For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబ‌ర్‌లో వ‌రుస‌గా బ్యాంకు సెల‌వులు

|

అక్టోబ‌ర్ మాసం పండుగ‌ల సీజ‌న్ కావ‌డంతో బ్యాంకుల‌కు వ‌రుస సెల‌వులు వ‌స్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ‌రుస సెలవులతో న‌గ‌దు డిపాజిట్ చేసేవారికి, చెక్కులు డ్రా చేసే వారికి సైతం ఇబ్బందులు క‌ల‌గ‌వ‌చ్చు. దీంతో ముందుగానే ఈ వ‌రుస సెలవులను దృష్టిలో ఉంచుకుని త‌గిన ఏర్పాట్లు చేసుకోండి.
క‌ర్ణాట‌క‌లో అక్టోబ‌ర్ 8,9,10.11,12 వ‌రుస‌గా బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. దాని త‌ర్వాత మ‌ళ్లీ రెండు రోజులు 13,14 మాత్ర‌మే బ్యాంకుల‌కు ప‌నిదినాలు. దాని త‌ర్వాత మ‌ళ్లీ వాల్మీకి జ‌యంతి సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లో బ్యాంకుల‌కు 15 సెల‌వు. 16 వ తేదీ ఆదివారం బ్యాంకులు ప‌నిచేయవు.

రెండో శ‌నివారం, ఆదివారం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో 8,9 వ‌రుస సెల‌వులు. త‌ర్వాత 10వ తేదీ బ్యాంకులు ప‌నిచేస్తాయి. మ‌ళ్లీ విజ‌య‌ద‌శ‌మి, మొహ‌రం సంద‌ర్భంగా 11,12 తేదీల్లో సెల‌వు. త‌ర్వాత వ‌రుస‌గా బ్యాంకులు మామూలుగా ప‌నిచేస్తాయి. 22 వ తేదీ నాలుగో శ‌నివారం సంద‌ర్భంగా సెల‌వు. అక్టోబ‌ర్ 30 దీపావ‌ళి ఉన్న‌ప్ప‌టికీ ఆ రోజు ఎలాగో ఆదివారం కాబ‌ట్టి స‌మ‌స్య లేదు.

banki holidays

బ్యాంకు సెల‌వులు వారి సంస్కృతి, ప్రాంతీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మారుతూ ఉంటాయి.
బ్యాంకు సెలవులు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి.
https://www.goodreturns.in/bank-holidays.html

వ‌రుస సెల‌వులు ఉన్న‌ప్పుడు, మ‌రీ ఇది పండ‌గ సీజ‌న్ కాబ‌ట్టి ఒక్కోసారి హ‌ఠాత్తుగా కొన్ని ఏటీఎమ్‌ల్లో డ‌బ్బులు తొంద‌ర‌గా అయిపోవ‌చ్చు. కాబ‌ట్టి సెలవుల‌ను బ‌ట్టి మీ విత్‌డ్రా ప్లాన్‌ల‌ను చేసుకునేందుకు ప్ర‌య‌త్నించండి. సాధ్య‌మైనంత వ‌ర‌కూ మొబైల్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌ల‌ను వాడితే మంచిది.

Read more about: bajaj sbi andhra bank
English summary

అక్టోబ‌ర్‌లో వ‌రుస‌గా బ్యాంకు సెల‌వులు | continuous bank holidays in Karnataka

With festivals falling in the month of October there are chances that some states may observe a series of bank holidays for as many as four consecutive days including second Saturday and Sunday
Story first published: Wednesday, October 5, 2016, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X