For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ రోజున మ్యూచువల్ ఫండ్లను అమ్మలేరు, కొనలేరు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 28(శనివారం) ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అయితే స్టాక్ మార్కెట్లు బడ్జెట్ రోజున పనిచేస్తున్నాయి. కానీ ఆ రోజున మ్యూచువల్ ఫండ్లను మదుపర్లు కొనలేరు, అమ్మలేరని తెలుస్తోంది.

'శనివారం మ్యూచువల్ ఫండ్ల కార్యకలాపాలు జరగవు. ఈ రోజున మదుపర్లు మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను కొనలేరు, అమ్మలేరు' అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్‌లకు సాధారణంగా శని, ఆది వారాలు సెలవు రోజులు.

Mutual fund investors cannot buy or sell on Budget day

ఆయా రోజుల్లో ఫండ్ సంస్ధలు తమ డెట్, ఈక్విటీ ఫండ్‌లకు నికర ఆస్తి విలువను కేటాయించవు. తదుపరి పనిచేసే రోజునే కేటాయింపులు జరుగుతాయనే విషయం అందిరికీ తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌ను శనివారం ప్రవెశపెడుతుండటంతో ట్రేడింగ్ జరపాలని బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈలను మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ కోరింది.

English summary

బడ్జెట్ రోజున మ్యూచువల్ ఫండ్లను అమ్మలేరు, కొనలేరు | Mutual fund investors cannot buy or sell on Budget day

Investors will not able to buy and redeem mutual fund units on February 28 even as stock markets remain open on Saturday when Finance Minister Arun Jaitley will present the much-awaited Union Budget.
Story first published: Thursday, February 26, 2015, 13:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X