For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త‌గ్గిన పారిశ్రామికోత్ప‌త్తి, పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం

ఒక ప‌క్క పారిశ్రామికోత్ప‌త్తి నిరాశ‌ప‌రిస్తే, మ‌రో వైపు రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం సెగ తాకింది.ఈ ప‌రిణామంతో దేశీయంగా పారిశ్రామిక వ‌ర్గాలు నిరాశ చెందే అవ‌కాశం ఉంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిమాండ్ త‌గ్గుద‌ల‌త

|

ఒక ప‌క్క పారిశ్రామికోత్ప‌త్తి నిరాశ‌ప‌రిస్తే, మ‌రో వైపు రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం సెగ తాకింది.
ఈ ప‌రిణామంతో దేశీయంగా పారిశ్రామిక వ‌ర్గాలు నిరాశ చెందే అవ‌కాశం ఉంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిమాండ్ త‌గ్గుద‌ల‌తో వివిధ రంగాలు డీలా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. కేంద్ర గ‌ణాంక కార్యాల‌యం మార్చి నెల‌కు ప‌లు గ‌ణాంకాల‌ను విడుద‌ల చేసింది. తయారీ రంగంలో ప్ర‌తికూల వృద్ది కార‌ణంగా పారిశ్రామికోత్ప‌త్తి దాదాపు 4 నెల‌ల క‌నిష్ట స్థాయికి చేరింది. ఫిబ్ర‌వ‌రి నెల‌కు -1.2 శాతానికి దిగొచ్చింది.(గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో 1.99%) పారిశ్రామికోత్ప‌త్తి సూచీ(ఐఐపీ) ఆధారంగా ద్వితీయ రంగం వృద్దిని నిర్దారిస్తారు. జ‌న‌వ‌రిలో ఐఐపీ వృద్ది రేటు ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన 2.74 శాతం నుంచి 3.27%గా స‌వ‌రించారు. త‌యారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్ర‌తికూల వృద్దిరేటును న‌మోదు చేశాయి. మూల‌ధ‌న వ‌స్తువులు, వినియోగ‌దారు వ‌స్తువుల ఉత్ప‌త్తుల్లో ధోర‌ణి కూడా ఆశించిన విధంగా లేదు. మునుప‌టి ఆర్థిక సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ 11 నెల‌ల కాలంలో పారిశ్రామిక ఉత్ప‌త్తి 0.4శాతంగా న‌మోద‌యింది.

 5 నెల‌ల గ‌రిష్టానికి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం

మరో వైపు రిటైల్ ధ‌రోల్బ‌ణం ఉరుముతోంది. వినియోగ ధ‌ర‌ల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 2017 మార్చిలో 3.81%గా న‌మోద‌యింది. అంటే రిటైల్ వ‌స్తువుల్లో ధ‌ర‌ల పెరుగుద‌ల క్రితం ఏడాది మార్చి నెల‌తో పోలిస్తే ఈ సారి 3.81 శాతంగా ఉన్న‌ట్లు లెక్క‌. మార్చికి ముందు గ‌డిచిన 5 నెల‌ల కాలంలో రిటైల్ ధ‌ర‌లు పెరగ‌కుండా సామాన్యుడికి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. ఫిబ్ర‌వ‌రిలో ఈ రేటు 3.65 శాతంగా ఉంది. 2016,మార్చి నెల‌లో సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బ‌ణం 4.83 శాతంగా ఉండింది. రిటైల్ వ‌స్తువుల్లో వివిధ వ‌స్తువుల ధ‌ర‌ల మార్పు కింది విధంగా ఉంది. ఆహారోత్ప‌త్తుల్లో పాల ధ‌ర‌లు 4.69% పెరిగితే, పాల ఉత్ప‌త్తుల ద‌ర‌లు మాత్రం 3.21% ఎగిశాయి. ప్రిపేర్డ్ మీల్స్‌,స్నాక్స్‌, స్వీట్ల ధ‌ర‌లు 5.65% ప్రియ‌మ‌య్యాయి.
కూర‌గాయల‌ ధ‌ర‌లు మాత్రం 7.24 శాతం త‌గ్గుద‌ల‌ను క‌న‌బ‌రిచాయి.
ఇంధ‌నం, విద్యుత్ విభాగాల్లో ద్ర‌వ్యోల్బ‌ణం 5.65% వ‌ర‌కూ పెరిగింది.

Read more about: inflation iip
English summary

త‌గ్గిన పారిశ్రామికోత్ప‌త్తి, పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం | Retail inflation reaches five-month high and iip growth rate turns negative

In the month of February, CPI stood at 3.65% raising for the first time in seven months from 3.17% in January.The combined CPI in March was 3.81% as against 3.65 in February and 4.83% in the month of March, 2016. The rural CPI was at 3.75% in the month of March as compared to 3.67% in February and 5.70% in March, 2016. The urban CPI was at 3.88% in March as against 3.55% in February and 3.95% in March, 2016.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X