English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

10 ప్ర‌భావిత‌మైన బ్రాండ్లు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

బ‌హుళ జాతి కంపెనీల పుణ్య‌మా అని దేశం మొత్తం బ్రాండ్ పిచ్చి విస్త‌రించింది. ఎప్పుడూ ఈ బ్రాండ్ వాడితేనే మంచి ఫ‌లితాలు, ఫ‌లానా బ్రాండ్ వాడే మంచి సేవ‌లు అందిస్తాడ‌ని సామాన్యులు సైతం వాదులాడుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అది మ‌నం వాడే పేస్ట్ అయినా, రోజూ వాడే మొబైల్ అయినా. బ్రాండంటే అంత మోజు ఏర్ప‌డింది ప్ర‌తి ఒక్క‌రిలో. అలాంటి బ్రాండ్ల‌లో ప్ర‌జ‌ల‌ను అత్య‌ధికంగా ప్ర‌భావితం చేసిన ప‌దింటిని తెలుసుకుందాం.

1. గూగుల్

1. గూగుల్

గూగుల్ నిరంతరం సృజ‌నాత్మ‌క‌త దిశ‌గా ఉద్యోగుల‌ను ప్రోత్స‌హిస్తుంది. గూగుల్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నారంటే వారిని ఒక ప్ర‌త్యేక ధోర‌ణితో చూడ‌టం మీరు గ‌మ‌నించే ఉంటారు. అమెరికాకు చెందిన ఈ టెక్ దిగ్గ‌జం ప్ర‌భావిత‌మైన బ్రాండ్ల‌లో మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకుంది.

2. మైక్రోసాఫ్ట్‌

2. మైక్రోసాఫ్ట్‌

బ్రాండ్లలో రెండో స్థానంలో వాటిలో మైక్రోసాఫ్ట్ ఉంది. దీని ప్ర‌ధాన కార్యాల‌యం రెడ్మాండ్‌, వాషింగ్ట‌న్‌లో ఉంది. ఈ సంస్థ కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్‌లు, క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, పీసీలు, ఇతర కంప్యూట‌ర్ సేవ‌ల‌ను అమ్మ‌తుంది. ఇంకా ఎన్నో ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తు, లైసెన్సు స‌పోర్ట్‌ను ఇస్తుంది. నిరంతరం కొత్త సాఫ్ట్‌వేర్ త‌యారీలో నిమ‌గ్న‌మై ఉంటుంది.

3. ఫేస్‌బుక్‌

3. ఫేస్‌బుక్‌

ఫేస్‌బుక్ వాడ‌కందార్ల‌లో భార‌త్ నంబ‌ర్ 1. ఇప్పుడు ప‌ల్లెల్ల‌కు సైతం వేగంగా విస్త‌రిస్తోంది. ఫేస్‌బుక్ వ్య‌వస్థాప‌కుడి పేరు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌. డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ఫేస్‌బుక్ సంస్థ‌దే అగ్ర‌స్థానం.

4. ఎస్‌బీఐ

4. ఎస్‌బీఐ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో భార‌త్ నుంచి దిగ్గ‌జ బ్యాంకు ఎస్‌బీఐనే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద బ్యాంకులతో పోటీ ప‌డుతుందా లేదా అనే విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే భార‌త్‌లో మారుమూల‌ల‌కు సైతం విస్త‌రించిన బ్యాంకుగా దీనికి పేరుంది. అంతే కాకుండా ప్ర‌భావవంత‌మైన బ్రాండ్ల‌లో భార‌త్ నుంచి ఎంపికైన ఏకైక ఆర్థిక సంస్థ ఇదే. ఎస్‌బీఐ ప్ర‌ధాన కార్యాల‌యం ముంబ‌యిలో ఉంది.

5. ప‌తంజ‌లి, జియో

5. ప‌తంజ‌లి, జియో

దేశీయ ఎంఎఫ్‌సీజీ దిగ్గ‌జంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ప‌తంజ‌లి 4వ స్థానంలో ఉండ‌గా, రిల‌య‌న్స్ జియో 9వ స్థానాన్ని ద‌క్కించుకుంది. గ‌తేడాది జాబితాలో లేకున్నా ఈసారి స్థానం సంపాదించుకున్న రెండు సంస్థ‌లు ఇవే కావ‌డం విశేషం. ప‌తంజ‌లి అతిపెద్ద క‌న్సూమ‌ర్ గూడ్స్ కంపెనీల‌కే పోటీనిస్తుండ‌గా , దేశ టెలికాం రంగాన్నే ఒక కుదుపున‌కు గురిచేసిన సంస్థ‌గా జియో ఉంది.

 6. ఫ్లిప్‌కార్ట్

6. ఫ్లిప్‌కార్ట్

బెంగుళూరు ప్ర‌ధాన కేంద్రంగా ఎదిగిన దేశీయ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌. గ‌తేడాది ఉన్న ఏడో స్థానం నుంచి 3 స్థానాలు దిగ‌జారి ఈసారి ప‌దో స్థానంలో నిలిచింది. మొద‌ట ఆన్‌లైన్ పుస్త‌క విక్ర‌యాల‌తో ప్రారంభించి త‌ర్వాత ఈ-కామ‌ర్స్ రంగంలో దూసుకెళుతోంది.

7. అమెజాన్‌

7. అమెజాన్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో విస్త‌రించిన ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌. కొన్ని స్థానాలు ఎగ‌బాకి అన్ని బ్రాండ్ల‌తో పోటీ ప‌డి 6వ స్థానంలో నిలిచింది అమెజాన్‌. అమెజాన్ సంస్థ‌కు మ‌న దేశంలో 10వేల మందికి పైగా ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.

8. శ్యామ్‌సంగ్‌, ఎయిర్‌టెల్

8. శ్యామ్‌సంగ్‌, ఎయిర్‌టెల్

దేశ ఎలక్ట్రానిక్ రంగంలో త‌న‌కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది శ్యామ్‌సంగ్‌. ద‌క్షిణ కొరియాకు చెందిన శ్యామ్‌సంగ్ బ్రాండ్ల‌లో 7వ స్థానంలో నిలిచింది. దేశీయ టెలికాం దిగ్గ‌జం ఈ అధ్య‌య‌నంలో 8వ స్థానాన్ని ద‌క్కించుకుంది.

9. ఇత‌ర బ్రాండ్లు

9. ఇత‌ర బ్రాండ్లు

11 నుంచి 20 వ‌ర‌కూ చోటు ద‌క్కించుకున్న ఇత‌ర బ్రాండ్ల‌ను చూస్తే స్నాప్‌డీల్, యాపిల్‌, డెటాల్‌, క్యాడ్‌బ‌రీ, సోనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మారుతి సుజుకి, గుడ్ డే, అమూల్ వంటివి ఉన్నాయి. నాణ్య‌త, ఉత్ప‌త్తిని వాడిన అనుభ‌వం, అది జ‌త‌కూర్చిన విలువ వంటి కార‌ణాంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ప్ర‌భావిత బ్రాండ్ల జాబితా రూపొందించారు.

 10. ఇప్సోస్ అధ్య‌య‌నం

10. ఇప్సోస్ అధ్య‌య‌నం

దాదాపు 21 దేశాల్లో 100 బ్రాండ్ల‌ను ఈ అధ్య‌య‌నం కోసం తీసుకున్నారు. 100 బ్రాండ్ల గురించి విశ్లేషించేందుకు 1000 మంది భార‌తీయుల‌ను ఆన్‌లైన్‌లో సంప్ర‌దించారు. మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 36,600 ఇంట‌ర్వ్యూలు తీసుకున్నారు. ఈ బ్రాండ్ల‌ను లేకుండా మ‌నం జీవితం గ‌డ‌ప‌లేనంత‌గా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు త‌యార‌య్యాయ‌ని ఇప్సోస్ ప్ర‌జా వ్య‌వ‌హారాలు, లాయ‌ల్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ప‌రాజిత్ చ‌క్ర‌వ‌ర్తి చెప్పుకొచ్చారు.

11. ముగింపు

11. ముగింపు

గూగుల్ మొద‌టి స్థానంలో ఉండ‌గా, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్ రెండు,మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఉత్ప‌త్తుల‌ను, సేవ‌ల‌ను మెరుగుప‌రుచుకునేందుకు నిరంతరం కృషి చేస్తుండ‌ట‌మే ఈ విజ‌యానికి కార‌ణం. మ‌న దేశం నుంచి ప‌తంజ‌లి, ముకేశ్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ జియో 4,9 స్థానాల‌ను ద‌క్కించుకున్నాయ‌ని ఇప్పోస్ తెలిపింది.

Read more about: top brands, patanjali, jio
English summary

top 10 most most influential brands in India

The brands are rated by the consumers on quality, experience, and value, as also factors such as big marketing spends and consciously work towards increasing their brand equity were counted, the study said
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC