For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరీ సుందర్ పిచాయ్: తెలుసుకోవాల్సిన విషయాలు(ఫోటోలు)

By Nageswara Rao
|

భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (43) గూగుల్ అల్ఫాబేట్ కొత్త సీఈఓగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని సంస్ధ ప్రతినిధులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. గూగుల్‌లో జరుగుతున్న మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా గూగుల్ ఆల్ఫాబేట్ పేరిట మరో కొత్త సంస్ధను ఏర్పాటు చేస్తున్నారు.

గూగుల్ ఆల్ఫాబేట్‌కు అధ్యక్షుడిగా సెర్జరీ బిన్ ఉంటారు. సీఈఓగా సుందర్ పిచాయ్‌ని నియమించారు. గూగుల్ అల్ఫాబేట్ కొత్త సీఈవోగా సుందర్ పిచాయ్‌ని నియమించిన నేపథ్యంలో ఆయన గురించిన మరింత సమాచారం పాఠకులకు ప్రత్యేకం.

గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

తమిళనాడులో జన్మించిన సుందర్ ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ విద్యను అభ్యసించారు. స్టాన్ ఫోర్డ్ వర్శిటీ నుంచి ఎంఎస్, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు.

 గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ లో చేరకుముందు మేనేజ్ మెంట్ సేవలందిస్తున్న మెక్ కిన్సే కంపెనీ, అప్లయిడ్ మెటీరియల్ విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. 2004లో గూగుల్ ప్రొడక్టు మేనేజ్మెంట్ విభాగంలో చేరి, విప్లవాత్మక గూగుల్ క్రోమ్ తయారీ టీమ్‌కు నేతృత్వం వహించారు.

 గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

అతి తక్కువ కాలంలో ఫైర్ ఫాక్స్, గూగుల్ టూల్ బార్, డెస్క్ టాప్ సెర్చ్, గాడ్జెట్స్ రూపకల్పనలో భాగం పంచుకున్నారు. సెప్టెంబర్ 2008లో క్రోమ్ వెబ్ బ్రౌజర్ ఆవిష్కరణ అనంతరం ఏడాదిలోనే నోట్ బుక్స్, డెస్క్‌టాప్‌లకు క్రోమ్ బ్రౌజర్‌ను తయారు చేసి సంస్థ ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు.

గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ అల్ఫాబేట్ సీఈఓగా సుందర్ పిచాయ్

ప్రపంచపు స్మార్ట్ ఫోన్ రంగాన్ని మరో మలుపు తిప్పిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ రూపకల్పనలోనూ పాలు పంచుకున్నారు. సుందర్ స్వతహాగా మృదు స్వభావి అని, తక్కువగా మాట్లాడతారని, లారీ పేజ్‌కి కుడిభుజం లాంటి వారని యూఎస్ మీడియా అతనిపై ప్రశంసలు కురిపించింది.

English summary

ఎవరీ సుందర్ పిచాయ్: తెలుసుకోవాల్సిన విషయాలు(ఫోటోలు) | India-born Sundar Pichai Named New CEO At Re-organised Google

India-born Sundar Pichai will be the new CEO of Google under a major restructuring at the technology giant, as co-founder Larry Page lauded the IIT alumnus' "progress and dedication" and said it is "time" for him to take over the company's reins.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X