For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు (ఫోటోలు)

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలాలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మొత్తంలో పెట్టుబుడలు పెట్టారనేది మాత్రం తెలియరాలేదు. బాంబే ఐఐటికి చెందిన భవిష్‌ అగర్వాల్‌, అంకిత్‌ భట్టి ప్రమోట్‌ చేసిన ఓలా కంపెనీ ఈక్విటీలో రతన్‌ టాటా తాజాగా వాటా తీసుకున్నారు.

టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌గా కాకుండా వ్యక్తిగత హోదాలో టాటా ఈ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. రతన్ టాటా ఇప్పటికే వ్యక్తిగత హోదాలో స్నాప్‌డీల్‌, కార్‌దేఖో, పేటిఎం, అర్బన్‌ లాడర్‌ వంటి స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ జియోనీలో కుడా రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.

 ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

వ్యాపార విస్తరణ కోసం 40 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,560 కోట్లు) సమీకరించబోతున్నట్టు ఓలా కంపెనీ ప్రకటించిన మూడు నెలల్లోనే రతన్‌ టాటా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడం విశేషం.

 ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ఈ ఓలా ప్రస్తుతం మార్కెట్ విలువ 250 కోట్ల డాలర్లకు చేరుకుంది.

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

దీంతో పాటు రష్యాకు చెందిన ఆర్ధిక సేవల సంస్ధ డిఎస్‌టి గ్లోబల్‌ కూడా ఓలాలో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం సంస్థ 1.50 లక్షల వాహనాల ద్వారా క్యాబ్ సర్వీసులు అందిస్తున్నది.

 ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

రతన్‌ టాటా తమ కంపెనీలో పెట్టుబడి పెట్టడంపై ‘ఓలా' కంపెనీ ప్రమోటర్‌ భవిష్‌ అగర్వాల్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు

రతన్‌ టాటా వ్యక్తిగత హోదాలో ఇటీవల మా కంపెనీలో పెట్టుబడి పెట్టారని తెలియజేసేందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నేనైతే వ్యక్తిగతంగా చాలా ఉద్వేగంగా ఫీలవుతున్నా, సమకాలీన ప్రపంచంలో పారిశ్రామికవేత్తల్లో ఒకరైనా టాటా నుంచి మా కంపెనీ ఎంతో నేర్చుకోబోతోందని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

English summary

ఓలాలో రతన్‌ టాటా పెట్టుబడులు (ఫోటోలు) | Ratan Tata invests in taxi company Ola

Ratan Tata, chairman emeritus of Tata Sons, has invested in taxi firm Ola in his personal capacity.
Story first published: Thursday, July 2, 2015, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X