For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

300 కోట్లతో హైదరాబాద్‌లో థామ్సన్ యూనిట్ (పిక్చర్స్)

|

హైదరాబాద్: ఐటీతోపాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా తెలంగాణకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కరణ నేపథ్యంలో ప్రముఖ విదేశీ కంపెనీ థామ్సన్ హైదరాబాద్‌లో టీవీల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో
దేశీయ టెలివిజన్ల విపణిలోకి థామ్సన్‌ టీవీలు రానున్నాయి.

ఎల్‌ఈడీ టెలివిజన్లతోపాటు వాషింగ్‌ మెషీన్లు, ఏసీల వంటి గృహోపకరణాలను పారిస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్నోకలర్‌ గ్రూప్‌ దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనుంది. టెక్నోకలర్‌ గ్రూప్‌ థామ్సన్‌ బ్రాండ్‌తో టీవీలు, గృహోపకరణాలను విక్రయిస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన రెసొల్యూట్‌ ఎలక్ట్రానిక్స్‌తో టెక్నోకలర్‌ బ్రాండ్‌ లైసెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన తయారీ యూనిట్‌లో రెసొల్యూట్‌ ఎలక్ట్రానిక్స్‌ థామ్సన్‌ టెలివిజన్లను తయారు చేస్తుంది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు టెలివిజన్లను సరఫరా చేస్తారు.

థామ్సన్‌ ఎల్‌ఈడీ టెలివిజన్లను తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి కెటి రామారావు విపణిలోకి విడుదల చేశారు. ఆగస్టు నెలాఖరుకు థామ్సన్‌ టెలివిజన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా విధానాన్ని మన రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుపర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. థామ్సన్‌ తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మరిన్ని మొబైల్‌ ఫోన్ల కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు.

అధికమొత్తంలో ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపన చేపట్టే రాష్ర్టాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వనుందని, ఆ ప్రక్రియకు మన రాష్ట్రం అర్హత పొందే విధంగా పరిశ్రమల స్థాపనను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. థామ్సన్ పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో అగ్రగామి కంపెనీ విక్రయించే ధర కంటే 10-12 శాతం తక్కువ ధరకు విక్రయించడం తమ లక్ష్యమని రెసొల్యూట్‌ డైరెక్టర్‌ ఎ గోపాల్‌ కృష్ణ చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ఐటీతోపాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా తెలంగాణకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కరణ నేపథ్యంలో ప్రముఖ విదేశీ కంపెనీ థామ్సన్ హైదరాబాద్‌లో టీవీల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో

దేశీయ టెలివిజన్ల విపణిలోకి థామ్సన్‌ టీవీలు రానున్నాయి.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ఎల్‌ఈడీ టెలివిజన్లతోపాటు వాషింగ్‌ మెషీన్లు, ఏసీల వంటి గృహోపకరణాలను పారిస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్నోకలర్‌ గ్రూప్‌ దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనుంది. టెక్నోకలర్‌ గ్రూప్‌ థామ్సన్‌ బ్రాండ్‌తో టీవీలు, గృహోపకరణాలను విక్రయిస్తోంది.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌కు చెందిన రెసొల్యూట్‌ ఎలక్ట్రానిక్స్‌తో టెక్నోకలర్‌ బ్రాండ్‌ లైసెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన తయారీ యూనిట్‌లో రెసొల్యూట్‌ ఎలక్ట్రానిక్స్‌ థామ్సన్‌ టెలివిజన్లను తయారు చేస్తుంది.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు టెలివిజన్లను సరఫరా చేస్తారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

థామ్సన్‌ ఎల్‌ఈడీ టెలివిజన్లను తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి కెటి రామారావు విపణిలోకి విడుదల చేశారు. ఆగస్టు నెలాఖరుకు థామ్సన్‌ టెలివిజన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.

టెలివిజన్లతోపాటు ఆడియో వ్యవస్థలు, వాషింగ్‌ న్లు, ఎయిర్‌ కండీషనర్లు తదితరాలను దేశీయ విపణిలోకి థామ్సన్‌ ప్రవేశపెట్టనుంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఎయిర్‌కండీషనర్లు, ఆ తర్వాత రిఫ్రిజిరేటర్లను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కృష్ణ వివరించారు. తయారీ కార్యకలాపాల విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.300 కోట్లు, మార్కెటింగ్‌కు రూ.50 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు.

వచ్చే మూడేళ్లలో టెలివిజన్ల విభాగంలో రూ.900 కోట్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేయాలని కంపెనీ భావిస్తోంది. మొత్తం విక్రయాల ద్వారా రూ.1,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

English summary

300 కోట్లతో హైదరాబాద్‌లో థామ్సన్ యూనిట్ (పిక్చర్స్) | Rs 300 Cr Thomson LED TV Unit to Offer 500 Jobs in State

Home appliances firm Thomson, part of Technicolor S.A., Tuesday committed `300 crore to manufacture LED TVs and other home appliances. According to the company, Thomson’s products will be manufactured at Resolute Electronics India’s facility in Telangana for two years and will employ 500 people.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X