For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నది ఒడ్డున రూ. 400 కోట్లతో అపోలో వైద్య కళాశాల, ఆసుపత్రి

By Nageswara Rao
|

Apollo to set up Rs 400 crore medical college and hospital
న్యూఢిల్లీ: కోల్‌కత్తాకి సమీపంలో రూ. 400 కోట్లతో వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణాన్ని అపోలో ఆసుపత్రి శ్రీకారం చుట్టింది. బాటానగర్ నది ఒడ్డున ప్రాంతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన 14 ఎకరాల స్ధలంలో అపోలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ పేరు మీద ఈ నిర్మాణం జరుగుతోంది.

2017కు పూర్తికానున్న తొలిదశలో 100 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల, 500 పడకల ఆసుపత్రి పనులు పూర్తి అవుతాయని అపోలో గ్రూప్ ఆసుపత్రిల తూర్పు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) రూపాలి బసు చెప్పారు.

150 ఎంబీబీఎస్ సీట్లు, 1000కి ఆసుపత్రి పడకలు రెండోదళ నిర్మాణంలో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. ఇది 2020 కల్లా పూర్తవుతుందని ఆమె తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అపోల్ గ్రూప్‌కు ఒక మెడికల్ కాలేజీ ఉండగా... ఇది రెండవది. ఎంబీబీఎస్‌తో పాటు ఇతర కోర్సులు బోధిస్తామని, వైద్యులు సహా 5,000 మందికి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పించనున్నామని బసు తెలిపారు.

English summary

నది ఒడ్డున రూ. 400 కోట్లతో అపోలో వైద్య కళాశాల, ఆసుపత్రి | Apollo to set up Rs 400 crore medical college and hospital

Apollo HospitalsBSE 0.12 % has started the construction of a Rs 400 crore medical college and hospital with a capacity of 1,000 beds near here.
Story first published: Wednesday, December 3, 2014, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X