For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపోలో భాగస్వామ్యంతో హెచ్‌డీఎఫ్‌సీ ప్రీపెయిడ్ మెడికల్ కార్డు

By Nageswara Rao
|

అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ప్రీపెయిడ్ మెడికల్ కార్డులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆవిష్కరించింది. ఇలాంటి కార్డులను ఆవిష్కరించిన తొలి సంస్ధగా హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ మెడికల్ కార్డుల ముఖ్య ఉద్దేశ్యం కార్పోరేట్ సంస్ధలు తమ ఉద్యోగులకు అందించే మెడికల్ అలవెన్స్‌లను నెలవారీగా ఇందులో జమ చేయవచ్చు.

దీంతో పాటు ప్రమాదాలకు సంబంధించి బీమా రక్షణ కల్పించవచ్చు. 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్-అపోలో మెడికల్ బెనిపిట్స్ కార్డు'లలో ప్రతినెలా కొంత మొత్తాన్ని సంస్ధలు నింపితే, వీసా/మాస్టర్ కార్డు మాదిరి వీటిని ఉద్యోగులు తమ వైద్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

HDFC Bank Launches Prepaid Medical Card With Apollo Hospitals

కార్డుని కలిగి ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే రూ. 3 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందజేస్తారు. ఇక ప్రమాదంలో గాయపడితే, ఆసుపత్రుల్లో చికిత్సకు కోసం రూ. 30 వేలు అందిస్తారు. వీటితో పాటు అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన అన్ని నెట్ వర్క్‌లోని మెడికల్ షాపులు, క్లినిక్స్‌లలో కొంత మేరకు రాయితీలను కూడా అందిస్తారు.

English summary

అపోలో భాగస్వామ్యంతో హెచ్‌డీఎఫ్‌సీ ప్రీపెయిడ్ మెడికల్ కార్డు | HDFC Bank Launches Prepaid Medical Card With Apollo Hospitals

The second largest private lender HDFC Bank today launched co-branded medical benefits card with Apollo Hospitals, which allows corporates to disburse medical allowances to their employees and has insurance cover for accidents.
Story first published: Tuesday, May 19, 2015, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X