For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో కిసాన్ వికాస్ ప‌త్ర‌, జాతీయ పొదుపు ప‌త్రాలు

|

దేశంలోనే ప్రాముఖ్య‌త గాంచిన పోస్టాఫీసు ప‌థ‌కాలైన కిసాన్ వికాస్ ప‌త్ర‌(కేవీపీ), జాతీయ పొదుపు ప‌త్రాలు(ఎన్ఎస్‌సీ) ప్ర‌స్తుతం ఎల‌క్ట్రానిక్ రూపంలో ల‌భిస్తున్నాయి. కిసాన్ వికాస పత్రాలు ప్ర‌స్తుతానికి రూ. 1000 నుంచి రూ. 50 వేల మొత్తాల్లో ల‌భిస్తున్నాయి. వీటిని ఏ పోస్టాఫీసునుంచైనా లేదా బ్యాంకునుంచైనా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ స‌ర్టిఫికెట్ల జారీ త‌ర్వాత రెండున్న‌రేళ్ల నుంచి న‌గ‌దు రూపంలో మార్చుకునే వీలుంది. వీటిని ఎల‌క్ట్రానిక్ రూపంలోకి మార్చిన త‌ర్వాత ఏ అంశాల‌ను గ‌మ‌నించాలో తెలుసుకుందాం.
బ్యాంకు నుంచి రుణం పొందేట‌ప్పుడు జాతీయ పొదుపు ప‌త్రాల‌ను హామీగా ఉంచే అవ‌కాశం ఉంది. రూ. 1 ల‌క్ష 50 వేల వ‌ర‌కూ పెట్టే పెట్టుబ‌డులకు సెక్ష‌న్ 80సీ కింద ఆదాయ‌పు పన్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

 కొత్త సీరియ‌ల్ నంబ‌రు(క్ర‌మ సంఖ్య‌)

కొత్త సీరియ‌ల్ నంబ‌రు(క్ర‌మ సంఖ్య‌)

ఒక‌సారి స‌ర్టిఫికెట్ ఎల‌క్ట్రానిక్ రూపంలోకి మారిన త‌ర్వాత కొత్త సీరియ‌ల్ నంబ‌రును కేటాయిస్తారు. ఇందులో ఎలాంటి స్పేసింగ్ కానీ హైఫ‌న్స్ కానీ ఉండ‌వు.

 నెట్ బ్యాంకింగ్‌

నెట్ బ్యాంకింగ్‌

ఈ ర‌క‌మైన ప‌లు సేవ‌ల‌ను పొందేందుకు పెట్టుబ‌డిదారులు నెట్‌బ్యాంకింగ్ స‌ర్వీసుల‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 నాన్‌-సీబీఎస్ శాఖ‌లు(కోర్ బ్యాంకింగ్ లేని శాఖ‌లు)

నాన్‌-సీబీఎస్ శాఖ‌లు(కోర్ బ్యాంకింగ్ లేని శాఖ‌లు)

కోర్ బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులో లేని పోస్టాఫీసు శాఖ‌లు ఎన్ఎస్‌సీ, కేవీపీ ప‌త్రాల‌ను పాస్‌పుస్త‌కం రూపంలో మాత్ర‌మే అందిస్తాయి.

ఖాతాలు

ఖాతాలు

ఈ ఎల‌క్ట్రానిక్ రూపంలో స‌ర్టిఫికెట్ పొందే స‌దుపాయం బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతాలు ఉన్న‌వారికి మాత్ర‌మే ఉంది.

 పాస్‌బుక్ మోడ్‌, ఈ-మోడ్

పాస్‌బుక్ మోడ్‌, ఈ-మోడ్

పాస్‌బుక్ మోడ్; ఈ-మోడ్ రెండింటిలో ఏదో ఒక‌దాన్ని ఎంచుకునే అవ‌కాశం వ్య‌క్తుల‌కు ఉంటుంది. అయితే ఈ మోడ్‌ను ఒక అభ్య‌ర్థ‌న చేత ఎప్పుడైనా మార్చుకునేందుకు వీలు ఉంది.

 కిసాన్ వికాస్ ప‌త్ర‌, జాతీయ పొదుపు ప‌త్రాల బ‌దిలీ

కిసాన్ వికాస్ ప‌త్ర‌, జాతీయ పొదుపు ప‌త్రాల బ‌దిలీ

ఏ శాఖ‌లో అయితే ఈ ప‌త్రాల కోసం ద‌ర‌ఖాస్తు చేశారో అక్క‌డే బ‌దిలీ కోసం అభ్య‌ర్థించ‌వ‌చ్చు. ఈ రెండు ప‌త్రాల‌ను ఒక‌రి పేరు నుంచి మ‌రొక‌రి పేరు మీద‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం అందుకు సంబంధించిన పాస్‌బుక్‌, ఇత‌ర ప‌త్రాలు స‌మ‌ర్పిస్తే కొత్త స‌ర్టిఫికెట్‌ను జారీ చేస్తారు.

 ముందే ప్రింట్ చేసిన ఎన్ఎస్‌సీ, కేవీపీ

ముందే ప్రింట్ చేసిన ఎన్ఎస్‌సీ, కేవీపీ

ఇంత‌కు ముందే జారీ చేసిన ప‌త్రాల‌ను కొనుగోలు చేసి ఉండి మీరు వాటిని పోగొట్టుకుని ఉంటే, మీరు పాస్‌బుక్ మోడ్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు.

English summary

ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో కిసాన్ వికాస్ ప‌త్ర‌, జాతీయ పొదుపు ప‌త్రాలు | Kissan Vikas Patra, NSC Now In Electronic Mode

Kisan Vikas Patra (KVP) and National Savings Certificate (NSC) are popular post office schemes which will now be issued in electronic form. As of now, KVP certificates have denominations from Rs 1,000 to Rs 50,000. KVP can be purchased from any Departmental Post office or banks. The certificate can be encashed after 2 & 1/2 years from the date of issue. National Savings Certificate (NSC) can be used as collateral security to get loan from banks. Investment up to Rs 1.5 lakh qualifies for income tax rebate under section 80C.
Story first published: Thursday, July 14, 2016, 9:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X