సంస్థ ట్యాన్

3. ఉద్యోగం క‌ల్పించే సంస్థ పాన్ నంబ‌రు

4. యాజ‌మాన్యం పేరు, చిరునామా

5. ప్ర‌స్తుతం మ‌దింపు సంవ‌త్స‌రం ఏది?

6. మీ పేరు, చిరునామా

7. పాన్ నంబ‌రు

ఫారం-16 ఎవ‌రు ఇస్తారు? అది లేక‌పోతే ఎలా?

ఫారం-16 ఎవ‌రు ఇస్తారు? అది లేక‌పోతే ఎలా?

అరుదుగా కొన్నిసార్లు యాజమాన్యాలు ఫారం-16లు ఇవ్వకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-26ఏఎస్‌ సహాయం తీసుకోవచ్చు. అయితే, పన్ను చెల్లించి, ఫారం-16 ఇవ్వలేదు కాబట్టి, రిటర్నులు దాఖలు చేయక‌పోతే మీకే న‌ష్టం. ఫారం-16 ఇవ్వకపోవడం యాజమాన్యం చేసే తప్పయితే.. రిటర్నులు దాఖలు చేయకపోవడం మీరు చేసే పొరపాటని గుర్తుంచుకోవాలి.

ఐటీ రిట‌ర్నుల్లో జాగ్ర‌త్త వ‌హించాల్సిన ముఖ్య విష‌యాలు

టీడీఎస్ మిన‌హాయించి, వివ‌రాల‌ను మీకు ఇవ్వ‌క‌పోతే

టీడీఎస్ మిన‌హాయించి, వివ‌రాల‌ను మీకు ఇవ్వ‌క‌పోతే

ఎవ‌రైతే మీకు వేత‌నాల‌ను చెల్లిస్తున్నారో టీడీఎస్ మిన‌హాయించి ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన బాధ్య‌త వారిపైనే ఉంటుంది. అదే విధంగా యాజ‌మాన్యాలు టీడీఎస్ మిన‌హాయింపులు, ప్ర‌భుత్వానికి డిపాజిట్ అయిన‌ట్లు ఒక స‌ర్టిఫికెట్‌ను ఉద్యోగుల‌కు అందించాల్సిందే. దాన్నే ఫారం-16గా ప‌రిగ‌ణిస్తున్నారు. ఫారం-16 ఉద్యోగుల హ‌క్కు. దీన్ని యాజ‌మాన్యాల‌ను అడిగి తీసుకోవాలి. మీ వేత‌నం నుంచి టీడీఎస్ మిన‌హాయించ‌బ‌డ‌లేదంటే పారం-16 అవ‌స‌రం లేద‌ని చెబుతారు. దీనికి సంబంధించి ప‌న్ను నిపుణుల వ‌ద్ద వివ‌ర‌ణ తీసుకోవాలి.

English summary

what is form-16 and how to understand it

What is Form 16? If your salary exceeds the taxable limit, despite submitting 80C and other proofs, your employer would start deducting you tax at source, also called TDS.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC