For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల ర‌ద్దుపై ఆంక్ష‌ల స‌డ‌లింపు: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి

కరెంటు ఖాతా/ క్యాష్ క్రెడిట్ ఎకౌంట్స్ / ఓవర్ డ్రాఫ్ట్ ఖాతానుంచి ఏటీఎంల వద్ద డ్రా చేసే నగదుపై పరిమితులు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. ప్రస్తుతం పొదుపు ఖాతా(సేవింగ్స్ అకౌంట్స్‌)పై ఉన్న వారానికి

|

పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఎటీఎంల వద్ద నగదు ఉపసంహరణలపై పరిమితులు విధించిన రిజ‌ర్వ్ బ్యాంకు తాజాగా పౌరులకి షరతులతో తీపిక‌బురు వెలువ‌రించింది. ఫిబ్రవరి 1 నుంచి ఏటీఎంల వద్ద డ్రా చేసే నగదుపై ఎటువంటి పరిమితులు లేవని తాజాగా ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ చిన్న మొలిక పెట్టింది. అదేంటంటే పొదుపు ఖాతా(సేవింగ్స్ అకౌంట్స్‌)ల నుంచి డ్రా చేయబోయే నగదుపై మాత్రం ప్రస్తుతానికి వున్న పరిమితి యధావిధిగా కొనసాగుతుందని కేంద్ర బ్యాంకు ఈ ప్రకటనలో స్పష్టంచేసింది.

RBI lifts cash withdrawal limits from ATMs from February 1

కరెంటు ఖాతా/ క్యాష్ క్రెడిట్ ఎకౌంట్స్ / ఓవర్ డ్రాఫ్ట్ ఖాతానుంచి ఏటీఎంల వద్ద డ్రా చేసే నగదుపై పరిమితులు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. ప్రస్తుతం పొదుపు ఖాతా(సేవింగ్స్ అకౌంట్స్‌)పై ఉన్న వారానికి రూ.24,000 విత్ డ్రాయల్ పరిమితిని యధావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇది కూడా చ‌ద‌వండి దేశానికి మొద‌టి నుంచి ఆర్థిక మంత్రులుగా ప‌నిచేసిన వాళ్లు వీళ్లే...

భవిష్యత్తుల్లో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి రూ.24 డ్రా చేసుకునే అవకాశమే ఉంది. 2017-18కి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీనే కరెంట్ ఖాతాదారులకు ఈ నిబంధనలు ఎత్తివేయడం విశేషం. అయితే జనవరి 16న కరెంటు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి వారానికి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలను ప్రస్తుతం పూర్తిగా ఎత్తివేశారు.

Read more about: rbi currency notes
English summary

నోట్ల ర‌ద్దుపై ఆంక్ష‌ల స‌డ‌లింపు: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి | RBI lifts cash withdrawal limits from ATMs from February 1

ATM cash withdrawal limits will be removed completely from Feb 1 ATM caps will be removed completely from Feb 1
Story first published: Monday, January 30, 2017, 19:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X