For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

By Nageswara Rao
|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేట్ల కోత ప్రయోజనాలను ఖాతాదారులకు పూర్తి స్థాయిలో బదలాయించడానికి బ్యాంకులు ఇష్టపడటం లేదని, తమ సొంత ప్రయోజనాలకే దీన్ని ఉపయోగించుకుంటున్నాయని ఇండియా రేటింగ్స్ విమర్శించింది.

ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినా బ్యాంకులు మాత్రం ఆ మొత్తం ప్రయోజనాలను ఖాతాదారులకు బదిలీ చేయడం లేదని, దీనివల్ల పరపతి సంక్రమణ పూర్తిగా దారితప్పే ప్రమాదం ఉందని బ్యాంకులను హెచ్చరించింది.

ఈ ఏడాది జనవరి నుంచి ఆర్‌బీఐ మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల మేర పాలసీ రేట్లను తగ్గించగా.. బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీ రేట్లను సగటున 50 బేసిస్ పాయింట్లే తగ్గించాయి. కానీ ఏడాది కాల వ్యవధి ఉండే డిపాజిట్ల రేట్లలో మాత్రం ఏకంగా 130 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టాయి.

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

'గత 18 నెలల్లో చూసుకున్నా వాణిజ్య పత్రాలు, డిపాజిట్ సర్టిఫికెట్ల రేట్లు 150 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. గత ఏడాది కాలంలో బ్యాంకుల డిపాజిట్ రేట్లు, మార్కెట్ రేఠ్ల విషయంలో మాత్రం కీలక రేట్ల బదిలీ జరిగింద'ని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

ఇటీవల జరిగిన నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలోనూ ఆర్‌బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'ఆర్‌బీఐ విధాన చర్యలను మార్కెట్లు కేవలం వాణిజ్య పత్రాలు, కార్పోరేట బాండ్ల రూపంలో మాత్రం బదిలీ చేసినట్లు కనిపిస్తోంది' అని పేర్కొన్నారు.

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

రేట్ల బదిలీ విషయంలో బ్యాంకులు దారితప్పాయని స్పష్టంగా తెలుస్తోందని, దీనిని సరిదిద్దాల్సిన అవసంర ఉందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ఆర్‌బీఐ రేపోరేటును తగ్గించి ముందుకు వచ్చినా, చివరకు ఖాతాదారుడికి ప్రయోజనం దక్కడం లేదని వ్యాఖ్యానించింది.

 వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తాయి. కానీ రేపో రేటు పెంచినప్పుడు మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం పెంపును ఖాతాదారులకే బదిలీ చేస్తాయి. 2012లో రెపో రేటును ఆర్‌బీఐ అర శాతం తగ్గించి 8 శాతానికి చేర్చింది.

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం

ఆ సమయంలో బ్యాంకులు మాత్రం కేవలం పావు శాతం మాత్రమే రేట్లను తగ్గించాయి. 2010, 2011 మధ్య ఆర్‌బీఐ 10 సార్లు రెపో రేటును పెంచింది. సుమారు 3 శాతం వరకు పెంచింది. దీంతో ప్రముఖ బ్యాంకులు బేస్ రేట్లను 275 నుంచి 300 బేసిస్ పాయింట్ల వరకూ పెంచాయి.

English summary

వడ్డీరేట్ల తగ్గింపు: కస్టమర్ల కంటే బ్యాంకులకే లాభం | Banks reap benefits of monetary policy, not customers: India Ratings

Banks have reaped the benefits of RBI's monetary policy, and customers have not got the full benefits of the rate cuts, according to a study by India Ratings and Research.
Story first published: Wednesday, October 7, 2015, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X