For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోఎయిర్ విమాన ప్ర‌యాణం రూ. 599 నుంచే

నాన్-స్టాప్ విమానాలు, వయా ఫ్లైట్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. గోఎయిర్ వెబ్‌సైట్, గోఎయిర్ టికెట్ కౌంటర్స్, గో ఎయిర్ కాల్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్స్ వద్ద ఈ టికెట్లను కొనుగోలు చేసు

|

దేశీయ‌ ఎయిర్‌లైన్స్ గోఎయిర్ మాన్‌సూన్ ఆఫర్ పేరుతో రూ.599 ప్రారంభ ధరతో టికెట్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. మాన్‌సూన్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన ఈ టికెట్లతో జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. మే 12 నుంచి ప్రారంభమైన టికెట్ల విక్రయం మే 15 అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని తెలిపింది. నాన్-స్టాప్ విమానాలు, వయా ఫ్లైట్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. గోఎయిర్ వెబ్‌సైట్, గోఎయిర్ టికెట్ కౌంటర్స్, గో ఎయిర్ కాల్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్స్ వద్ద ఈ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. మ‌రిన్ని వివ‌రాల కోసం కింద చూడండి.

వేస‌విలో ప్ర‌వేశ‌పెట్టిన కొత్త విమాన రూట్లు

వేస‌విలో ప్ర‌వేశ‌పెట్టిన కొత్త విమాన రూట్లు

గో ఎయిర్ దేశంలో కేవ‌లం ముఖ్య న‌గ‌రాల‌కు మాత్ర‌మే క‌నెక్టివిటీని క‌లిగి ఉంది. వేస‌వి కాలం సంద‌ర్భంగా కొన్ని రూట్ల‌లో కొత్త వాటిని ప్ర‌వేశ‌పెట్టింది. బెంగుళూరు-పుణె, పుణె-బెంగుళూరు, పుణె- కోల్‌క‌త‌, కోల్‌క‌త‌_పుణె మార్గాల్లో సైతం గోఎయిర్ విమ‌నాలు స‌మ్మ‌ర్‌లో తిరుగుతాయి. ప్ర‌స్తుతం పుణె, కోల్‌క‌త‌, బెంగుళూరు నుంచి రోజువారీ విమానాల‌ను ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

టిక్కెట్ల బుకింగ్ మే 12-మే 15 మ‌ధ్య‌

టిక్కెట్ల బుకింగ్ మే 12-మే 15 మ‌ధ్య‌

ప‌రిమిత సీట్ల‌తో గోఎయిర్ వేస‌వి బుకింగ్‌ల‌ను ప్రారంభించింది. ఈ ఆఫ‌ర్లు పొందాలంటే మే 12 నుంచి మే 15 మ‌ధ్య బుకింగ్ చేసుకోవాలి. ఒక‌వేళ ఈ టిక్కెట్ల‌ను ర‌ద్దు చేసుకోవాల‌నుకుంటే టిక్కెట్ల రుసుము ఏ మాత్రం వెన‌క్కు రాద‌ని గోఎయిర్ తెలిపింది. ఈ ఆఫ‌ర్లో గ్రూప్ రాయితీ ల‌భించ‌దు. ప‌న్నులు, స‌ర్‌చార్జీ టిక్కెట్ ధ‌ర‌కు అద‌నం.

టిక్కెట్ల బుకింగ్‌

టిక్కెట్ల బుకింగ్‌

గో ఎయిర్ వెబ్‌సైట్, గో ఎయిర్ టిక్కెటింగ్ కౌంట‌ర్లు, గో ఎయిర్ కాల్ సెంట‌ర్లు, ట్రావెల్ ఏజెంట్ల ద‌గ్గ‌ర చేసుకునే బుకింగ్‌ల‌కు మాత్ర‌మే మాన్‌సూన్ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. ఇన్‌ఫాంట్ బుకింగ్‌ల‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌ద‌ని గో ఎయిర్ వెబ్ సైట్ పేర్కొంది. కొన్ని బ్లాక్ అవుట్ తేదీల్లో సైతం ఆఫ‌ర్ ధ‌ర వ‌ర్తించ‌దు. బుకింగ్ స‌మ‌యంలో దీన్ని స‌రిచూసుకోవాలి.

గో ఎయిర్ గురించి

గో ఎయిర్ గురించి

2005 సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన ఈ సంస్థ చాలా వేగంగా దేశీయ రూట్ల‌కు విస్త‌రించింది. త‌క్కువ ధ‌ర‌ల్లోనే టిక్కెట్ల‌ను అందించ‌డం ఈ విమానయాన సంస్థ ప్ర‌త్యేక‌త. భార‌త దేశంలో 22 గ‌మ్య‌స్థానాల‌కు విమానాల‌ను న‌డుపుతోంది. దేశీయంగా ప్ర‌తి రోజూ 140 విమానాల‌తో స‌హా స‌గ‌టున వారానికి 975 విమానాల‌ను న‌డిపిస్తోంది.

Read more about: goair airlines
English summary

గోఎయిర్ విమాన ప్ర‌యాణం రూ. 599 నుంచే | fares starting from 599 in Go Air this summer

GoAir was launched in November 2005 and currently operates across 23 destinations with over 975 weekly flights and around 2,000 plus destinations weekly. The airline flies to Ahmedabad, Bagdogra, Bengaluru, Bhubaneswar, Chandigarh, Chennai, Delhi, Goa, Guwahati, Jaipur, Jammu, Kochi, Kolkata, Leh, Lucknow, Mumbai, Nagpur, Patna, Port Blair, Pune, Ranchi, Srinagar and Hyderabad.
Story first published: Saturday, May 13, 2017, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X