For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్‌బీఐ కరుణించినా ఎస్‌బీఐ దయ చూపలేదు

By Nageswara Rao
|

ముంబై: ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ రెపోరేటుని అరశాతం తగ్గించిన నేపథ్యంలో దేశంలోని చాలా వరకు బ్యాంకులు ప్రామాణిక రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే రుణాలపై వడ్డీరేటు అదే స్థాయిలో తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు.

అయితే అలాంటిదేమీ ఉండదని ఎస్‌బీఐ ప్రకటనను బట్టి తెలుస్తోంది. ప్రామాణిక రేటును 0.40 శాతం తగ్గించి, 9.30 శాతానికి పరిమితం చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించినా, గృహ రుణాలు తీసుకున్న, తీసుకోబోయే వారికి పెద్దగా ప్రయోజనం ఉండేలా లేదు.

ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

ఎందుకంటే, గృహ రుణాలపై వడ్డీ రేటు, ప్రామాణిక రేటుపై 0.70 శాతం వరకు అధికంగా, అంటే గరిష్టంగా 10 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించి ఎస్‌బీఐ తన స్థానిక ప్రధాన కార్యాలయాలకు జారీచేసిన ఒక సర్క్యులర్‌లో గృహ రుణాలపై 20 బేసిస్ పాయింట్ల తగ్గింపునే సూచించింది.

ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

ఈ సర్క్యులర్ ప్రకారం ఆర్‌బీఐ అరశాతం రెపో కోత నేపథ్యంలో కేవలం 20 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ప్రయోజనం మాత్రమే బ్యాంక్ గృహ రుణ గ్రహీతలకు అందుతుందన్నమాట. దీంతో మహిళా కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 9.7 శాతం నుంచి 9.5శాతానికి, ఇతర కస్టమర్లకు 9.75 శాతం నుంచి 9.55 శాతానికి తగ్గుతుంది.

 ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

మిగిలిన ఖాతాదారులకు ఇప్పటివరకు ప్రామాణిక రేటుపై 5 బేసిస్ పాయింట్లు అదనంగా (9.75 శాతం) వసూలు చేస్తున్నారు. ఇకపై 25 బేసిస్ పాయింట్లు అదనంగా 9.55 శాతం అవుతుంది. ఈ రెండు రేట్లు బేస్ రేటుకంటే 20-25 బేసిస్ పాయింట్లు అధికం.

 ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గేది 0.20 శాతమే

కాగా తాజా నిర్ణయంపై బ్యాంక్ అధికారులు కొందరు వివరణ ఇస్తూ 2013 డిసెంబర్ నుంచీ 70 బేసిస్ పాయింట్లు బేస్ రేటు తగ్గితే, గృహ రుణాలపై ఇప్పటికి 75 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రుణాలపై రేటును బేస్ రేటుతో సమంగా తగ్గించలేదని వారు తెలిపారు.

English summary

ఆర్‌బీఐ కరుణించినా ఎస్‌బీఐ దయ చూపలేదు | SBI to charge 9.50% to women home borrowers and 9.55% to other home loan borrowers

State Bank of India has increased spread on home loans after aggressively lowering its lending rates by 40 basis points to 9.30% last week.
Story first published: Monday, October 5, 2015, 11:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X