సిబిల్ క్రెడిట్ స్కోర్ స్టేట్‌మెంట్ కోసం ఎంత ఖర్చవుతుంది?
ఈ రోజుల్లో బ్యాంకులకు దగ్గరకు వెళ్లి రుణం కోసం ప్రయత్నిస్తే వాళ్లు మనల్ని అడిగేది మీ క్రెడిట్ స్కోర్ ఎంత అని. అందుకే రుణం కోసం వెళ్లేముందు క్రెడిట్‌స్కోర్‌ను తెలుసుకోవడం మంచిది. క్రెడిట్‌స్కోర్‌ను అందించేవాటిలో సిబిల్ ఒక ప్రముఖ క్రెడిట్ బ్యూరో.
సిబిల్ క్రెడిట్‌స్కోర్ తెచ్చుకునేందుకు ఎంత ఖర్చు అవుతుంది?
మీకు ఎంత తరచుగా క్రెడిట్ స్కోర్ కావాలనే దాన్ని బట్టి దానికయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుంది. త్రైమాసికానికి ఒకసారి క్రెడిట్‌స్కోర్ కావాలని సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అది రూ. 1200 వరకూ అవుతుంది. స్కోర్ నివేదిక కోసం రూ. 250 ఆదా అవుతుంది. అంటే మొత్తం రూ. 1200 కే ఏడాదిలో నాలుగు క్రెడిట్ స్కోర్ నివేదికలను తెప్పించుకోవచ్చు.
మీరు తరచుగా లోన్ డిఫాల్ట్ అవుతుంటే తప్ప క్రెడిట్‌స్కోర్ అంత తక్కువగా ఉండే అవకాశం ఉండదు. సరైన సమయానికి రుణ చెల్లింపులు జరుపుతూ ఉంటే రుణ చరిత్ర నివేదికల(క్రెడిట్ రిపోర్టుల) అవసరం ఉండదు. ఏడాదికి రెండు క్రెడిట్ స్కోర్ నివేదికలను కావాలనుకుంటే అందుకోసం సిబిల్ సంస్థకు మీరు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది.
అలా కాకుండా అప్పటికప్పుడు ఒకసారి రుణ చరిత్ర నివేదిక కావాలనుకుంటే అందుకోసం రూ. 550 ఖర్చవుతుంది. అందుకోసం మా సలహా ఏంటంటే మీరు క్రమంగా వాయిదాలు చెల్లిస్తున్నట్లయితే ఏడాదికొకసారి రిపోర్టు కావాలనుకునే అప్షన్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే అన్ని రిపోర్టులు తెప్పించుకోవడం వల్ల మీకు పెద్దగా అదనపు ప్రయోజనం ఉండకపోగా ఖర్చు అధికమవుతుంది.

మీకు సిబిల్ స్కోర్ అవసరమేమి?
రుణం తీసుకున్న వారికి దాన్ని తీర్చే ఆర్థిక స్థోమత ఉందా లేదా అని నిర్దారించుకోవడం ద్వారా రుణాల్లో మొండి బకాయిలను అరికట్టడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిసి ఏర్పాటుచేసుకున్న సంస్థే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీన్నే 'సిబిల్'గా వ్యవహరిస్తున్నారు. క్రెడిట్‌బ్యూరోలు ఇస్తున్న నివేదిక ఆధారంగానే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. మీ క్రెడిట్ స్కోర్ మంచిగా లేకపోతే రుణం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీ సిబిల్ క్రెడిట్ స్కోర్ 700 పైగా ఉంటే బాగా ఉన్నట్లు భావిస్తారు.
సిబిల్ సంస్థకు వ్యక్తుల క్రెడిట్‌స్కోర్ గురించి ఎలా తెలుస్తుంది?
సిబిల్ బ్యాంకుల వద్ద నుంచి మీ రుణ వివరాలు, చెల్లింపు నివేదికలను తెప్పించుకుంటాయి. మీ డిపాజిట్లు ,ఆదాయం లాంటి వివరాలు క్రెడిట్ బ్యూరోలకు తెలిసే అవకాశం లేదు. మీరు చేసిన రుణ విచారణలు, రుణ చెల్లింపు వివరాలు వంటి వాటి గురించి మాత్రమే అవి సమాచారాన్ని సేకరిస్తాయి.


Click it and Unblock the Notifications