English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

భార‌త సినీ చ‌రిత్ర‌లో ఖ‌రీదైన 5 సినిమాలు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ప్ర‌పంచ‌మంతా తెలిసిన సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో హాలీవుడ్‌, బాలీవుడ్ ప్ర‌ముఖ‌మైన‌వి. హాలీవుడ్ రూ.1000 కోట్ల బ‌డ్జెట్‌ను ఎప్పుడో దాటేసింది. ఇక బాలీవుడ్ వంతు. పెద్ద కంపెనీలు, ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లు మూవీ బ‌డ్జెట్ వైపు అడుగులు వేస్తుండ‌టంతో రోజురోజుకు సినిమా నిర్మాణ ఖ‌ర్చులు ఇంత‌లింత‌ల‌వుతున్నాయి. అంతే స్థాయిలో బిజినెస్ జ‌రుగుతుండ‌టంతో వంద‌ల కోట్ల బ‌డ్జెట్ పెట్టేందుకు వెనుకాడ‌టం లేదు. ప్ర‌స్తుతం మ‌హాభార‌త పేరుతో ఒక సినిమాను తీసేందుకు రూ.1000 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చుపెట్టాల‌ని యోచిస్తున్న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టాప్‌-5 ఇండియ‌న్ బ‌డ్జెట్ సినిమాల‌ను తెలుసుకుందాం.

ధూమ్‌3

ధూమ్‌3

రూ. 175 కోట్లు

ధూమ్ సిరీస్ బ‌డ్జెట్ సినిమాలు ఇండియ‌న్ సినీ ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. బాక్స్ ఆఫీస్‌కు సైతం క‌లెక్ష‌న్ల వర్షం కురిపించాయి. ధూమ్‌3 సినిమాను రూ.175 కోట్లు వెచ్చించి తీశారు. ఈ సినిమాలో అమీర్‌ఖాన్ ప్ర‌ధాన విల‌న్‌గా, క‌త్రినా కైఫ్ హీరోయిన్ పాత్ర‌లోను చేశారు. మిగిలిన తారాగ‌ణ‌మంతా ధూమ్‌లో ఉన్న‌వారే.

ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో

ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో

రూ. 180 కోట్లు

విలాస‌వంత‌మైన వ‌స్తువులు, రాజసం ఉట్టిప‌డేలా భ‌వంతులు మొదలైన‌వి ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ‌య్యేలా చేశాయి. స‌ల్మాన్ ఖాన్ ముఖ్య పాత్ర‌ధారుడిగా న‌టించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపించింది. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమాకు రూ. 432 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బాహుబ‌లి

బాహుబ‌లి

తెలుగు సినిమా చ‌రిత్రను తిర‌గరాసిన వాటిలో బాహుబ‌లి ఒక‌టి. ఒక‌సారి దేశ సినీ ప్రేక్ష‌కులంద‌రినీ తెలుగు రాష్ట్రాల వైపు చూసేలా చేసిన సినిమా ఇది. దేశంలోనే అత్య‌ధిక బ‌డ్జెట్ మూవీల్లో ఇది ఒక‌టిగా నిలిచింది. బాహుబలి ది బిగినింగ్‌ను రూ.180 కోట్ల‌తో తెర‌కెక్కిస్తే, ప్ర‌స్తుతం బాహుబ‌లి ది కన్‌క్లూజ‌న్‌ను రూ. 250 కోట్ల‌తో తీసిన‌ట్లు అంచ‌నా.

2.0

2.0

బ‌డ్జెట్: రూ. 350

రోబో(ఎంతిర‌న్‌) మూవీ కొన‌సాగింపుగా వ‌చ్చిన సినిమా 2.0. ఇది ఇప్ప‌టివర‌కూ దేశంలో అత్య‌ధిక బ‌డ్జెట్ పెట్టి నిర్మించిన చిత్రం. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన న‌టులుగా తెర‌కెక్కుతున్న సినిమాగా ఇది ప్రేక్ష‌కుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న‌ది. ఇందులో ర‌జ‌నీ ద్విపాత్ర‌న‌భియం చేస్తున్నారు. ఈ సినిమాకు గాను ర‌జ‌నీ క‌న్నా అక్ష‌య్‌కే ఎక్కువ పారితోష‌కం ఇస్తున్న‌ట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మ‌హాభార‌తం

మ‌హాభార‌తం

యూఏఈకి చెందిన భార‌త వ్యాపారి ఒక‌రు దేశంలోనే అత్య‌ధిక ఖ‌రీదైన సినిమాను తీయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అడ్వ‌ర్టైజింగ్ ఫిల్మ్ మేక‌ర్ వీఏ శ్రీ‌కుమార్ మీన‌న్ నేతృత్వంలో మ‌హాభార‌త అనే పౌరాణిక సినిమాను తీస్తార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దీన్ని రెండు భాగాలుగా తీస్తార‌ని చెబుతున్నారు. సెప్టెంబ‌రు 2018లో మొద‌లుపెట్టి 2020 క‌ల్లా సినిమా నిర్మాణం పూర్తి చేస్తార‌ని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. దీని కోసం దాదాపు రూ.1000 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెడ‌తార‌ని అనుకుంటున్నారు. ఈ ఫిల్మ్ నిర్మాత‌గా వ్యాపార‌వేత్త బీఆర్ షెట్టి ఉంటార‌ని ప‌లువురు భావిస్తున్నారు. టాప్ 10 టీవీ బ్రాండ్లు

Read more about: movies, indian films
English summary

5 most expensive Indian films

Bollywood as an industry has grown tremendously. With a lot of funding coming its way, film making is a lucrative proposition. With big companies and production houses catching a fancy to it, the budget of movies is increasing by the day.There is a buzz that a UAE-based Indian businessman is going to fund the most expensive Indian film ever at a cost of Rs 1000 crore. The magnum opus will be based on the epic ‘Mahabharata’ and will be directed byadvertising film maker V A Shrikumar Menon. It will be produced in two parts and is scheduled to go on the floors by September 2018 for a release in early 2020.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC