For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్ (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: హైదరాబాద్‌ సమీపంలో మరో ఐటీ సెజ్ రాబోతోంది. రంగారెడ్డి జిల్లాలోని 2.51 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సెజ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ సాప్ట్‌వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం అనుమతి కోరింది.

వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన ఈ నెల 23న జరిగే బోర్డ్ ఆఫ్ అప్రూవల్(బీఓఏ)లో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా మరో ఎనిమిది సెజ్‌ల ఏర్పాటుపై బీఓఏ పరిశీలించనుంది.

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

వీటిలో సెజ్ అభివృద్ధికి మరింత గడువు కోరిన కాకినాడ పోర్ట్ ట్రస్ట్, జీపీ రియల్టర్స్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 30న జరిగిన సమావేశంలో 13 సెజ్ డెవలపర్లకు ప్రభుత్వం మరింత గడువునిస్తూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

19 మంది సభ్యులు కలిగిన బీఓఏ బృందం దేశ వ్యాప్తంగా సెజ్ కార్యకలాపాలను చూస్తుంది. ఈ బృందం సెజ్ డెవలపర్లకు సింగిల్ విండో అనుమతులను ఇస్తుంది.

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి గాను సెజ్‌ల నుంచి రూ. 2.21 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. దీంతో పాటు ఈ ఏడాది ఆర్ధిక మొదటి ఆరు నెలల కాలానికి గాను 15.44 లక్షల ఉద్యోగాలను కల్పించాయి.

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్

దేశంలో ఐటీ రంగానికి ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్న ఈ సెజ్‌లు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న మ్యాట్ కారణంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాట్‌ను తొలగించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖను కోరుతోంది.

English summary

హైదరాబాద్‌లో 'కాగ్నిజెంట్' సెజ్ (ఫోటోలు) | Cognizant seeks government nod to set up SEZ in Telangana

Cognizant Technologies Services Pvt Ltd has sought government approval to set up a special economic zone (SEZ) in Telangana.
Story first published: Monday, February 8, 2016, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X