For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయంగా నౌకా నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారతో నిర్మించే నౌకలపై 20 శాతం మేర ఆర్ధిక సహాయం అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ. 4,000 కోట్ల మేర బడ్జెట్‌పరమైన మద్దతు అవసరమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

అందులో పెట్టుబడులు, టర్నోవర్ పరంగానే కాకుండా ఉపాధి అవకాశాలపరంగా కూడా మౌలిక రంగం స్థాయిలో ప్రభావం చూపే నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

నౌకను డెలివరీ ఇచ్చిన తేదీ నుంచి ప్రారంభించి ఈ ఆర్ధిక సహాయాన్ని అందించనున్నారు. అంతేకాదు ప్రతి ఏటా ఈ సహాయాన్ని మూడు శాతం వంతున తగ్గిస్తారు. నౌకానిర్మాణ రంగానికి పన్నులపరమైన ప్రయోజనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగ హోదా తదితర అంశాలు కూడా తాజా ప్రతిపాదనలో ఉన్నాయి.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

మరోవైపు దేశంలోని 106 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జాతీయ జలమార్గాల బిల్లు 2015కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో ఐదు జాతీయ జలమార్గాలున్నాయి.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత

దీంతో పాటు ఆహార ధాన్యాల ప్యాకేజింగ్‌కు జూట్ బ్యాగ్‌ల వినియోగాన్ని తప్పనిసరి చేసే ప్రతిపాదనను ఆర్ధిక వ్వవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈ) ఆమోదించింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా 3.7 లక్షల మంది జూట్ కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. ఆహార ధాన్యాల్లో 90 శాతం, చక్కెరలో 20 శాతం జూట్ ప్యాకేజింగ్‌కు కేటాయించాలి.

English summary

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత | Rs 4,000-cr subsidy push for domestic shipbuilders

Rs 4,000-cr subsidy push for domestic shipbuilders.
Story first published: Thursday, December 10, 2015, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X