For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు (ఫోటోలు)

By Nageswara Rao
|

ముంబై: జైల్లో శిక్షాకాలాన్ని అనుభవిస్తున్న 140 మంది ఖైదీలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎం కార్డులు జారీ చేసింది. రాబోయే రోజుల్లో జైల్లో ఉన్న 800 మంది ఖైదీలకు ఈ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంక్ అధికారులు ఉన్నారు.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న 140 మంది ఖైదీలకు ప్రయోగాత్మకంగా ఏటీఎం కార్డులు బుధవారం అందజేశారు. జైల్లో ఎంపిక చేసిన ఖైదీలకు మాత్రమే ఈ ఏటీఎం కార్డులను అందజేసినట్లు మహారాష్ట్ర అదనపు డీజీపీ(జైళ్లు) డాక్టర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ వెల్లడించారు.

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు

మహారాష్ట్రలోని 9 సెంట్రల్ జైళ్లలో 10,000 మందికి పైగా ఉన్న ఖైదీలకు భవిష్యత్తులో ఈ సేవలను విస్తరిస్తామని ఆయన తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా నాగ్‌పూర్ సెంట్రల్ జైలుని ఎంచుకున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు

జైలు లోపల సబ్బులు, నూనె, తినుబండారాలు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఖైదీలు ఈ కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే నెలకు గరిష్ఠంగా రూ.2,500 మాత్రమే ఒక ఖైదీ ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు

అంతేకాదు ఖైదీల బంధువులు కూడా సంబంధిత బ్యాంకు ఖాతాల్లో గరిష్ఠంగా రూ.2,500 వరకు మాత్రమే నగదును డిపాజిట్‌ చేసే అవకాశాన్ని కల్పించారు. శిక్ష పూర్తైన తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాతకూడా ఖైదీలు ఈ ఖాతాలను కొనసాగించవచ్చని ఆయన వెల్లడించారు.

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు (ఫోటోలు)

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు (ఫోటోలు)

జైలు ఆవరణలో ఖైదీల కోసం మూడు నెలల పాటు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినట్టు గుర్తు చేశారు. గతేడాది యోగా దినోత్సవం రోజున నాగ్‌పూర్ సెంట్రల్ జైలుని సందర్శించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖైదీలతో కలిసి యోగా చేశారు.

English summary

ఖైదీలకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు (ఫోటోలు) | First in Maha: Nagpur Central Jail inmates get SBI ATM cards

Around 140 inmates of the Central Prison here were given State Bank of India (SBI) ATM cards on Wednesday, Jan 27 for use inside the premises, with plans to extend the service to all 800 prisoners of the facility.
Story first published: Thursday, January 28, 2016, 13:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X