For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆది గోద్రెజ్ కూతురుకి జీసీపీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ బాధ్య‌త‌లు

గోద్రేజ్‌ గ్రూపులో ప్రధాన సంస్థ అయిన‌ గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా నిసాబాను నియ‌మించారు. మంగ‌ళ‌వారం నుంచే ఆమె విధుల్లోకి చేర‌తారు. ఈ నేప‌థ్యం

|

గోద్రేజ్‌ గ్రూపులో ప్రధాన సంస్థ అయిన‌ గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా నిసాబాను నియ‌మించారు. మంగ‌ళ‌వారం నుంచే ఆమె విధుల్లోకి చేర‌తారు. ఈ నేప‌థ్యంలో ఈ పరిణామం గురించిన మ‌రింత స‌మాచారం...

1. గౌర‌వ ఛైర్మ‌న్ హోదాలో

1. గౌర‌వ ఛైర్మ‌న్ హోదాలో

17ఏళ్ల కంపెనీకి ఛైర్మన్‌ బాధ్యతలు నిర్వహించిన ఆది గోద్రేజ్‌ ఇక నుంచి గౌరవ ఛైర్మన్‌ హోదాలో కొన‌సాగ‌నున్నారు. డైరెక్టర్ల బోర్డులోనూ ఆయన ఇక ముందు కూడా ఉంటారు. ఇక మేనేజింగ్‌ డైరెక్టరు, ముఖ్య కార్యనిర్వహణ బాధ్యతలు వివేక్‌ గంభీర్‌ చేతిలోనే ఉండనున్నాయి.

2. నిసాబానే ఎందుకు?

2. నిసాబానే ఎందుకు?

విదేశాల్లో కంపెనీల కొనుగోళ్ల ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కంపెనీ అనుసరిస్తోన్న ‘లీప్‌ఫ్రాగ్‌' వ్యూహంలో నిసాబాదే కీలక పాత్ర. 2007లో ప్రవేశపెట్టిన ఈ వ్యూహం అనంతరం జీసీపీఎల్‌ మార్కెట్‌ విలువ 20 రెట్లు పెరిగి రూ.3,000 కోట్లు నుంచి రూ.60,000 కోట్లకు చేరింది.

3. గోద్రెజ్ గ్రూపులో కీల‌క బాధ్య‌త‌ల్లో యువ‌త‌రం

3. గోద్రెజ్ గ్రూపులో కీల‌క బాధ్య‌త‌ల్లో యువ‌త‌రం

గోద్రేజ్‌ గ్రూపులో కొత్త తరం చేతిలోకి వెళ్లిన రెండో సంస్థ జీసీపీఎల్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ ఛైర్మన్‌గా ఆది గోద్రేజ్‌ కుమారుడు పిరోజ్‌ షా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. నిసాబా, పిరోజ్‌షానే కాకుండా ఆది గోద్రేజ్‌ మొదటి కుమార్తె తాన్యా దుబాష్‌ కూడా గోద్రేజ్‌ గ్రూపులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

4. నిసాబా ఎవ‌రు?

4. నిసాబా ఎవ‌రు?

39 ఏళ్ల నిసాబా హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఏంబీఏ పూర్తి చేశారు. అంత‌కుముందు వార్ట‌న్ స్కూల్‌లో బీఎస్సీ చ‌దివారు. జీసీఎల్‌ను స‌మూలంగా మార్చ‌డంలో ఈమె కీల‌క పాత్ర పోషించారు. 2011 నుంచి జీసీఎల్ బోర్డు డైరెక్ట‌రు గానూ, ప్ర‌స్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌రుగాను విధులు నిర్వ‌హిస్తున్నారు. విలీనాలు,స్వాధీనాలు చేసుకోవ‌డంలో గోద్రెజ్ సంస్థ‌లో ఆమో కీల‌క విధులు నిర్వ‌ర్తించారు.

5. గోద్రెజ్ క‌న్సూమ‌ర్ ప్రాడ‌క్ట్స్ లిమిటెడ్‌

5. గోద్రెజ్ క‌న్సూమ‌ర్ ప్రాడ‌క్ట్స్ లిమిటెడ్‌

గోద్రెజ్ క‌న్సూమ‌ర్ సంస్థ వినియోగ‌దారు వ‌స్తువుల విభాగంతో పాటు స్థిరాస్తి, గృహోప‌ర‌క‌ర‌ణాలు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల త‌యారీలో దిగ్గ‌జ సంస్థ‌గా దేశంలో వెలుగొందుతోంది. నిసాబా 2011 నుంచి సంస్థ డైరెక్ట‌ర్ల బోర్డులో ప‌నిచేస్తోంది. ఇటీవ‌ల ముగిసిన మార్చి నాటికి గోద్రెజ్ మొత్తం ఆదాయం రూ.9608 కోట్లుగా ఉంది.

6. త్రైమాసిక ఫ‌లితాలు

6. త్రైమాసిక ఫ‌లితాలు

ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ గోద్రెజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్(జీసీపీఎల్) ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 389.91 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే మూడింతలు పెరిగింది. నాడు 124.84 కోట్ల రూపాయల నికర లాభం పొందింది. ఆదాయం ఈసారి 2,480.17 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 2,204.36 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ చెప్పింది.

Read more about: godrej fmcg
English summary

ఆది గోద్రెజ్ కూతురుకి జీసీపీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ బాధ్య‌త‌లు | GCPL Announces succession Nisaba To Fill In Father Adiis Shoes

Veteran industrialist Adi Godrej today handed over the baton of Godrej Group flagship firm Godrej Consumer Products to his daughter Nisaba, who at 39 years is among the youngest women to head a large-sized Indian firm.Adi Godrej, 75, will become Chairman Emeritus after leading the company for 17 years as Nisaba, currently Executive Director of the company, assumes the new role of Executive Chairperson on May 10, 2017.
Story first published: Wednesday, May 10, 2017, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X