హైదరాబాద్: కుటుంబ సమేతంగా హైదరాబాదు వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ దంపతులు గోల్కొండ కోటను సందర్శించారు. సాయంత్రం 6.45కు కోటకు చేరుకున్న వీరు తెలంగాణ పర్యాటక శాఖ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షోను ఆయన ఆసక్తిగా తిలకించారు.
అనంతరం అక్కడి నుంచి వెళుతూ సందర్శకుల పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు. ‘‘అద్భుతమైన ప్రదర్శనిది. ఇక్కడ గొప్ప వాతావరణాన్ని సృష్టించారు. మీరు చరిత్రను సజీవంగా ఉంచుతున్నారు'' అంటూ ఆయన ఆ పుస్తకంలో తెలంగాణ పర్యాటక శాఖ కృషిని ఆకాశానికెత్తేశారు.

ఆన్‌లైన్ కొనుగోళ్లకు రుణాలు: ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
అంతక ముందు నగరంలోని సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 30వ సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ స్మారక ఉపన్యాసంలో పాల్గొన్న ఆయన స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ఆర్థిక సంస్కరణలను అమలుచేయడంలో ప్రస్తుతం దేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోందని, అయితే, ఆర్థిక వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు తాము శ్రమిస్తున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్ కొనుగోళ్లకు రుణాలు: ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
గత కొన్నేళ్ళుగా ఎగుమతులు ఆశాజనకంగా లేనందున ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక ప్రగతి సాధన కోసం అన్ని దశల్లోనూ మన శక్తి సామర్థ్యాలను వినియోగించాలని పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక వసతులు, జాతీయ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అదే సమయంలో జాతీయ ఆర్థిక వృద్ధిని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు.

ఆన్‌లైన్ కొనుగోళ్లకు రుణాలు: ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
రాజన్ తన ప్రసంగంలో స్థూలస్థాయి సుస్థిరత, మానవవనరులు, వాణిజ్య వాతావరణం, పన్నుల విధానం, న్యాయ వ్యవస్థ, వనరుల కేటాయింపు తదితర అంశాలు మన ఆర్థిక శక్తిని ద్విగుణీకృతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. రుణ ఎగవేతదారులు ఏవిధంగానూ తప్పించుకోని విధంగా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు.

ఆన్‌లైన్ కొనుగోళ్లకు రుణాలు: ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించేవారిపై నిఘా పెట్టేలా రాష్ట్రస్థాయి కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు భాగస్వాములుగా ఉండాలని అన్నారు. అన్ని స్థాయిల్లోనూ పారదర్శకత అన్నదే ప్రస్తుతం దేశమంతటా వినిపిస్తున్న అభివృద్ధి మంత్రమని ఆయన పేర్కొన్నారు.

ఆన్‌లైన్ కొనుగోళ్లకు రుణాలు: ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
ఈ ఉపన్యాస కార్యక్రమంలో కొందరు సైబర్ నేరాలపై అడిగిన ప్రశ్నలకు డాక్టర్ రఘురామ్ రాజన్ సమాధానాలిచ్చారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము గల్లంతయితే ఫిర్యాదు ఇవ్వడానికి వీలుగా 24 గంటలపాటు పనిచేసే ఫిర్యాదుల విభాగం ఉండాలన్న పలువురు ప్రతినిధుల ఆలోచనను ఆయన స్వాగతించారు. చట్టాలను అమలుచేసే పోలీసు వ్యవస్థతో బ్యాంకర్లు కలిసి పనిచేయాలన్నారు.

ఆన్‌లైన్ కొనుగోళ్లకు రుణాలు: ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
కార్యక్రమంలో సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణా బహుగుణ, జాయింట్ డైరెక్టర్ ఉమేష్ షరాఫ్, తెలంగాణా డీజీపీ అనురాగ్ శర్మ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications