For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌భుత్వం గుర్తించిన అప్ర‌క‌టిత ఆదాయం రూ.16,398 కోట్లు

పెద్ద నోట్ల రద్దు త‌ర్వాత 91 లక్షల మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అక్రమ సంపదను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ' పేరుతో ఏర్పాట

|

పెద్ద నోట్ల రద్దు త‌ర్వాత 91 లక్షల మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అక్రమ సంపదను వెలుగులోకి తీసుకొచ్చేందుకు 'ఆపరేషన్ క్లీన్ మనీ' పేరుతో ఏర్పాటు చేసిన కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా నగదు రహిత లావాదేవీలతో పాటు పన్ను చెల్లింపుదారుల సంఖ్య, పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోందని ఆయన చెప్పారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ

పెద్ద నోట్ల రద్దు అనంతరం 91 లక్షల మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చారని, పన్ను చెల్లింపుదారుల సంఖ్య మున్ముందు మరింత పెరుగుతుందని భావిస్తున్నానని జైట్లీ పేర్కొన్నారు. ఆదాయ వివరాలను ప్రకటించకుండా డిపాజిట్లు చేసిన 17.92 లక్షల మందిని గుర్తించడం జరిగిందని, వీరంతా పన్ను చెల్లింపుదారుల జాబితాలో లేరని, వీరిలో దాదాపు లక్ష మంది పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారని ఆయన వివ‌రించారు. అలాగే పెద్ద నోట్ల రద్దు తర్వాత పలువురు వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన రూ.16,398 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు జైట్లీ తెలిపారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ

ప‌న్ను చెల్లింపుల‌కు సంబంధించి ఎక్కువ న‌గ‌దు లావాదేవీలు జ‌రిపిన వారిగా 17.92 ల‌క్ష‌ల మందిపై అనుమానం ఉంది. ఈ లావాదేవీల‌కు సంబంధించి ఆన్‌లైన్ వెరిఫికేష‌న్ జ‌రుగుతోంద‌ని సీబీడీటీ ఛైర్మ‌న్ సుశీల్ చంద్ర చెప్పారు. ఈ మొత్తంలో అంద‌రికీ మెయిల్స్‌, సంక్షిప్త సందేశాలు పంప‌గా ఇప్ప‌టిదాకా 9.72 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే స్పందించార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Read more about: notes ban arun jaitley
English summary

ప్ర‌భుత్వం గుర్తించిన అప్ర‌క‌టిత ఆదాయం రూ.16,398 కోట్లు | Operation Clean Money portal launched as govt narrows escape route for tax evasion

The number of persons under the tax net has increased by 91 lakh as unaccounted cash lost anonymity post note ban, Finance Minister Arun Jaitley said today.Launching a new website on 'Operation Clean Money', a programme to bring illegal wealth on books, he said the fallout of the November 8 decision to demonetise higher denomination currency has increased movement towards digitisation, number of assessees going up and tax revenue jumping as also fear of dealing in cash being instilled.
Story first published: Wednesday, May 17, 2017, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X