For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరళంగా ఐటీ రిటర్న్ ఫామ్: మూడు పేజీలే(ఫోటోలు)

By Nageswara Rao
|

2015-16 సంవత్సరానికి గాను ఆదాయపన్ను శాఖ కొత్తగా మూడు పేజీల సరళీకృత ఐటీఆర్ ఫారాలను నోటిపై చేసింది. పూర్తిగా సరళీకృతం చేసిన మూడు పేజీల ఐటిఆర్‌-2ఎ ఫారం నింపితే సరిపోతుంది. ఈ ఫారంలో గత ఏడాది చేసిన విదేశీ పర్యటనల వివరాలుగానీ, వాడుకలో లేని బ్యాంకు ఖాతాల వివరాలుగానీ నింపాల్సిన పని లేకుండా చేసింది.

విదేశీ ఆస్తులు, వ్యాపార, వృత్తిపరమైన, మూలధన లాభాలు లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల, అవిభక్త హిందూ కుటుంబాలు ఇక ఈ మూడు పేజీల ఐటిఆర్‌-2ఎ నింపితే సరిపోతుంది. పాస్‌పోర్టు ఉంటే ఆ వివరాలు మాత్రం ఈ రిటర్న్‌లో నింపాలి.

ప్రస్తుతం వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు గత ఏడాది ఆ ఖాతాల్లో ఎంత పొదుపు చేసిందో కూడా తెలపాలి. ఇష్టముంటే తమ ట్యాక్స్‌ రీఫండ్స్‌ను జమ చేయాల్సిన బ్యాంకు ఖాతా నంబర్‌ను ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌తో సహా ఐటిఆర్‌-2ఎలో పేర్కొవాలి.

సరళంగా ఐటీ రిటర్న్ ఫారమ్: మూడు పేజీలే

సరళంగా ఐటీ రిటర్న్ ఫారమ్: మూడు పేజీలే

ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ కోసం పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్‌ కార్డు నంబర్‌, రెండు ఈ మెయిల్‌ ఐడీలు సైతం పేర్కొనాలని ఐటి శాఖ ఇందులో పేర్కొంది. వ్యాపార, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు, మూలధన లాభాలు ఆర్జించిన వ్యక్తులు, విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు మాత్రం ఐటిఆర్‌-2 ఫారంలో తమ ఆదాయ, పన్నుల వివరాలు సమర్పించాల్సి ఉంది.

సరళంగా ఐటీ రిటర్న్ ఫారమ్: మూడు పేజీలే

సరళంగా ఐటీ రిటర్న్ ఫారమ్: మూడు పేజీలే

ప్రతి ఏడాది జూన్ 31లోగా రిటర్నులు సంప్రదించాల్సి ఉంది. ఈ ఫైలింగ్ కోసం కొత్త ఐటీఐఆర్ ఫారాలను జూన్ మూడో వారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొత్త ఐటీఆర్ ఫారంలో ఇతర వివరాలను సేకరించాల్సి ఉన్నందున ఈ ఏడాది తేదీని పొడిగించింది.

 ఐటీ రిఫండ్ కోసం కొత్త విధానం

ఐటీ రిఫండ్ కోసం కొత్త విధానం

ఐటీ రిఫండ్‌ను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతా లోనే భద్రంగా జమ చేసే కొత్త విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 50,000లకు మించిన రిఫండ్‌లను పోస్టు ద్వారా చెక్కుల రూపంలో పంపే విధానానికి స్వస్తి చెప్పనుంది.

ఐటీ రిఫండ్ కోసం కొత్త విధానం

ఐటీ రిఫండ్ కోసం కొత్త విధానం

వీటిని కూడా బ్యాంకు ఖాతా ద్వారానే అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కొత్త విధానంపై కసరత్తు చేస్తున్నట్లు సీబీడీటీ ఛైర్‌పర్సన్ అనితా కపూర్ ఇటీవలే తెలిపారు. ఐటీ రిఫండ్ల విషయంలో పన్ను చెల్లింపుదార్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముగింపు పలికేలా కొత్త విధాన లక్ష్యమని చెప్పారు.

English summary

సరళంగా ఐటీ రిటర్న్ ఫామ్: మూడు పేజీలే(ఫోటోలు) | Govt Notifies New and Simplified Income Tax Return Forms

The Income Tax department has notified the new set of ITR forms, including a three-page simplified one, for taxpayers to file their returns for assessment year 2015-16.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X