For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్ (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ రెండూ ప్రపంచాన్నే మీ అరచేతిలోకి తీసుకొచ్చాయి. గతంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే నేరుగా ఆయా కంపెనీల షోరూంలకు వెళ్లి సదరు ఉత్పత్తులను నిశితంగా పరిశీలించి కొనుగోలు వినియోగదారులు చేసేవారు.

కానీ ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ లాంటి ఈ కామర్స్ దిగ్గజాలు రంగ ప్రవేశం చేసిన తర్వాత కోనుగోలు స్వరూపమే మారిపోయింది. ఇంటివద్దే కూర్చుని ఆర్డర్లు ఇవ్వడం, వాటిని ఇంటి వద్దే తీసుకోవడం మొదలైంది. దీంతో ప్రస్తుత రోజుల్లో షోరూంలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది.

 ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

అయితే మనలో చాలా మంది ఆన్‌లైన్ కొనుగోలుతో సంతృప్తి చెందని కస్టమర్లు సైతం ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ త్వరలో ‘ఆఫ్‌లైన్' విక్రయాలకు తెరలేపుతోంది.

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

ఈ విధానం కింద ప్లిప్‌కార్ట్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ స్టోర్లను సందర్శించే కస్టమర్లు నేరుగా ప్రదర్శనకు పెట్టిన ఉత్పత్తులను పరిశీలించి అక్కడికక్కడే ఆర్డర్ చేయవచ్చు.
ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

తద్వారా స్టోర్‌లోనే మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తిని తమ వెంటే తీసుకెళ్లే వెసులుబాటును కూడా ఫ్లిప్‌కార్ట్ కల్పించనుంది. ప్రస్తుతం ప్లిఫ్‌కార్ట్ యాప్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తి ఇంటి వద్దకు రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.
ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా ఉత్పత్తులను కోనుగోలు చేసి, నేరుగా ప్లిప్‌కార్ట్ స్టోర్‌లోకి వెళ్లి మీ ఆర్డర్‌ను అందుకోవచ్చు. ఇప్పటికే ప్లిప్‌కార్ట్ 19 నగరాల్లో 30 ఎక్స్‌పీరియన్స్ జోన్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే వీటికి తగినంత ప్రాచుర్యాన్ని కల్పించలేదు.

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్

దేశంలోని టైర్-3, టైర్-4 నగరాలపై ఫ్లిప్‌కార్ట్ సంస్ధ ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కాలంలో ఫ్లిప్‌కార్ట్ సంస్ధ 'బిగ్ బిలియన్ డేస్ సేల్' పేరిట నిర్వహించిన ఆఫర్‌కు మంచి ప్రజాదరణ లభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోజున ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ క్రాష్ అయిపోయేంతేలా.

English summary

ఇక ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్ (ఫోటోలు) | Flipkart to open experience stores soon

Online retail giant, Flipkart is planning to marry its online business with the offline sales market. In a move to expand operations, Flipkart is working towards opening what they call an "Assisted E-Commerce Model."
Story first published: Wednesday, October 28, 2015, 16:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X