For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెక్ మహీంద్రా Q1 ఫలితాలు అదుర్స్: పెరిగిన షేర్ విలువ

By Nageswara Rao
|

దేశీయ ఐటీ సర్వీసుల సంస్ధ టెక్ మహీంద్రా జూన్‌ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 7.2 శాతం వృద్ధి చెంది రూ.676.07 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన నికరలాభం 630.72 కోట్ల రూపాయలతో పోల్చితే ఇది 7.2 శాతం అధికం. ఇదే సమయంలో కంపెనీ ఆదాయాలు 22.9 శాతం పెరిగి 5121.50 కోట్ల నుంచి 6293.80 కోట్ల రూపాయలకు నమోదైనట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

2014-15 ఆర్థిక సంవత్సరం ఇదేకాలానికి రూ.5,121.50 కోట్ల ఆదాయంపై రూ.630.72 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. తొలి త్రైమాసికంలో ఫలితాలు ముందుగా అంచనావేసిన స్థాయిలో ఉన్నాయని, వచ్చే త్రైమాసికాల్లో పనితీరు మరింత మెరుగుపడే అవకాశం ఉందని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు.

టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో అత్యధికంగా 5843.23 కోట్ల ఆదాయం తమ ఐటి విభాగం నుంచి వచ్చిందని, బిపిఓ విభాగం నుంచి 450.59 కోట్ల రూపాయలు సమకూరిందని ఆయన చెప్పారు. అమెరికన్ కరెన్సీలో కంపెనీ నికర లాభం 1.2 శాతం పెరిగి 10.6 కోట్ల డాలర్లకు చేరుకోగా, ఆదాయం 15.7 శాతం అధికమై 98.9 కోట్ల డాలర్లుగా నమోదైంది.

టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

డిజిటల్‌ విభాగంలో తమ వ్యూహాత్మక పెట్టుబడులు ఆ విభాగంలో తమను బలోపేతం చేస్తాయని, దీనివల్ల అందివచ్చే అవకాశాలు సమర్థవంతంగా కైవసం చేసుకోగలుగుతామని కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ఫలితాల విడుదల కార్యక్రమంలో తెలిపారు.

 టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

గడిచిన త్రైమాసికంలో సరాసరిగా 392 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,03,673కి పెరిగింది. వారిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు 71,997 మంది ఉన్నారు. బిపిఓ విభాగంలో 24,394 మంది పని చేస్తున్నారు.

టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

టెక్ మహీంద్రా నికరలాభం రూ. 676 కోట్లు

జూన్ 30 నాటికి సంస్థ వద్ద రూ.3,350 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. తొలి త్రైమాసికంలో మంచి లాభాలను నమోదు చేయడంతో మంగళవారం స్టాక్ మార్కెట్‌లో టెక్ మహీంద్రా కంపెనీ షేరు 1.35 శాతం లాభపడి రూ. 520 వద్ద ట్రేడ్ అవుతుంది.

English summary

టెక్ మహీంద్రా Q1 ఫలితాలు అదుర్స్: పెరిగిన షేర్ విలువ | Tech Mahindra Q1 Beats Expectations; Net Profit Up 43 Per cent

IT services firm Tech Mahindra has posted a 43 per cent growth in its net profit to Rs 676 crore for the quarter ended June 30, 2015, surpassing the market expectation.
Story first published: Tuesday, July 28, 2015, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X