For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 500, రూ. 1000 నోట్ల ర‌ద్దు క‌స‌ర‌త్తుకు కార‌ణ‌మెవ‌రు?

ఈ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసేందుకు వెనుక కార‌ణం ఒక వ్య‌క్తి అంటే మీరు న‌మ్మ‌గ‌ల‌రా? మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఇది నిజం. ప్ర‌ధాన‌మంత్రి నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డానికి వెనుక ఒక వ్య‌క్తి ఆలోచ‌న దాగి ఉంది.

|

ఈ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసేందుకు వెనుక కార‌ణం ఒక వ్య‌క్తి అంటే మీరు న‌మ్మ‌గ‌ల‌రా? మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఇది నిజం. ప్ర‌ధాన‌మంత్రి నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డానికి వెనుక ఒక వ్య‌క్తి ఆలోచ‌న దాగి ఉంది. ఆయ‌న పేరు అనిల్ బొకిల్‌. పుణెకు చెందిన ఆర్థిక వ్య‌వ‌హారాల సంస్థ అర్థ‌క్రాంతి సంస్థ స్థాప‌కుడత‌ను. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో న‌ల్ల‌ధనాన్ని అడ్డుక‌ట్ట వేసేందుకు అత‌నొక విధానాన్ని సూచించాడు.
ప్ర‌ధాని మోదీ అత‌నికి మొద‌ట మాట్లాడేందుకు 9 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చాడు. అత‌ని ఆలోచ‌న‌లు విన్న త‌ర్వాత అవి ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో ఆ చ‌ర్చ రెండు గంట‌ల పాటు న‌డిచింది.

ఆయ‌న సూచించిన మ‌రికొన్ని అంశాలు:

ఆయ‌న సూచించిన మ‌రికొన్ని అంశాలు:

* దిగుమ‌తి సుంకం త‌ప్ప మిగిలిన అన్ని ర‌కాల ప‌న్నుల‌ను తొల‌గించాలి.

* 100 రూపాయ‌ల‌తో పాటు రూ. 500, రూ. 1000 వంటి పెద్ద నోట్ల‌ను నిషేధించాలి.

* అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా జ‌ర‌గాలి.(చెక్కులు, డీడీ, ఆన్‌లైన్ మార్గాల్లో)

* రెవెన్యూ సేక‌ర‌ణ‌కు ఏకీకృత బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఉండాలి.

లెక్క చూపాల్సిందే

లెక్క చూపాల్సిందే

మన దేశంలో సగటున రోజుకు 2.7లక్షల కోట్లు చేతులు మారుతున్నాయని, దీని ప్రకారం సంవత్సరానికి 800 లక్షల కోట్ల ధనాన్ని వినియోగిస్తున్నారని అనిల్ చెప్పారు. వీటిల్లో కేవలం 20శాతం మాత్రమే బ్యాంకుల ద్వారా డబ్బు వినియోగదారుడికి చేరుతుందని, మిగిలిన డబ్బుకు లెక్కలు చూపించాల్సిన పనిలేక పోవడంతో నల్ల కుబేరులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతుందని అనిల్ ప్రధానికి వివరించారట. అధికారిక లెక్కల ప్రకారం దేశ జనాభాలో 78 శాతం ప్రజలు రోజుకు 200 రూపాయలు మాత్రమే ఖర్చుపెడుతున్నారని, అందువల్ల పెద్ద నోట్ల అవసరం చాలామందికి లేదని ఆయన మోదీకి సూచించారట.

అవినీతికి అడ్డుక‌ట్ట వేయవ‌చ్చు

అవినీతికి అడ్డుక‌ట్ట వేయవ‌చ్చు

దేశంలోని మొత్తం ప్రజలు కట్టే పన్ను ఒక్కటే ఉన్న‌ప్పుడు వినియోగదారుని ఖాతా నుంచి బ్యాంకులు ఈ పన్నును మినహాయించి ప్రభుత్వానికి కట్టేస్తాయన్నారు. ఎగుమతి, దిగుమతి పన్నులు మినహాయించి అన్ని రకాల పన్నులను పూర్తిగా రద్దు చేయడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అనిల్ బొకిల్ వాదిస్తున్నారు. అంతేకాకుండా రూ.2 వేల లోపు లావాదేవీలు మాత్రమే నగదు రూపంలో జరగాలని, అంతకుమించిన లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిగేలా ప్రభుత్వం నియంత్రించాలని సూచిస్తున్నారు. దీనిద్వారా దేశంలోని అవినీతినికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు

అర్థ‌క్రాంతి అమ‌లు చేస్తే ప్ర‌యోజ‌నాలు

అర్థ‌క్రాంతి అమ‌లు చేస్తే ప్ర‌యోజ‌నాలు

*అర్థక్రాంతి అమలుతో అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.

*పన్నుల వ్యవస్థ బలహీనత, దొంగనోట్ల సమస్యలుండవు.

*ప్రజలపై పన్నుల భారం తొలగిపోతుంది.

*తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయి.

Read more about: currency notes
English summary

రూ. 500, రూ. 1000 నోట్ల ర‌ద్దు క‌స‌ర‌త్తుకు కార‌ణ‌మెవ‌రు? | Man behind Demonitisation of 500, 1000 notes ban

ArthaKranti founder Anil Bokil formed the ArthaKranti proposal which called for withdrawal of high denomination currency and the existing taxation system except for customs and import duties, routing all transactions through a bank and levying a bank transaction tax (2%)
Story first published: Thursday, November 10, 2016, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X