For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉజ్వల గుజరాత్: రెండో రోజే రూ.25 లక్షల కోట్లు (పిక్చర్స్)

By Srinivas
|

అహ్మదాబాద్: ఉజ్వల గుజరాత్‌ సదస్సు రెండో రోజైన సోమవారం పెట్టుబడుల వరద పారింది. దేశీ విదేశీ కార్పొరేట్‌ సంస్థలు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 21 వేల ఎంవోయులు కుదుర్చుకున్నాయి. గత సదస్సుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. 2013లో 17 వేల ఎంఒయులతో 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన సదస్సులో కుదిరిన పెట్టుబడుల ప్రణాళికలతో పోలిస్తే ప్రస్తుత ఉజ్వల గుజరాత్‌ రెండోరోజు ప్రకటించిన పెట్టుబడులు పది రెట్లు అధికం. ఎంవోయులు ప్రకటించిన కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌, బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌, సుజ్లాన్‌, వీడియోకాన్‌ తదితర దిగ్గజాలున్నాయి. ఈ ప్రతిపాదనలు లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తాయని అంచనా.

ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం ఈ సదస్సు అందరి దృష్టిని ఆకర్షించేందుకు దోహదం చేసిందని గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీ బెన్‌ పటేల్‌ అన్నారు. కొత్త ప్రభుత్వ చర్యలతో సమీప భవిష్యత్‌లో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.

ఉజ్వల గుజరాత్

ఉజ్వల గుజరాత్

గత మూడునాలుగేళ్లుగా దేశం నుంచి విదేశాలకు జరుగుతున్న క్యాపిటల్‌ వలసకు అడ్డుకట్టవేసామన్నారు. ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంపై (ఆర్డినెన్సుల జారీపై) ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అరుణ్ జైట్లీ చెప్పారు.

ఉజ్వల గుజరాత్

ఉజ్వల గుజరాత్

దేశంలో వ్యాపారనుకూల వాతావరణం పెంపొందిస్తామని ఆయన ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానిదే తుది నిర్ణయమని, మంచికైనా చెడుకైనా ఆయనే బాధ్యత వహిస్తారని జైట్లీ చెప్పారు.

ఉజ్వల గుజరాత్

ఉజ్వల గుజరాత్

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. మౌలికవసతుల కల్పన, ఉద్యోగ అవకాశాల పెంపు, అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.

ఉజ్వల గుజరాత్

ఉజ్వల గుజరాత్

తమ చర్యలతో 3- 4 ఏళ్లుగా దేశ నుంచి జరుగుతున్న క్యాపిటల్‌ వలసను అరికట్టామన్నారు. తమ ప్రభుత్వం ఇబ్బందుల్లేని పన్ను వ్యవస్థను ఏర్పాటు చేయనుందని చెప్పారు.

ఉజ్వల గుజరాత్

ఉజ్వల గుజరాత్

రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం మంచిదికాదని, ఆదాయాలు పెంచుకునేందుకు ఇటువంటి విధానాలను అవలంబించమని చెప్పారు.

English summary

ఉజ్వల గుజరాత్: రెండో రోజే రూ.25 లక్షల కోట్లు (పిక్చర్స్) | Vibrant Gujarat Summit: Companies sign 21,000 MoUs, to invest Rs 25 lakh crore


 Corporates from India and abroad pledged to invest an astonishing Rs 25 lakh crore and signed 21,000 MoUs at the Vibrant Gujarat Summit, matching the hype associated with this biennial event conceived by Narendra Modi in 2003 as the then Chief Minister of the state.
Story first published: Tuesday, January 13, 2015, 9:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X