For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.70 వేల కోట్ల గుజ‌రాత్ గిఫ్ట్ సిటీ విశేషాలు

ఈ స్మార్ట్ సిటీ గుజ‌రాత్‌లో ఉంది. గాంధీ న‌గ‌ర్‌-అహ్మ‌దాబాద్ జాతీయ ర‌హ‌దారి స‌మీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. రూ.70 వేల కోట్ల వ్య‌యంతో నిర్మించ సంక‌ల్పించిన ఈ ప్రాజెక్టు విశేషాలు మీ కోసం...

|

* గుజ‌రాత్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సెంట‌ర్

గుజ‌రాత్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్‌-టెక్ సిటీకి సంక్షిప్త రూపమే గిఫ్ట్ సిటీ. భార‌త‌దేశ ఆర్థిక‌, టెక్నాల‌జీ సేవ‌ల‌కు చిర‌స్మ‌రణీయ‌మైన కేంద్రంగా తీర్చిదిద్దుతున్న ఈ స్మార్ట్ సిటీ గుజ‌రాత్‌లో ఉంది. గాంధీ న‌గ‌ర్‌-అహ్మ‌దాబాద్ జాతీయ ర‌హ‌దారి స‌మీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. రూ.70 వేల కోట్ల వ్య‌యంతో నిర్మించ సంక‌ల్పించిన ఈ ప్రాజెక్టు విశేషాలు మీ కోసం...

1. దీనికి 2011లో నాంది

1. దీనికి 2011లో నాంది

ఇప్పటికే పారిస్‌, టోక్యో, లండన్‌, చైనాల్లో ఉన్న ఈ తరహా స్మార్ట్‌సిటీలను తలదన్నేలా.. ప్ర‌పంచ దేశాలు ఆశ్చర్యపోయేలా దీన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్‌ సిటీలను నిర్మించి, ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనలకు మోదీ గిఫ్ట్‌ సిటీ రూపంలో ఆరేళ్ల క్రితమే నాంది పలికారని చెప్పుకోవచ్చు. 2011 సంవ‌త్స‌రంలో దీనికి సంబంధించి చ‌ర్చ‌లు సాగాయి. మోదీ మ‌దిలో పారిశ్రామిక వేత్త‌ల ఆలోచ‌న‌ల‌కు స‌రిపోయేలా రూపుదిద్దుకున్న స‌రికొత్త అంత‌ర్జాతీయ ఆర్థిక కేంద్ర‌మే ఇది.

2. గుజ‌రాత్ రాష్ట్రంలో అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రం

2. గుజ‌రాత్ రాష్ట్రంలో అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రం

ఈ అంత‌ర్జాతీయ సేవ‌ల కేంద్రం గుజ‌రాత్ రాష్ట్రంలో ప్ర‌త్యేక సంస్థ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తుంది. ఇది ఇండియ‌న్ రూపాయ‌ల్లో కాకుండా పౌరుల విష‌యంలో భార‌తీయులు, భార‌తీయులు కాని వారికి అంత‌ర్జాతీయ స్థాయిలో ఆర్థిక ప‌ర‌మైన సేవ‌లందించేందుకు ఉద్దేశించింది. గాంధీన‌గ‌ర్ రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న ఒక సెజ్‌గా దీన్ని చెప్పుకోవ‌చ్చు. మ‌న దేశంలో అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రంగా పేరు తెచ్చుకున్న ప్రాంతం ఈ గిఫ్ట్ సెజ్ ఒక్క‌టే.

3. ఎక్క‌డో జ‌రిగేవ‌న్నీ మ‌న నేల‌పైనే జ‌ర‌గాల‌ని...

3. ఎక్క‌డో జ‌రిగేవ‌న్నీ మ‌న నేల‌పైనే జ‌ర‌గాల‌ని...

సాధార‌ణంగా ఎక్కువ ప్ర‌పంచ స్థాయి ఆర్థిక వ్య‌వ‌హారాలు అన్నీ అమెరికా, యూర‌ప్‌లో ప్ర‌ధాన న‌గ‌రాల చుట్టూనే తిరుగుతాయి. భార‌త‌దేశానికి ఆవ‌ల ఇత‌ర దేశాల ఆర్థిక సంస్థ‌లు, మ‌న దేశ ఆర్థిక సంస్థ‌ల శాఖ‌లు చేప‌ట్టే అన్ని ర‌కాల లావాదేవీలు దేశం లోప‌లే జ‌ర‌గ‌డానికి గిప్ట్ అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రాన్ని ప్ర‌తిపాదించారు. మ‌న నేల‌పైనే ఆర్థిక లావాదేవీలు జ‌ర‌గ‌డం ద్వారా ఇక్క‌డ ఉద్యోగాలు సృష్టించ‌బ‌డ‌తాయి. మోదీ కలల నగరమైన ఈ సిటీ ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హంగులతో నిర్మాణం అవుతోంది.

4. గుజ‌రాత్ ఎందుకు?

4. గుజ‌రాత్ ఎందుకు?

గత ప‌దేళ్లుగా ఆ రాష్ట్ర జీఎస్‌డీపీ ఏడాదికి 14% చొప్పున వార్షికంగా మంచి అభివృద్దిని సాధిస్తోంద‌ని గిఫ్ట్‌గుజ‌రాత్‌.ఇన్ వెబ్‌సైట్ పేర్కొంది. అంతే కాకుండా ఎన్నో త‌యారీ సంస్థ‌లు ఇక్క‌డ ఉండ‌టంతో పాటు, పెట్టుబ‌డి, వ్య‌వస్థాప‌క క‌మ్యూనిటీ ఇక్క‌డ ఎక్కువ‌గా ఉండ‌టం మ‌రో ముఖ్య కార‌ణం. ఆర్థిక రంగంలో ఈ రాష్ట్ర సామ‌ర్థ్యాన్ని గుర్తించినందువ‌ల్లే అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రం నిర్మించ‌డానికి అనువైన చోటుగా దీన్ని ఎంచుకున్నారు.

5. ఏదైనా కంపెనీ ఇక్క‌డ కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తే లాభ‌మేంటి?

5. ఏదైనా కంపెనీ ఇక్క‌డ కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తే లాభ‌మేంటి?

ఇత‌ర అంత‌ర్జాతీయ ఆర్థిక కేంద్రాల్లో ఉండే సేవ‌ల్లో దాదాపు అన్నీ ఇక్క‌డా ల‌భిస్తాయి.

దాదాపు 10 ఏళ్ల పాటు స్వేచ్చాయుత ప‌న్ను విధానం అమ‌ల‌వుతుంది.

ఒక బ‌ల‌మైన నియంత్ర‌ణ‌, చ‌ట్ట‌ప‌ర‌మైన వాతావర‌ణాన్ని నెల‌కొల్పుతారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో పేరొందిన విధానాలు పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడుకుని నియంత్ర‌ణలు చేప‌డ‌తారు.

ఎంతో మంది వృత్తి నైపుణ్యం క‌లిగిన వారిని ఒకే చోట పొంద‌వ‌చ్చు.

ఒక ఆధునిక ర‌వాణా, క‌మ్యూనికేష‌న్‌, ఇంట‌ర్నెట్ మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తారు.

దేశంలో ఆఫ్‌షోర్ లావాదేవీల‌కు ఒకే కేంద్రంగా ఇది నిలుస్తుంది.

6. ఐటీ సెజ్‌లాగే ఉంటుందా?

6. ఐటీ సెజ్‌లాగే ఉంటుందా?

మామూలుగా ఐటీ కంపెనీలు నెల‌కొల్పాలంటే ఎటువంటి ముంద‌స్తు నియంత్ర‌ణ‌ప‌ర‌మైన‌ అనుమ‌తులు అక్క‌ర్లేదు. బ్యాంకింగ్, బీమా, క్యాపిట‌ల్ మార్కెట్ సంబంధిత సంస్థ‌లు ఆయా నియంత్ర‌ణ సంస్థ‌ల నుంచి అనుమ‌తులు పొందాల్సిందే. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకులైతే ఆర్‌బీఐ నుంచి, బీమా సంస్థ‌లైతే ఐఆర్‌డీఏఐ నుంచి, క్యాపిట‌ల్ మార్కెట్ వ్య‌వ‌హారాల‌ను న‌డిపేవైతే సెబీ నుంచి అనుమ‌తులు తీసుకోవాలి. వీట‌న్నింటిని క‌లిపి ఇక్క‌డ ఐఎఫ్ఎస్‌సీ(ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సెంట‌ర్)గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఐటీ కంపెనీల‌న్నీ ఇక్క‌డ సెజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మీష‌న‌ర్ అనుమ‌తి పొంది కార్య‌కలాపాలు ప్రారంభించ‌వ‌చ్చు. మిగిలిన సంస్థ‌ల‌న్నీ సెజ్ అనుమ‌తితో పాటు నియంత్ర‌ణ సంస్థ‌ల అనుమ‌తులు పొందితేనే ముందుకు సాగ‌వ‌చ్చు.

7. కార్య‌క‌లాపాల‌న్నీ ఏ క‌రెన్సీలో

7. కార్య‌క‌లాపాల‌న్నీ ఏ క‌రెన్సీలో

ఇక్క‌డ జ‌రిగే అన్ని లావాదేవీలు రూపాయి కాకుండా విదేశీ క‌రెన్సీలో జ‌రుగుతాయి. కేవ‌లం నిర్వ‌హ‌ణ‌ప‌ర‌మైన‌, చ‌ట్ట‌ప‌ర‌మైన లావాదేవీల‌ను మాత్రం భార‌తీయ రూపాయ‌ల్లో జ‌ర‌ప‌వ‌చ్చు.

8. ఇక్క‌డ ఏయే త‌ర‌హా కంపెనీలు లేదా సంస్థ‌లు ప్రారంభ‌మ‌వుతాయి?

8. ఇక్క‌డ ఏయే త‌ర‌హా కంపెనీలు లేదా సంస్థ‌లు ప్రారంభ‌మ‌వుతాయి?

ఈ కింద సంస్థ‌లు అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల కేంద్రంలో త‌మ కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్ట‌వ‌చ్చు.

బ్యాంకింగ్ రంగం(ఆర్‌బీఐ కింద ప‌నిచేస్తాయి)

  • దేశీయ బ్యాంకులు
  • ప్రయివేటు బ్యాంకులు(ఇదివ‌ర‌కే భార‌త్‌లో ఉన్న‌వి)

బీమా రంగం- బీమా రంగ నియంత్ర‌ణ ప్రాధికార సంస్థ‌(ఐఆర్‌డీఏఐ)

  1. దేశీయ ఇన్సూరెన్స్ సంస్థ‌లు
  2. దేశీయ రీఇన్సూరెన్స్ సంస్థ‌లు
  3. ఇండియ‌న్ బ్రోక‌ర్లు
  4. విదేశీ ఇన్సూరెన్స్ సంస్థ‌లు
  5. విదేశీ రీఇన్సూరెన్స్ సంస్థ‌లు

క్యాపిట‌ల్ మార్కెట్‌కు సంబందించి- సెబీ నియంత్ర‌ణ‌లో

  1. స్టాక్ ఎక్స్చేంజీలు లేదా క‌మొడిటీ ఎక్స్చేంజీలు
  2. క్లియ‌రింగ్ కార్పొరేష‌న్లు
  3. డిపాజిట‌రీలు
  4. బ్రోకర్లు
  5. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ‌ర్ సంస్థ‌లు
  6. పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్ సంస్థ‌లు
  7. ఇత‌ర ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ‌లు
  8. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు
9. ఇప్పటికే కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టిన సంస్థ‌లేవి?

9. ఇప్పటికే కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టిన సంస్థ‌లేవి?

బ్యాంకుల్లో ఐడీబీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యెస్ బ్యాంకు, ఇండ‌స్ఇండ్ బ్యాంకు, ఫెడ‌ర‌ల్ బ్యాంకు, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొద‌లైన‌వి.

బీమా రంగంలో న్యూ ఇండియా అస్సూరెన్స్‌, జీఐసీ ఆర్ఈ(రీఇన్సూరెన్స్) కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టేందుకు అనుమ‌తులు పొందాయి.

క్యాపిట‌ల్ మార్కెట్‌కు సంబంధించి రిల‌య‌న్స్ ఏఐఎఫ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ‌

ఐటీ లేదా ఐటీఈఎస్‌, క‌న్స‌ల్టెన్సీ యూనిట్లు: యాక్స్‌వెల్ టెక్నాల‌జీస్‌, క్యూఎక్స్ కార్పొరేట్ అడ్వైజ‌ర్స్‌, ఐషిప్ డిజైన్‌, ఎక్సెంప్ల‌రీ క‌న్సల్టెంట్స్ మొద‌లైన‌వి.

ఎన్ఎస్ఈ 2015లో మోదీ ప్రారంభించ‌బ‌డింది.

జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ, బాంబే స్టాక్ ఎక్స్చేంజీ, ఎమ్‌సీఎక్స్‌, ఎన్‌సీడీఈఎక్స్‌, డీఎమ్‌సీసీ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు ఇక్క‌డ త‌మ సంస్థ‌ల‌ ప్రారంభానికి ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.

10. 2016 వ‌ర‌కూ ఏ విధ‌మైన కార్య‌క‌లాపాలు ఇక్క‌డ జ‌రిగాయి?

10. 2016 వ‌ర‌కూ ఏ విధ‌మైన కార్య‌క‌లాపాలు ఇక్క‌డ జ‌రిగాయి?

ఐఎఫ్ఎస్‌సీ బ్యాంకింగ్ యూనిట్లు ఈ కింది ర‌క‌మైన లావాదేవీల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి.

బ‌య‌ర్స్ క్రెడిట్‌

లోన్ సిండికేష‌న్

జాయింట్ వెంచ‌ర్స్ ఫండింగ్, మొత్తం విదేశీ సొంత నిధుల‌తో ప్రారంభించే సంస్థ‌లకు ఫండింగ్

ఈసీబీ(విదేశీ వాణిజ్య రుణాలు)

జూన్ 30, 2016 నాటికే ఇక్క‌డ ఉన్న బ్యాంకులు దాదాపు 3 బిలియ‌న్ డాల‌ర్ల మేర‌కు వాణిజ్య ప‌ర‌మైన లావాదేవీలు పూర్తిచేశాయి.

Read more about: gujarat gift city business
English summary

రూ.70 వేల కోట్ల గుజ‌రాత్ గిఫ్ట్ సిటీ విశేషాలు | Gujarat International Finance Tec City with 70thousand crores

With 110 skyrises, metro service, bus rapid transport, elevated walkways, automated waste collection and a host of other amenities, the Rs 70,000 crore ($11.1 billion) Gujarat International Finance Tec City (or Gift City) between Ahmedabad and Gandhinagar not only wants to emerge as India's first Smart City, but also become a model for others to follow.
Story first published: Wednesday, July 19, 2017, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X