English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

గృహ రుణం తీసుకునేట‌ప్పుడు చేయ‌కూడ‌ని త‌ప్పులు

Posted By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు చిన్న త‌ప్పులు చేయ‌డం వ‌ల్ల కూడా ఒక్కోసారి రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది. మార్కెట్‌లో వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో రుణ ద‌ర‌ఖాస్తు త్వ‌రితగ‌తిన పూర్త‌యితే బాగా ఉంటుంది. వివిధ రుసుముల‌ను చూసుకుని ఈఎమ్ఐల రూపంలో రుణ చెల్లింపున‌కు అంగీక‌రించి రుణ ద‌ర‌ఖాస్తును పూర్తిచేసేందుకు రుణ గ్ర‌హీత‌లు ప్ర‌య‌త్నిస్తారు.

చాలా గృహ రుణాల‌కు మొద‌ట్లో డౌన్ పేమెంట్ త‌ప్ప‌నిస‌రి. డౌన్ పేమెంట్ అంటే రుణ గ్ర‌హీత మొద‌టిసారి చెల్లించే నిర్దిష్ట‌మొత్తం. రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌కూడ‌దు అనుకుంటే చిన్న చిన్న త‌ప్పులు చేయ‌కూడ‌దు. అలాంటి జాబితాను ఇక్క‌డ చూద్దాం.

 వివిధ బ్యాంకుల్లో విచారించ‌క‌పోవ‌డం

వివిధ బ్యాంకుల్లో విచారించ‌క‌పోవ‌డం

బ‌స్సు టిక్కెట్ కొనేట‌ప్పుడు ఆఫ‌ర్ల‌ కోసం చూడ‌టం మామూలే క‌దా. అలాంటిది జీవిత కల అయిన ఇల్లు కొనేట‌ప్పుడు ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే మ‌న‌కు మంచిదో విచారించ‌డం ముఖ్యం. దీర్ఘ‌కాలంలో చెల్లింపుల‌న్నీ క‌లిపి చూస్తే .25 శాతం వ‌డ్డీ రేటు త‌గ్గినా రుణ చెల్లింపు కాస్త త‌క్కువ‌వుతుంది. అందుకే వివిధ ఆన్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా, స్థిరాస్తి క‌న్స‌ల్టెంట్ల ద్వారా వివిధ బ్యాంకుల వ‌డ్డీ రేట్ల‌ను, బ్యాంకు సేవ‌లు ఎలా ఉంటాయో విచారించ‌డం ముఖ్యం. అన్నీ బేరీజు వేసుకున్న త‌ర్వాత రుణ ద‌రఖాస్తు ప్ర‌క్రియ మొద‌లుపెట్టండి.

క్రెడిట్ స్కోర్ చూసుకోక‌పోవ‌డం

క్రెడిట్ స్కోర్ చూసుకోక‌పోవ‌డం

రుణం అంటేనే ఎవ‌రికైనా గుర్తొచ్చేది క్రెడిట్ స్కోర్‌. గృహ రుణం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు బ్యాంకుల‌న్నీ త‌ప్ప‌నిస‌రిగా క్రెడిట్ స్కోర్‌ను చూసే ముందుకెళ‌తాయి. క్రెడిట్‌స్కోర్ త‌గినంత లేక‌పోతే తిప్ప‌లు త‌ప్ప‌వు. మీ క్రెడిట్ స్కోర్ త‌క్కువ ఉంద‌ని తెలిస్తే దాన్ని మెరుగుప‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. త‌ర్వాత రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయాలి. సిబిల్‌, ఎక్స్‌పీరియ‌న్‌, ఈక్విఫాక్స్‌, హైమార్క్ వంటి సంస్థ‌లు వ్య‌క్తుల క్రెడిట్ హిస్ట‌రీ, స్కోర్ల‌ను అంద‌జేస్తున్నాయి.

బ్యాంకు స‌ర్వీస్ గురించి విచారించ‌క‌పోవ‌డం

బ్యాంకు స‌ర్వీస్ గురించి విచారించ‌క‌పోవ‌డం

కొన్ని బ్యాంకులు రుణం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్ప‌టి నుంచి మంజూరు చేసేవ‌ర‌కూ వినియోగ‌దారుల‌తో బాగానే వ్య‌వ‌హ‌రిస్తాయి. త‌ర్వాత నుంచి బ్యాంకు వైపు నుంచి మీ ప్ర‌శ్న‌ల‌కు, సందేహాలకు స‌రైన స‌మాధానాలుండ‌వు. ఈ నేప‌థ్యంలో వ‌డ్డీ రేటు గురించే ఆలోచించ‌కుండా ముంద‌స్తు రుణంచెల్లింపు చార్జీలు, న్యాయ‌ప‌ర‌మైన రుసుములు, ప్రాసెసింగ్ ఫీజు లాంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ బ్యాంకు సేవ‌లు ఎలా ఉన్నాయో విచారించి ముందుకెళ్లాల్సి ఉంటుంది.

 ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్‌

ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్‌

ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్ ప్ర‌ధాన ప్ర‌యోజ‌నం ఏంటంటే ఎంత రుణం పొంద‌వ‌చ్చో ముందే తెలిసిపోతుంది. మీ అర్హ‌త‌ను బ‌ట్టి వ‌డ్డీ రేటులో త‌గ్గింపును కోర‌వ‌చ్చు. ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్ కోసం బ్యాంకులు మిమ్మ‌ల్ని సంప్ర‌దించిన‌ప్పుడు దాని గురించి ఆన్‌లైన్‌లో విచారించండి. వ‌డ్డీ రేటు విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించండి.

 అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎక్కువ తీసుకోవ‌డం

అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎక్కువ తీసుకోవ‌డం

బ్యాంకులు మీరు ఎంత వ‌ర‌కూ రుణం పొందేందుకు అర్హ‌త ఉందో తెలుపుతాయి. అలా అని అంత రుణం తీసుకోమ్మ‌ని కాదు. మీకు ఎంత అవ‌స‌ర‌మో అంత రుణం మాత్ర‌మే తీసుకోవ‌డం సూచ‌నీయం. మీ మిగిలిన పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు, అప్పులు, ఈఎమ్ఐలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గృహ‌రుణం తీసుకోండి.

 రుణ ఒప్పంద ప్ర‌తం చ‌ద‌వ‌క‌పోవ‌డం

రుణ ఒప్పంద ప్ర‌తం చ‌ద‌వ‌క‌పోవ‌డం

గృహ రుణం తీసుకునేట‌ప్పుడు చాలా ప‌త్రాలు ఉంటాయి. అన్నింటిపై సంత‌కాలు చేయాలి. అలా చేసేట‌ప్పుడు వ‌రుస‌గా ఎక్క‌డెక్క‌డ సంత‌కాలు చేయాలో అడిగి సంత‌కం చేయ‌డం మంచిదికాదు. ఇల్లు జీవిత స్వ‌ప్నం కాబ‌ట్టి దాని రుణానికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునేట‌ప్పుడు స‌మ‌యం కేటాయించ‌డం ముఖ్యం. అన్నింటినీ చ‌దివి అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించి సంత‌కాలు చేయ‌డం మంచిది.

కొత్త అప్పులు

కొత్త అప్పులు

క్రెడిట్ కార్డు అప్పులు లేదా వ్య‌క్తిగ‌త రుణాలు ఇది వ‌ర‌కే తీసుకొని మ‌ళ్లీ కొత్త అప్పుల కోసం వెళ్లేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. గృహ రుణం తీసుకునేముందు ఎక్కువ అప్పులు లేకుండా చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి ఎక్కువ అప్పులు ఉండ‌టం శ్రేయ‌స్క‌రం కాదు.

 గృహ రుణానికి బీమా తీసుకోక‌పోవ‌డం

గృహ రుణానికి బీమా తీసుకోక‌పోవ‌డం

గృహ రుణం తీసుకునేట‌ప్పుడు స్వ‌ల్ప ప్రీమియం చెల్లించ‌డం ద్వారా దానికి సంబంధించి బీమాను తీసుకోవ‌చ్చు. అనుకోకుండా రుణ గ్ర‌హీత‌కు ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళుతుంది. ఒక‌వేళ బీమా తీసుకోకుండా రుణం తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే వారి కుటుంబ స‌భ్యులు రుణం తీర్చాల్సి వ‌స్తుంది. అదే బీమా ఉంటే స‌మస్య ఉండ‌దు.

Read more about: home loan, గృహ రుణం
English summary

Home loan safety tips for borrowers

In a falling interest rate regime, home loan borrowers tend to benefit and can make the best use of it by choosing the right bank and loan option. Many individuals apply for a home loan only to realize that their application is rejected due to some error which could have been avoidedHere by reading all these you can avoid common mistakes done by home loan
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC