For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూవారీ వాడుతున్న ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తున్న 10 కంపెనీలు

హెచ్‌యూఎల్, పార్లే అగ్రో, అమూల్ వంటి కంపెనీలు మ‌నం రోజూ వాడే ఎన్నోఉత్ప‌త్త్తుల‌ను అందిస్తున్నాయి. అలా మ‌న ప్ర‌తి రోజూ జీవితాన్ని ప్ర‌భావితం చేస్తున్న ఉత్ప‌త్తుల‌ను 10 ఫుడ్ అండ్ బేవ‌రేజీ కంపెనీల గురి

|

ఎన్నో ఉత్ప‌త్తుల‌కు చిరునామాగా నిలిచిన బ్రాండ్లు భార‌త‌దేశంలో ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా ఎన్నో ఉత్ప‌త్తులు మ‌న నిత్య జీవితంలో భాగ‌మైపోయాయి. హెచ్‌యూఎల్, పార్లే అగ్రో, అమూల్ వంటి కంపెనీలు మ‌నం రోజూ వాడే ఎన్నోఉత్ప‌త్త్తుల‌ను అందిస్తున్నాయి. అలా మ‌న ప్ర‌తి రోజూ జీవితాన్ని ప్ర‌భావితం చేస్తున్న ఉత్ప‌త్తుల‌ను 10 ఫుడ్ అండ్ బేవ‌రేజీ కంపెనీల గురించి తెలుసుకుందాం.

1. అమూల్‌

1. అమూల్‌

ట‌ర్నోవ‌ర్ :- 2.15 బిలియ‌న్ డాల‌ర్లు

మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రం నాటికి అమూల్ రూ. 27 వేల కోట్ల అమ్మ‌కాల‌ను దాటేసింది. అంత‌కుముందు ఏడాది ఉన్న దాంతో పోలిస్తే ఇది 18% ఎక్కువ‌. ఈ డెయిరీ, ఆహార ప‌దార్థాల త‌యారీ కంపెనీ ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌తి ఇంటికీ చొచ్చుకుపోయిందంటే ఆశ్చ‌ర్యం అక్క‌ర్లేదు. వెన్న నుంచి చాక్‌లెట్లు, పాలు, పెరుగు, ప‌న్నీరు,మిఠాయి వంటివాటినెన్నో అమూల్ ఉత్ప‌త్తి చేస్తుంది.

2. హిందూస్తాన్ యూని లీవ‌ర్ లిమిటెడ్

2. హిందూస్తాన్ యూని లీవ‌ర్ లిమిటెడ్

ట‌ర్నోవ‌ర్ :- 4 బిలియ‌న్ డాల‌ర్లు

ఆహారం, వివిధ ర‌కాల డ్రింక్‌లు వాటి నుంచి శ‌రీర ప‌రిర‌క్ష‌ణ‌కు వాడే ప‌లు ఉత్ప‌త్తుల‌ను హిందూస్తాన్ యూనిలీవ‌ర్ లిమిటెడ్ ఉత్ప‌త్తి చేస్తుంది. దీనికి సంబంధించి మ‌నం రోజూ వాడే వాటిలో అన్న‌పూర్ణ‌, బ్రీజ్ సోప్‌, బ్రూక్‌బాండ్ త్రీరోజెస్‌, క్లోజ‌ప్‌, డొమెక్స్‌, ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ, హ‌మామ్, కిసాన్‌, లైఫ్ బాయ్‌, పాండ్స్‌, స‌న్‌సిల్క్‌, స‌ర్ఫ్ ఎక్సెల్‌, వ్యాజిలైన్‌, విమ్ వంటివి కొన్ని. ఈ సంస్థ‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌పంచంలో ప్ర‌తి రోజు 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు.

3. ప‌తంజ‌లి

3. ప‌తంజ‌లి

ట‌ర్నోవ‌ర్ :- 5000 కోట్ల రూపాయ‌లు

దేశంలో మ‌న‌కంటూ చెందిన ఒక పెద్ద స్వ‌దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీ ప‌తంజ‌లి ఆయుర్వేద్ లిమిటెడ్‌. రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాల‌కృష్ణ దీని వ్య‌వ‌స్థాప‌కులు. ఆహార ప‌దార్థాలు, వివిధ శీత‌ల పానీయాలు, శుద్దిచేసే వ‌స్తువులు, ప‌ర్స‌న‌ల్ కేర్ ఉత్ప‌త్తుల‌ను ప‌తంజ‌లి ప్ర‌ముఖంగా త‌యారుచేస్తుంది. 2009-10 లో 163 కోట్ల రెవెన్యూ నుంచి అన‌తి కాలంలోనే రూ.5000 కోట్ల స్థాయికి ఎదిగింది.

4. ఐటీసీ

4. ఐటీసీ

ట‌ర్నోవ‌ర్ :- 7 బిలియ‌న్ డాల‌ర్లు

ఐటీసీ ప్ర‌ధాన కార్యాల‌యం కోల్‌క‌త‌లో ఉంది. పొగాకుతో మొద‌లుపెట్టి ఎఫ్ఎంసీజీలో చాలా విభాగాల‌కు ఐటీసీ విస్త‌రించింది. ఐటీసీ ప్ర‌ధాన బ్రాండ్ల‌లో ఆశీర్వాద్‌, స‌న్‌ఫీస్ట్‌, క్యాండిమెన్‌, బింగో వంటి వాటిని మ‌నం నిత్యం వాడుతుంటాం. వైసీ దేవేశ్వ‌ర్ ప్ర‌స్తుతం ఐటీసీ సీఈవోగా ఉన్నారు. 2016లో ఈ సంస్థ రెవెన్యూ 8.3బిల‌య‌న్ డాల‌ర్లు(15వేల కోట్లు)గా ఉంది.

5. బ్రిటానియా

5. బ్రిటానియా

ట‌ర్నోవ‌ర్ :- 730 మిలియ‌న్ డాల‌ర్లు

మన ఇళ్ల‌ల్లో ఉండే బ్రిటానియా బ్రాండ్ల‌లో బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు, వెన్న వంటివి ఉంటాయి. ప్రాసెసింగ్ ప్ర‌ధాన వ్యాప‌కంగా క‌లిగిన బ్రిటానియా 1892లో స్థాపించ‌బ‌డింది. వీటా మేరీగోల్డ్‌, టైగ‌ర్‌, న్యూట్రీచాయిస్‌, గుడ్ డే, 50-50, మిల్క్‌ బికీస్‌, లిటిల్ హార్ట్స్ వంటివి ఈ బ్రాండ్‌కు చెందిన ప్ర‌సిద్ద ఉత్ప‌త్తులు.దేశంలో 100 న‌మ్మ‌క‌మైన బ్రాండ్ల‌లో బ్రిటానియా ఒక‌టి.

6. నెస్లే

6. నెస్లే

ట‌ర్నోవ‌ర్ :- 87 బిలియ‌న్ డాల‌ర్లు

స్విట్జ‌ర్లాండ్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న ఫుడ్ అండ్ బెవ‌రేజెస్ కంపెనీ నెస్లే. మ‌న దేశంలో 1961లో పంజాబ్‌లోని మొగాలో ఈ సంస్థ మొద‌టి ఉత్ప‌త్తి ప్లాంటును ప్రారంభించింది. అప్ప‌టి నుంచి డైరీఫార్మింగ్‌లో స్థానిక రైతుల‌కు మెల‌కువ‌ల‌ను నేర్పుతూ వ‌స్తోంది. త‌ద్వారా స్థానికుల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచేందుకు కృషిచేస్తోంది.

7. పార్లే-జీ

7. పార్లే-జీ

ట‌ర్నోవ‌ర్ :- 1 బిలియ‌న్ డాల‌ర్

పార్లే-జీ మొద‌ట బిస్కెట్ల‌తో త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. ముంబ‌యిలోని విలే పార్లే ప్రాంతంలో పార్లే ఉత్ప‌త్తుల త‌యారీ మొద‌ల‌యింది. 2013 నాటికే దేశంలోని 60 ల‌క్ష‌ల రిటైల్ స్టోర్ల‌లో పార్లే డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది. పార్లే కంపెనీ ప్ర‌ధానంగా కూల్‌డ్రింక్‌, చిప్స్‌, బిస్కెట్లు, మిన‌ర‌ల్ వాట‌ర్‌ను అమ్ముతుంది.

8. కోల్గేట్‌-పామోలివ్‌

8. కోల్గేట్‌-పామోలివ్‌

ట‌ర్నోవ‌ర్‌:- 17.08 బిలియ‌న్ డాల‌ర్లు

ఇది న్యూయార్క్ కేంద్రంగా ప‌నిచేస్తున్న అమెరికా కంపెనీ అయిన‌ప్ప‌టికీ ద‌శాబ్దాలుగా ఇండియాలో మారుమూల ప‌ల్లెల‌కు విస్త‌రించింది. ఈ కంపెనీ ప‌ర్స‌న‌ల్ కేర్ ఉత్ప‌త్తులైన‌ సోప్‌లు, డిటెర్జెంట్‌లు; టూత్ పేస్ట్, టూత్‌బ్ర‌ష్ వంటి వాటిని త‌యారీచేస్తుంది. ఇయ‌న్ ఎమ్.కుక్ ప్ర‌స్తుతం కంపెనీ సీఈవోగా ఉన్నారు.

 9. మారికో ఇండ‌స్ట్రీస్‌

9. మారికో ఇండ‌స్ట్రీస్‌

ట‌ర్నోవ‌ర్ :- 850 మిలియ‌న్ డాల‌ర్లు

మారికో ఇండియ‌న్ క‌న్సూమ‌ర్ గూడ్స్ కంపెనీ. ఈ కంపెనీ ట‌ర్నోవ‌ర్ 2005లో రూ.5733 కోట్లుగా ఉంది. ఈ సంస్థ కాయా లిమిటెడ్, పారాచూట్‌, స‌ఫోలా, హెయిర్ &కేర్‌, నిహార్‌, మెడికేర్‌, రివైవ్‌, మంజ‌ల్‌, లివ‌న్‌, సెట్ వెట్‌, జ‌త‌క్‌, ఫియాన్సి, హెయిర్‌కోడ్, ఎక్లిప్స్‌, ఎక్స్‌-మెన్‌, హెర్కులెస్‌, బ్లాక్ చిక్ వంటి ఉత్ప‌త్తుల‌తో మ‌న ఇంటింటి సంస్థ‌గా మారికో నిలిచింది. మ‌నం చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్న నూనెల్లో పారాచూట్ అంద‌రికీ సుప‌రిచితం.

10. ఆర్ఈఐ అగ్రో

10. ఆర్ఈఐ అగ్రో

ట‌ర్నోవ‌ర్‌: - 4228 కోట్ల డాల‌ర్లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించిన ఎఫ్ఎంసీజీ కంపెనీ ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్‌. 18 నుంచి 24 నెల‌లు పాటు నిల్వ ఉండేలా బాస్మ‌తి బియ్యాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. చిన్న కిరాణా స్టోర్ల నుంచి మొద‌లుకుని 6 Ten, రిల‌య‌న్స్ ఫ్రెష్‌, వాల్‌మార్ట్‌, మెట్రో స్టోర్ల‌లో ఈ బాస్మ‌తి రైస్ ఇంకా ఇత‌ర వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు అందుబాటులో ఉంటాయి.

Read more about: consumer fmcg itc amul hul
English summary

రోజూవారీ వాడుతున్న ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తున్న 10 కంపెనీలు | top companies that are part and participle of our daily life

There are several companies in India that have become synonyms to brands. They have become a part and parcel of our lives and have been associated with us from the pre-independent era too. Companies such as Hindustan Unilever, Parle Agro, Amul, etc control everything that we eat and drink in India and we don’t even realise how we have become so dependent on them.
Story first published: Wednesday, April 19, 2017, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X