For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌న్ను రిట‌ర్నుల‌ను ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో ధ్రువీక‌రించండిలా...

|

ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో ప‌న్ను రిట‌ర్నుల ధ్ర‌వీక‌ర‌ణ ఇప్పుడు మ‌రింత సుల‌భ‌త‌ర‌మైంది. రాను రాను ఆదాయ‌పు ప‌న్ను శాఖ సాధ్య‌మైనంత‌గా డిజిట‌ల్ రూపాంత‌రం చెందుతోంది. ప‌న్ను చెల్లింపుదార్ల‌ను ఆన్‌లైన్ బాట ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. గ‌తంలో ఐటీఆర్‌5ను ప్రింట్ తీసి బెంగుళూరుకు పంపాల్సి వ‌చ్చేది. దాన్ని సైతం ఆన్‌లైన్‌లో ధ్రువీక‌రించేందుకు(వెరిఫై) కొత్తగా ఆన్‌లైన్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.
ఆన్‌లైన్ ఈఫైలింగ్ చేసేట‌ప్పుడు ఈవీసీ అనే 10 అంకెల ఆల్ఫా న్యూమ‌రిక్ సంఖ్య మీ న‌మోదిత మొబైల్ నంబ‌రుకు వ‌స్తుంది. గ‌తంలో ఇందుకోసం నాలుగు ఆప్ష‌న్లుండ‌గా ప్ర‌స్తుతం అవి ఆరుకు పెరిగాయి. అవేంటో చూద్దాం.

 1) నెట్‌బ్యాంకింగ్‌

1) నెట్‌బ్యాంకింగ్‌

త‌మ బ్యాంకు క‌ల్పించిన సౌక‌ర్యాన్ని బ‌ట్టి వినియోగ‌దారులు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్లో వెరిఫై చేసుకోవ‌చ్చు. మొద‌ట లాగిన్‌, పాస్‌వ‌ర్డ్‌తో నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వాలి. త‌ర్వాత ఈ-ఫైలింగ్‌కు రీడైరెక్ట్ చేసుకోవాలి. ఈ ద‌శ‌లో మీరు ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఇండియా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ‌తారు. అక్క‌డ పెండింగ్ యాక్ష‌న్స్‌ను క్లిక్ చేయాలి. త‌ర్వాత ఈ-వెరిఫై ప్ర‌క్రియ‌ను ఎంపిక చేసుకుని దాన్ని పూర్తి చేసి క‌న్‌ఫ‌ర్మ్ అని నొక్కాలి. ఇది పూర్త‌యితే న‌మోదిత మొబైల్ నంబ‌రుకు ఈవీసీ వ‌స్తుంది.

 2) ఆధార్ అథెంటికేష‌న్‌

2) ఆధార్ అథెంటికేష‌న్‌

పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసి సైతం ఈ-ఫైలింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయొచ్చు. ఇది మీ పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివ‌రాల ఆధారంగా వెరిఫికేష‌న్ ప్రక్రియ‌ను ముగిస్తుంది.

ఒక‌సారి ధ్రువీక‌ర‌ణ విజ‌య‌వంత‌మైతే ఆధార్ పాన్‌తో అనుసంధాన‌మ‌వుతుంది. యూఐడీఏఐ ద్వారా మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.

3) ఆటోమేటిక్ టెల్ల‌ర్ మెషీన్‌(ఏటీఎమ్‌)

3) ఆటోమేటిక్ టెల్ల‌ర్ మెషీన్‌(ఏటీఎమ్‌)

మామూలుగా మ‌న బ్యాంకు ఏటీఎమ్ ద్వారా సైతం ప‌న్ను రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను ముగించ‌వ‌చ్చు. ఏటీఎమ్ పిన్ ఎంట‌ర్ త‌ర్వాత ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. ఆప్ష‌న్ల‌లో ప‌న్ను చెల్లింపుదారు 'జ‌న‌రేట్ ఈవీసీ ఫ‌ర్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్' అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకులు ప్ర‌స్తుతం ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి.

4) ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌

4) ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌

రూ. 5 ల‌క్ష‌లు, అంత‌క‌న్నా త‌క్కువ ఆదాయం క‌లిగిన వారు ఈ-ఫైలింగ్ ప్ర‌క్రియ మొత్తాన్ని ఈవీసీ ద్వారా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోనే పూర్తి చేయ‌వ‌చ్చు. ఒక‌సారి అది పూర్త‌యితే న‌మోదిత మెయిల్; మొబైల్ నంబ‌ర్ల‌కు స‌మాచారం వ‌స్తుంది.

5) బ్యాంకు ఖాతా వివ‌రాలు

5) బ్యాంకు ఖాతా వివ‌రాలు

నెట్ బ్యాంకింగ్ అనుకూలంగా లేనివారు ఈ విధానాన్ని ఎంచుకోవ‌చ్చు. ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన త‌ర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఇక్క‌డ బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, ఈమెయిల్, మొబైల్ నంబ‌రు వివ‌రాలు స‌మ‌ర్పించ‌డం ద్వారా ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.ఈ వివ‌రాల‌న్నీ పాన్‌కార్డులో ఉన్న వివ‌రాల‌తో పోల్చి ధ్ర‌వీక‌రిస్తారు.

దీని త‌ర్వాత మొబైల్ నంబ‌రుకు ఈవీసీ వ‌స్తుంది.

6) డీమ్యాట్ ఖాతా

6) డీమ్యాట్ ఖాతా

ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్లోకి లాగిన్ అవ్వండి. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్క‌డ ప్రీవ్యాలిడేట్ డీమ్యాట్ ఆప్ష‌న్‌ను ఎంచుకోండి. డీపీ ఐడీ, క్లైంట్ ఐడీ, మొబైల్ నంబ‌రు, ఈమెయిల్ ఐడీ వంటి వివ‌రాల‌ను నింపి ప్రీవ్యాలిడెట్‌ను నొక్కండి.

డిపాజిట‌రీ వివ‌రాల‌ను నిర్దారించిన త‌ర్వాత‌, డీమ్యాట్ వివ‌రాల ధ్రువీక‌ర‌ణ పూర్త‌వ‌డంతో పాటు, ఈవీసీ వ‌స్తుంది.

English summary

ప‌న్ను రిట‌ర్నుల‌ను ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో ధ్రువీక‌రించండిలా... | verify your tax returns electronically

The Income tax department has become increasingy digital savvy with each day and encouraging tax payers to file tax returns online. Last year, the tax department gave an option to replace the process of sending ITR-V form to CPC by giving various options to verify returns online. Online e filing the returns also called as Electronic Verification Code (EVC) is a 10 digit alpha-numeric number (one-time password) sent to registered mobile number filing returns online.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X