For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్ కార్ట్‌లో రూ. 9000 కోట్ల సేక‌ర‌ణ‌తో అమెజాన్‌కు చెక్ పెట్టేనా?

ఫ్లిప్‌కార్టుకు 10 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఈ కంపెనీ ఫ్యాషన్‌ రిటైల్‌ సంస్థలు మింత్రా, జబాంగ్‌తోపాటు లాజిస్టిక్స్‌ సంస్థ ఇకార్ట్‌, పేమెంట్స్‌ యాప్‌ ఫోన్‌పేలను నిర్వహిస్తోంది.టెన్సెంట్‌ విషయానికొస్త

|

ప్ర‌పంచ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ నుంచి గ‌ట్టి పోటీని ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ ఫ్లిప్‌కార్ట్ త‌న‌దైన వ్యూహాల‌తో ముందుకు వెళుతోంది. తాజాగా 140 కోట్ల డాల‌ర్ల నిధుల‌ను స‌మీక‌రించ‌డంతో సంచ‌ల‌నం సృష్టించింది. ఒక ప‌క్క క‌స్ట‌మ‌ర్ల‌కు దీటైన సేవ‌ల‌ను అందించ‌డంతో పాటు వ్యాపార విస్త‌ర‌ణ‌కు ఇది ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌ద‌ని ఈ-కామ‌ర్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా ఒప్పందం ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో ఏం జ‌ర‌గనుందో తెలుసుకుందాం.

మైక్రోసాఫ్ట్‌, టెన్‌సెంట్‌,ఈబేల నుంచి నిధుల సేక‌ర‌ణ‌

మైక్రోసాఫ్ట్‌, టెన్‌సెంట్‌,ఈబేల నుంచి నిధుల సేక‌ర‌ణ‌

కంపెనీ వెబ్‌సైట్ ఇచ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఇటీవ‌ల ఆ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేష‌న్‌, టెన్‌సెంట్ హోల్డింగ్స్‌,ఈబే నుంచి 140 కోట్ల‌ డాల‌ర్ల‌(రూ.9వేల కోట్లు)ను సేక‌రించింది.

ఇప్ప‌టిదాకా దేశంలో ఏ ఈ-కామ‌ర్స్ సంస్థ ఇంత భారీ మొత్తంలో నిధులు సేక‌రించ‌లేదు. ఈ-కామ‌ర్స్ రంగంలో స‌ర్దుబాట్లు జ‌రుగుతున్న క్ర‌మంలో ఫ్లిప్‌కార్ట్ పెద్ద మొత్తంలో నిధులు సేక‌రించ‌డం విశేషం.

 ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 1160 కోట్ల డాల‌ర్లు(11.6బిలియ‌న్ డాల‌ర్లు)

ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 1160 కోట్ల డాల‌ర్లు(11.6బిలియ‌న్ డాల‌ర్లు)

ఈ లావాదేవీ త‌ర్వాత కంపెనీ విలువ 11.6 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగిన‌ట్లు వెల్ల‌డించింది. 2015 నాటి కంపెనీ వాల్యూయేష‌న్ 15 బిలియ‌న్ డాల‌ర్ల‌తో పోలిస్తే ఇప్పుడు ఉన్న‌ది త‌క్కువే. 2008 నుంచి ఇప్ప‌టిదాకా అంత‌ర్జాతీయ పెట్టుబ‌డిదార్ల నుంచి ఫ్లిప్‌కార్ట్ 3 బిలియ‌న్ డాల‌ర్ల మేర నిధులు సేక‌రించింది.

అమెరికా ఈ-కామ‌ర్స్ సంస్థ వ్యూహ‌మేంటి?

అమెరికా ఈ-కామ‌ర్స్ సంస్థ వ్యూహ‌మేంటి?

ఒప్పందం త‌ర్వాత దేశంలో ఈబే వ్యాపార వ్య‌వ‌హారాల‌న్నీ ఫ్లిప్‌కార్టే చూసుకుంటుంది. ఈబే పెట్టిన పెట్టుబడికి ప్ర‌తిగా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఈ ప‌ని చేయ‌బోతోంది. త‌ద్వారా పూర్వ‌పు వైభ‌వాన్ని చాటుకోవాల‌ని ఈబే ప్ర‌య‌త్నంగా అనిపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు సైతం పేరెన్నిక‌గ‌న్న అంత‌ర్జాతీయ అమ్మ‌కందార్ల‌ను ఈబే ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉంది.

టెన్‌సెంట్ పెట్టుబ‌డికి కార‌ణ‌మిదే...

టెన్‌సెంట్ పెట్టుబ‌డికి కార‌ణ‌మిదే...

టెన్‌సెంట్ చైనాలో ఇంట‌ర్నెట్‌కు సంబంధించిన విలువ ఆధారిత సేవ‌ల‌ను అందించే సంస్థ‌. టెన్‌సెంట్ అధ్య‌క్షుడు మార్టిన్ లూ మాట్లాడుతూ ప్ర‌స్తుతం తాము పెట్టుబ‌డులు పెట్ట‌డం మూలంగా భార‌త్‌లో ఉన్న ఈ-కామ‌ర్స్ , చెల్లింపుల‌కు సంబంధించిన అవ‌కాశాల్లో పాలుపంచుకునేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. దేశ‌వ్యాప్తంగా ప్లిప్‌కార్ట్ వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్న‌ట్లు లూ తెలిపారు. ఈ రౌండ్ నిధుల సేక‌ర‌ణ‌తో ఫ్లిప్‌కార్ట్ ఇప్ప‌టికి సేక‌రించిన మొత్తం విలువ 3 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి చేరుకుంది.

అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొన‌గ‌ల‌దా?

అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొన‌గ‌ల‌దా?

ఈ-కామ‌ర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో జ‌పాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టింది. ఈ సంస్థ‌ను విక్ర‌యించ‌డం ద్వారా త‌న పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు రాబ‌ట్టుకోవాల‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ సేక‌రించిన నిధులు అమెజాన్‌తో పోటీ ప‌డేందుకు అవ‌కాశ‌మిస్తాయి. మ‌రో వైపు స్నాప్‌డీల్ కొనుగోలు వార్త‌లు ఈ-కామ‌ర్స్‌పై స‌రికొత్త విశ్లేష‌ణ‌ను చాటుతున్నాయి. దేశ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేయ‌నుంద‌న్న వార్త‌ల మ‌ధ్య ఈ స‌మీక‌ర‌ణం జ‌ర‌గ‌డం చూస్తుంటే ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకోవ‌చ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు న‌మ్ముతున్నాయి. ఒక‌వేళ స్నాప్‌డీల్ కొనుగోలు సాకారం అయితే భార‌త ఈ-కామ‌ర్స్ రంగంలో అతిపెద్ద కొనుగోలు ఇదే కాగ‌ల‌దు.

పెట్టుబ‌డి పెట్టిన సంస్థ‌ల గురించి

పెట్టుబ‌డి పెట్టిన సంస్థ‌ల గురించి

ఈబే అమెరికా ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న అంత‌ర్జాతీయ ఈ-కామ‌ర్స్ సంస్థ‌. ఇక‌పై భార‌త్‌లో ఈబే కార్య‌క‌లాపాల‌న్నీ ఫ్లిప్‌కార్ట్ చేతిలోకి వ‌స్తాయి. ఈబే వ్యాపార‌మంతా ఫ్లిప్‌కార్ట్ సీఈవో క‌ల్యాణ్ క్రిష్ణ‌మూర్తికి నివేదించాల్సి ఉంటుంది. అయితే అది స్వ‌తంత్ర సంస్థ‌గానే వ్య‌వ‌హరిస్తుంద‌ని సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. టెన్‌సెంట్ చైనాలో ప్ర‌ముఖ ఇంట‌ర్నెట్ విలువ ఆధారిత సేవ‌ల కంపెనీ. 2004లో టెన్‌సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప‌బ్లిక్ ఇష్యూకి వెళ్లింది. మ‌రో సంస్థ మైక్రోసాఫ్ట్ ప్ర‌పంచ టెక్నాల‌జీ దిగ్గజం. ప్ర‌స్తుతం ఈ సంస్థ సీఈవోగా స‌త్య నాదెళ్ల ఉన్నారు. 2016 నాటికి ఈ దిగ్గ‌జ కంపెనీ రెవెన్యూ 85.32 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

జ‌ర‌గ‌బోయేదేమిటి?

జ‌ర‌గ‌బోయేదేమిటి?

తాజాగా మైక్రోసాఫ్ట్‌, చైనాకు చెందిన టెన్సెంట్‌, ఇబే నుంచి నిధులు అందడంతో అమెరికా ఇంటర్నెట్‌ దిగ్గజం అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్‌ భారతదేశంలో గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్టుకు 10 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఈ కంపెనీ ఫ్యాషన్‌ రిటైల్‌ సంస్థలు మింత్రా, జబాంగ్‌తోపాటు లాజిస్టిక్స్‌ సంస్థ ఇకార్ట్‌, పేమెంట్స్‌ యాప్‌ ఫోన్‌పేలను నిర్వహిస్తోంది.టెన్సెంట్‌ విషయానికొస్తే.. మెసేజింగ్‌ యాప్‌ వీచాట్‌ను ఈ సంస్థనే అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ భారతలోని ప్రాక్టో, ఇబిబో వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది.

ఫ్లిప్‌కార్ట్‌ గురించి..

ఫ్లిప్‌కార్ట్‌ గురించి..

అమెజాన్ మాజీ ఉద్యోగుల చేత బెంగళూరు కేంద్రంగా 2007 సెప్టెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ఏర్పాటైంది. బిన్సీ బన్సాల్‌, సచిన్‌ బన్సాల్ దీని వ్య‌వ‌స్థాప‌కులు. 2016 సంవత్సరంనాటికి ఈ కంపెనీ రాబడి 15,130 కోట్ల రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే యుఎస్‌ హెడ్జ్‌ ఫండ్‌ టైగర్‌ గ్లోబల్‌తోపాటు యాక్సెల్‌ పార్ట్‌నర్స్‌, డిఎ్‌సటి గ్లోబల్‌, బైలీ గిఫర్డ్‌ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి క‌ల్యాణ్ కృష్ణ‌మూర్తిని ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా నియ‌మించారు.

Read more about: flipkart ebay microsoft ecommerce
English summary

ఫ్లిప్ కార్ట్‌లో రూ. 9000 కోట్ల సేక‌ర‌ణ‌తో అమెజాన్‌కు చెక్ పెట్టేనా? | flipkart rised 9000 crores from investors

"I must stress that we still have some distance to go before fulfilling our mission - to transform commerce in India through technology. And, while this funding round provides the fuel we need to reach that goal, we have to continue growing our business with careful considerations to costs," he said in a mail shot-off to his employees after raising $1.4 billion from Tencent Holdings, Microsoft Corp and eBay Inc.Flipkart Co-founder Binny Bansal today said while the latest funding round provides the fuel the company needs to reach its goal of transforming commerce in India through technology, it should continue to grow its business with careful considerations to costs.
Story first published: Tuesday, April 11, 2017, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X