వారానికి రూ.24 వేలు తీసుకోవ‌చ్చు

పెట్రోల్‌ బంకులు, ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో నవంబర్‌ 24 వరకు పాతనోట్లు చెలామణి అవుతాయని ప్రకటించింది. నవంబర్‌ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం

పాత నోట్ల రద్దుతో కష్టాలు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కాస్త వూరట కలిగించింది. పెట్రోల్‌ బంకులు, ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో నవంబర్‌ 24 వరకు పాతనోట్లు చెలామణి అవుతాయని ప్రకటించింది. నవంబర్‌ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసింది.
పాతనోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల ఏటీఎమ్‌ల్లో న‌గ‌దు నింపిన కొద్దిసేప‌టికే ఖాళీ అవుతోంది.

వారానికి రూ.24 వేలు తీసుకోవ‌చ్చు

ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం నోట్ల మార్పిడి.. నగదు ఉపసంహరణలో కాస్త వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.
* రూ.500, రూ.1000 పాతనోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు పరిమితి రూ.4000 నుంచి రూ.4,500కు పెంచింది.
*ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు రూ.2000 నుంచి రూ.2,500కి పెంచింది.
* బ్యాంకు కౌంటర్ల నుంచి ఒక వారంలో తీసుకోగలిగే నగదు పరిమితి రూ.20,000 నుంచి రూ.24,000కు పెంచింది. ఈ మొత్తాన్ని రోజుకు గరిష్ఠంగా రూ.10,000 చొప్పున తీసుకోవచ్చనే పరిమితి తొలగించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+